ఒకేరోజు 3,30,866 కేసుల పరిష్కారం | Lok Adalat Disposes Over 3 Lakh Pending Cases In TS | Sakshi
Sakshi News home page

ఒకేరోజు 3,30,866 కేసుల పరిష్కారం

Published Sun, Feb 12 2023 3:41 AM | Last Updated on Sun, Feb 12 2023 10:23 AM

Lok Adalat Disposes Over 3 Lakh Pending Cases In TS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌కు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఒకేరోజు రికార్డు స్థాయిలో 3,30,866 కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో ప్రి–లిటిగేషన్‌ కేసులు 9,262.. వివిధ కేటగిరీల్లోని పెండింగ్‌ కేసులు 3,21,604 ఉన్నాయి.

బాధితులకు రూ.255.48 కోట్ల పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ పి.నవీన్‌రావు, హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ రాష్టవ్యాప్తంగా లోక్‌ అదాలత్‌ను పర్యవేక్షించారు.  

హైకోర్టులో 365 కేసులు..  
హైకోర్టు పరిధిలో జరిగిన అదాలత్‌ కార్యక్రమంలో జస్టిస్‌ జి.అనుపమ చక్ర­వర్తి, జస్టిస్‌ జి.శ్రీదేవి, మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జీవీ సీతాపతి పాల్గొన్నా­రు. హైకోర్టులో 365 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.26.5 కోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇక జిల్లా కోర్టుల్లో స్థానిక న్యాయమూర్తులు కేసులను పరిష్కరించారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement