State Bar Association Federation
-
రాష్ట్ర బార్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా అనంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్‌కు శనివారం నూతన కార్యవర్గం ఏర్పాటైంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు ఆవరణలో జరిగిన సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షుడిగా మహబూబ్‌నగర్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంత్‌రెడ్డిని ఎంపిక చేసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.బాలరాజ్, ప్రధాన కార్యదర్శిగా రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.చంద్రశేఖర్‌రెడ్డి, కార్యదర్శిగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు అధ్యక్షుడు డి.జగదీశ్వర్‌రావు ఎంపికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కేఎస్ రాహుల్, బి.జానకి రాములు, జి.విప్లవ్‌రెడ్డి, జి.వినోద్‌కుమార్, కె.శ్రీనివాస్‌రెడ్డి, కె.శేఖర్‌రెడ్డి, బి.యోగేశ్వర్రావు, బ్రహ్మయ్య, వి.శ్రీరామ్ కుమార్, ఎన్.కృష్ణ, జగన్మోహన్ గౌడ్, హెచ్.చక్రధర్ ఎంపికయ్యారు. -
హైదరాబాద్ తరలిన న్యాయవాదులు
వరంగల్ లీగల్ : రాష్ట్ర బార్ అసోసియేషన్ల ఫెడరేషన్, అడ్వకేట్స్ జాక్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాకు జిల్లా నుంచి వందలాది మంది న్యాయవాదులు తరలివెళ్లారు. అంతకు ముందు జిల్లా కోర్టు ఎదుట హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జయాకర్ మాట్లాడుతూ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తూ తెలంగాణ న్యాయవ్యవస్థ స్తంభించడానికి కారకుడైన హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు సహోదర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకొని తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.వి. రమణ, నాగరాజు, సహాయ కార్యదర్శి అరుణ్‌ప్రసాద్, మహిళా కార్యదర్శి కవిత, కోశాధికారి సిద్దునాయక్ పాల్గొన్నారు.