
గుంటూరు, సాక్షి: రాజమండ్రి పోలీసుల చేతిలో దారుణంగా హింసించబడ్డ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉదంతంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. బాధితుడు పులి సాగర్‌కు అండగా నిలవాలని వైఎస్సార్సీపీ నేతలను ఆదేశించారాయన.
బుధవారం పులి సాగర్‌ను కొందరు వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్ జగన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఈ సందర్భంలో.. రాజమహేంద్రవరం పోలీసులు తనతో ఎంత అవమానవీయంగా వ్యవహరించారో జగన్‌కు సాగర్ వివరించాడు. అయితే సాగర్‌కు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాదు.. పోలీసుల తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు, జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలకు సూచించారు.
రాజమహేంద్రవరంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దళిత యువకుడు పులి సాగర్‌తో అక్కడి పోలీసులు దారుణంగా వ్యవహరించారు. పోలీసులు చేసిన పని.. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని వాపోయాడతను.
Comments
Please login to add a commentAdd a comment