న్యాయవాదుల నిరసనల నడుమ జిల్లా కోర్టు ప్రాంగణంతో పాటు తాలూకా కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 2,569 కేసులు పరిష్కారమయ్యూయి. రాష్ర్టంలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది.
- వరంగల్ లీగల్
వరంగల్ లీగల్ : జిల్లా కోర్టు ప్రాంగణంతో పాటు తా లూకా కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. అయితే, హైకోర్టు సాధన కోసం ఉద్యమిస్తున్న న్యాయవాదులు లోక్ అదాలత్‌ను బ హిష్కరించి ధర్నాకు దిగగా.. వారి నిరసనల నడుమే జాతీయ లోక్ అదాలత్‌లో పెద్దసంఖ్యలో కేసులు పరి ష్కరించారు. ఈ మేరకు రాష్ర్టంలో కేసుల పరిష్కారంలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది. సివిల్, క్రిమినల్ ప్రమాద బాధితుల నష్టపరిహారం చెల్లింపు, ప్రభుత్వ భూసేకరణలో భూములు కోల్పోయిన రైతుల నష్టపరిహారం చెల్లింపులు కేసులు పరిష్కరిం చారు. జిల్లావ్యాప్తంగా 35 సివిల్ కేసులు, 146 క్రిమినల్, 2388 ప్రిలిటిగేషన్ కేసులు కలిపి మొత్తం 2,569 కేసులను పరిష్కరించారు. ఇక ప్రమాదాలకు సంబంధించి 17 కేసుల్లో బాధితులకు రూ.13,39,130, నాలుగు కేసుల్లో రైతులకు రూ.1, 81,135 భూసేకరణ కింద నష్టపరిహారంగా చెల్లించడానికి అంగీకరించారు. కాగా, జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ కోసం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆరు బెంచ్‌లు ఏర్పాటుచేయగా మొదటి అదనపు జిల్లా జ డ్జి కే.బీ.నర్సింహులు, రెండో అదనపు జిల్లా జడ్జి యార రేణుక, సీనియర్ సివిల్ జడ్జిలు డి.సరళాకుమారి, రవీంద్రశర్మ, ఎం.జాన్సన్, సీహెచ్.ఆశాలత, శారదాదేవి, కళ్యాణచక్రవర్తి, రాజేంద్రారెడ్డి, ఆర్.రఘునాథ్‌రెడ్డి, టి.అనిత, బి.చంద్రయ్య వివిధ బెంచ్‌లకు నేతృత్వం వహించారు.
బహిష్కరణ, కోర్టు హాల్ ఎదుట ధర్నా
జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయలోక్ అదాలత్‌ను న్యాయవాదులు బహిష్కరించారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ మేజిస్రేట్(పీడీఎం) కోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నా చేశారు. అయితే, లోపల అదనపు జిల్లా జడ్జిలు నర్సింహులు, యార రే ణుక నేతృత్వంలో బెంచ్ కొనసాగుతుండగా.. బయ ట న్యాయవాదులు నినాదాలు చేస్తుండడంతో కొద్దిసేపటికి న్యాయమూర్తులు వెళ్లిపోయారు. చిల్లా రాజేంద్రప్రసాద్, లెక్కల జలేందర్‌రెడ్డి, ఇ.వేణుగొపాల్, డాగర రాములు, వి.లలితకుమారి, మడ్డి మంజుల, స్వప్న, సత్యరాజ్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌లో 2,569 కేసుల పరిష్కారం
Published Sun, Mar 15 2015 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM
Advertisement
Advertisement