వరంగల్ లీగల్ : రాష్ట్ర బార్ అసోసియేషన్ల ఫెడరేషన్, అడ్వకేట్స్ జాక్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాకు జిల్లా నుంచి వందలాది మంది న్యాయవాదులు తరలివెళ్లారు. అంతకు ముందు జిల్లా కోర్టు ఎదుట హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జయాకర్ మాట్లాడుతూ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తూ తెలంగాణ న్యాయవ్యవస్థ స్తంభించడానికి కారకుడైన హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు సహోదర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకొని తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.వి. రమణ, నాగరాజు, సహాయ కార్యదర్శి అరుణ్‌ప్రసాద్, మహిళా కార్యదర్శి కవిత, కోశాధికారి సిద్దునాయక్ పాల్గొన్నారు.
హైదరాబాద్ తరలిన న్యాయవాదులు
Published Sat, Jul 2 2016 2:14 AM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM
Advertisement
Advertisement