మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారికి చెక్ చెప్పేందుకు ఎల్‌బీనగర్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు మంగళవారం నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో 18 కేసులను నమోదు చేసి బుధవారం కోర్టులో హాజరు పరిచారు.
రంగారెడ్డి జిల్లా కోర్టులు: మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారికి చెక్ చెప్పేందుకు ఎల్‌బీనగర్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు మంగళవారం నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో 18 కేసులను నమోదు చేసి బుధవారం కోర్టులో హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ పుష్పాదేశ్‌ముఖ్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుల తల్లిదండ్రులు, భార్యలను పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.
మద్యం తాగి వాహనాలు నడిపిన 13 మందికి రూ.2వేల జరిమానా, అతిగా మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి వారం రోజుల జైలుశిక్ష, ఇద్దరికి రెండు రోజుల ట్రాఫిక్ విధులు నిర్వహించాలని తీర్పు చెప్పారు.