సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్
న్యూఢిల్లీ: దేశంలో కోర్టులకు సంబంధించిన వ్యవహారాలు, సుదీర్ఘంగా సాగే న్యాయ వ్యవస్థ ప్రక్రియతో ప్రజలు విసుగెత్తిపోయారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్‌లు చక్కటి ప్రత్యామ్నాయ వేదికలని చెప్పారు. వాటిని ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు. శనివారం సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ వారోత్సవంలో ఆయన మాట్లాడారు.
కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివాదాలను, కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకొనే అవకాశం ఉందని, ఇరుపక్షాల అంగీకారంతో రాజీ పడొచ్చని వెల్లడించారు. న్యాయస్థానాల్లో న్యాయం చేకూర్చే ప్రక్రియ కక్షిదారులకు ఒక శిక్షగా మారిపోయిందని, ఇది నిజంగా న్యాయమూర్తులకు ఆందోళన కలిగించే విషయమని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment