హైదరాబాద్, సాక్షి: ట్రాన్స్‌జెండర్లు.. ఇక నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కోరు!. కానీ, అవే సిగ్నల్స్ దగ్గర అతిత్వరలో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తూ కనిపించబోతున్నారు. ఈ మేరకు.. సెలక్షన్‌లో భాగంగా గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో తాజాగా వాళ్లకు ఈవెంట్స్ నిర్వహించారు అధికారులు.
ఆసక్తిగా ఉన్న ట్రాన్స్‌జెండర్లను గుర్తించి.. వాళ్ల సేవలను ఉపయోగించుకోవాలని ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు.. ఈవెంట్స్‌కు వచ్చిన వాళ్లకు రన్నింగ్, జంపింగ్ ఇతర పరీక్షలు నిర్వహించారు. అర్హత సాధించిన వారికి ప్రత్యేకంగా ట్రాఫిక్ నిబంధనల అమలుపై శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకోనున్నారు.
ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో పోలీసులు, హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. హోంగార్డుల తరహాలో ట్రాన్స్ జెండర్లను కూడా వాలంటీర్లుగా నియమించనున్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి పది రోజులపాటు ట్రాఫిక్ విధులపై శిక్షణ అందిస్తారు. వీరికి ప్రత్యేక యూనిఫాంతోపాటు ప్రతి నెల నిర్దేశిత స్టైపెండ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక తెలంగాణవ్యాప్తంగా 3 వేల మందికి పైగా ట్రాన్స్ జెండర్లుంటే.. వారిలో నగరంలోనే వెయ్యి మంది ఉన్నట్టు ఒక అంచనా అంచనా.
Comments
Please login to add a commentAdd a comment