Traffic duty
-
హైదరాబాద్: ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్జెండర్లు
హైదరాబాద్, సాక్షి: ట్రాన్స్జెండర్లు.. ఇక నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కోరు!. కానీ, అవే సిగ్నల్స్ దగ్గర అతిత్వరలో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తూ కనిపించబోతున్నారు. ఈ మేరకు.. సెలక్షన్లో భాగంగా గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో తాజాగా వాళ్లకు ఈవెంట్స్ నిర్వహించారు అధికారులు.ఆసక్తిగా ఉన్న ట్రాన్స్జెండర్లను గుర్తించి.. వాళ్ల సేవలను ఉపయోగించుకోవాలని ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు.. ఈవెంట్స్‌కు వచ్చిన వాళ్లకు రన్నింగ్, జంపింగ్ ఇతర పరీక్షలు నిర్వహించారు. అర్హత సాధించిన వారికి ప్రత్యేకంగా ట్రాఫిక్ నిబంధనల అమలుపై శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకోనున్నారు.ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో పోలీసులు, హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. హోంగార్డుల తరహాలో ట్రాన్స్ జెండర్లను కూడా వాలంటీర్లుగా నియమించనున్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి పది రోజులపాటు ట్రాఫిక్ విధులపై శిక్షణ అందిస్తారు. వీరికి ప్రత్యేక యూనిఫాంతోపాటు ప్రతి నెల నిర్దేశిత స్టైపెండ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక తెలంగాణవ్యాప్తంగా 3 వేల మందికి పైగా ట్రాన్స్ జెండర్లుంటే.. వారిలో నగరంలోనే వెయ్యి మంది ఉన్నట్టు ఒక అంచనా అంచనా. -
డ్రంకెన్ డ్రైవర్‌కు ట్రాఫిక్ విధులు
షాద్‌నగర్ టౌన్: మద్యం తాగి కారు నడుపుతూ పట్టుబడిన ఓ డ్రైవర్‌కు షాద్‌నగర్ కోర్టు 2 గంటలు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ టోల్‌ప్లాజా వద్ద కడ్తాల్‌కు చెందిన నర్సింలు మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. గురువారం షాద్‌నగర్ కోర్టులో హాజరుపరచగా.. జడ్జి అతడికి 2 గంటలు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని శిక్ష విధించారు. -
మద్యం మత్తులో డ్రైవ్.. వారం రోజుల జైలు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారికి చెక్ చెప్పేందుకు ఎల్బీనగర్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు మంగళవారం నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో 18 కేసులను నమోదు చేసి బుధవారం కోర్టులో హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ పుష్పాదేశ్‌ముఖ్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుల తల్లిదండ్రులు, భార్యలను పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 13 మందికి రూ.2వేల జరిమానా, అతిగా మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి వారం రోజుల జైలుశిక్ష, ఇద్దరికి రెండు రోజుల ట్రాఫిక్ విధులు నిర్వహించాలని తీర్పు చెప్పారు. -
మందు బాబులకు ట్రాఫిక్ విధులు
హైదరాబాద్: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ దొరికిపోయిన11 మంది బుధవారం ట్రాఫిక్ పోలీసులతో కలసి ఖైరతాబాద్ కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసుల్లా వాహనాల రాకపోకలను నియంత్రించారు. శనివారం రాత్రి మద్యం తాగి వాహనాలు నడుపుతూ వీరు పోలీసులకు పట్టుబడ్డారు. ఎర్రమంజిల్‌లోని న్యాయస్థానం వీరికి ఈ మేరకు శిక్షలు విధించింది. అంతేకాకుండా రూ.9,500 చొప్పున జరిమానా విధించింది.