- మెగాలోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 1392 కేసులు పరిష్కారం
నిరుపేదలకు న్యాయం అందించాలన్నదే లక్ష్యం
Published Sun, Apr 9 2017 12:16 AM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM
రాజమహేంద్రవరం క్రైం :
నిరుపేదలకు న్యాయం అందించాలన్నదే లక్ష్యంగా నేషనల్ మెగాలోక్ అదాలత్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి తుకారామ్ జీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి ఎల్. వెంకటేశ్వరరావులు పేర్కొన్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పెండింగ్ కేసులను ఇరువర్గాల రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 1392 కేసులు పరిష్కరించారు. రాజమహేంద్రవరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికార సంస్థ భవనంలో శనివారం మెగాలోక్ అదాలత్ నిర్వహించారు. మూడు బెంచీలు ఏర్పాటు చేసి కేసులు పరిష్కరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి తుకారామ్ జీ, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎల్. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 391 కేసులు పరిష్కరించారు. న్యాయమూర్తులు నీలిమా, వై పరశురామ్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఇరువర్గాలు రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించాలనే దృక్పథంతో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికార సంస్థ భవనంలో పర్మినెంట్ లోక్ అదాలత్ ఏర్పాటు చేశామన్నారు.
Advertisement
Advertisement