ఫొటోగ్రాఫర్‌ను ఢీకొట్టిన సూపర్‌ స్టార్‌ కారు.. | super star car hits photographer | Sakshi
Sakshi News home page

ఫొటోగ్రాఫర్‌ను ఢీకొట్టిన సూపర్‌ స్టార్‌ కారు..

Published Thu, Mar 16 2017 11:17 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఫొటోగ్రాఫర్‌ను ఢీకొట్టిన సూపర్‌ స్టార్‌ కారు.. - Sakshi

ఫొటోగ్రాఫర్‌ను ఢీకొట్టిన సూపర్‌ స్టార్‌ కారు..

బాలీవుడ్‌లో కింగ్‌ఖాన్‌గా పేరొందిన షారుఖ్‌ ఖాన్‌ పేరుకు తగ్గట్టే మనస్సున్న మహారాజు. నిరాడంబరంగా, ఎంత ఎదిగినా ఒదిగే ఉండే తత్వం ఆయనది. తాజాగా ఆయన సాటివారి పట్ల తన స్పృహను, పెద్ద మనసును చాటుకున్నాడు.

'డియర్‌ జిందగీ'లో తనతోపాటు కలిసిన నటించిన అలియా భట్‌ జన్మదినం కావడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు బుధవారం షారుఖ్‌ ఆమెకు ఇంటికి వెళ్లారు. ఎప్పటిలాగే షారుఖ్‌ను చూడగానే ఫొటోగ్రాఫర్‌లు పోటెత్తారు. ఆయన ఫొటోలు తీసుకోవడానికి పోటీపడ్డారు. ఈ హడావిడిలో ఓ ఫొటోగ్రాఫర్‌కు గాయాలయ్యాయి. షారుఖ్‌ కారు వేగంగా వస్తున్న సమయంలో దానిని పట్టించుకోకుండా షారుఖ్‌ ఫొటోలు తీయడంలో ఓ ఫొటోగ్రాఫర్‌ నిమగ్నమయ్యారు. అతను కొత్త ఫొటోగ్రాఫర్‌ అని సమాచారం.

షారుఖ్‌ ఫొటోలు క్లిక్‌ చేస్తున్న ఆనందంలో కారు తనవైపు వస్తున్న విషయాన్ని అతను చూసుకోలేదు. దీంతో అతని కాలిపై నుంచి కారు టైరు వెళ్లింది. గాయపడిన అతన్ని చూసిన వెంటనే షారుఖ్ కారు దిగి వచ్చాడు. తన బాడీగార్డును తోడు ఇచ్చి ఆ ఫొటోగ్రాఫర్‌ను వెంటనే నానావతి ఆస్పత్రికి తరలించాడు. అతను బాగా అయ్యేవరకు తానే చూసుకుంటానని, ఆ ఫొటోగ్రాఫర్‌ వైద్యఖర్చులు కూడా తానే చెల్లిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చాడు. ఈ సందర్భంగా షారుఖ్‌ ఎంతో హుందాగా ప్రవర్తించాడని, గాయపడిన ఫొటోగ్రాఫర్‌కు పూర్తి భరోసా ఇచ్చాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement