మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ దొరికిపోయిన11 మంది బుధవారం ట్రాఫిక్ పోలీసులతో కలసి...
హైదరాబాద్: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ దొరికిపోయిన11 మంది బుధవారం ట్రాఫిక్ పోలీసులతో కలసి ఖైరతాబాద్ కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసుల్లా వాహనాల రాకపోకలను నియంత్రించారు. శనివారం రాత్రి మద్యం తాగి వాహనాలు నడుపుతూ వీరు పోలీసులకు పట్టుబడ్డారు.
ఎర్రమంజిల్‌లోని న్యాయస్థానం వీరికి ఈ మేరకు శిక్షలు విధించింది. అంతేకాకుండా రూ.9,500 చొప్పున జరిమానా విధించింది.