క్లిక్ కొట్టి.. అవార్డు పట్టి..
చూపుడు వేలిని కెమెరా మీటపై ఒత్తితే చాలు.. కళ్లెదుట ఉన్న దృశ్యం ఫొటోగా మారిపోతుంది. అయితే ఆ ఫొటోలో జీవన వైవిధ్యాన్ని.. ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిభావంతంగా ఆవిష్కరించాలంటే.. కంటిచూపు ఒక్కటే చాలదు.. మనసుతోనూ ఆ దృశ్యాన్ని చూడగలగాలని అంటున్నాడు పాలచర్లకు చెందిన ఫొటోగ్రాఫర్ గిరి. వృత్తిరీత్యా దివాన్‌చెరువులో ఫొటో స్టూడియో నడుపుతున్న ఈ యువకుడు.. ప్రకృతి అందాలను తన కెమెరాలో అపూరూపంగా బంధించి పలు అవార్డుల
-
‘సాక్షి’ ఫొటోగ్రఫీ పోటీలో మొదటి బహుమతి పొందిన పాలచర్ల యువకుడు
-
గతంలోనూ అనేక పురస్కారాలు పొందిన గిరి
పాలచర్ల (రాజానగరం) :
చూపుడు వేలిని కెమెరా మీటపై ఒత్తితే చాలు.. కళ్లెదుట ఉన్న దృశ్యం ఫొటోగా మారిపోతుంది. అయితే ఆ ఫొటోలో జీవన వైవిధ్యాన్ని.. ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిభావంతంగా ఆవిష్కరించాలంటే.. కంటిచూపు ఒక్కటే చాలదు.. మనసుతోనూ ఆ దృశ్యాన్ని చూడగలగాలని అంటున్నాడు పాలచర్లకు చెందిన ఫొటోగ్రాఫర్ గిరి. వృత్తిరీత్యా దివాన్‌చెరువులో ఫొటో స్టూడియో నడుపుతున్న ఈ యువకుడు.. ప్రకృతి అందాలను తన కెమెరాలో అపూరూపంగా బంధించి పలు అవార్డులు సొంతం చేసుకుంటున్నాడు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ టీవీ ఇటీవల నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీలో గిరి తీసిన ఫొటో మొదటి బహుమతి పొందింది. నాగలికి కట్టిన దున్నలు అదుపు తప్పి పరుగు తీస్తూండగా.. వాటిని అదుపులోకి తెచ్చేందుకు ఒక యువకుడు చేసిన సాహస కత్యాన్ని గిరి తన కెమెరాలో అత్యంత నైపుణ్యంగా బంధించారు. ఈ ఫొటోకు ‘సాక్షి’ టీవీ అవార్డు దక్కింది. కాగా, గత ఏడాది ఏపీ స్టేట్ అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ నిర్వహించిన పోటీలో కూడా గిరి మొదటి బహుమతి సాధించాడు. దీనికిగానూ రూ.5 వేల నగదు, అకాడమీ గోల్డ్ మెడల్ అందుకున్నాడు. అలాగే అమలాపురంలోని కోనసీమ చిత్రకళా పరిషత్ జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించాడు. క్లిక్‌తో అవార్డులు సాధిస్తున్న గిరిని పలువురు అభినందిస్తున్నారు.