
ఇదొక అందమైన ప్రదేశం.. కానీ...
మనం ఎదైనా సుందరమైన, అద్భుతమైన ప్రదేశాలను సందర్శించినపుడు వాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉండాలని వాటిని కెమెరాల్లో బంధిస్తుంటాం.
ఈ ప్రదేశంలో ఫొటోలు తీయడంపై స్థానిక అధికారులు మాత్రం నిషేధం విధించారు. దీనికి అధికారులు ఓ వింతైన కారణాన్ని చూపుతున్నారు. ఇక్కడకు వచ్చిన పర్యాటకులు ఇక్కడి అందాలను తమ కెమెరాల్లో బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంటారు. అయితే ఈ ఫొటోలను చూసిన వారు మాత్రం జెలసీగా ఫీల్ అవుతున్నారట. అంతేకాకుండా ఇంత అద్భుత ప్రదేశాన్ని వెంటనే చూడలేకపోతున్నామని డిప్రెషన్‌కు లోనవుతున్నారట. ఈ కారణంతో ఫొటోలు తీయడంపై నిషేధం విధించామని అధికారుల చెబుతున్నారు.