'ప్రజలంతా లోక్ అదాలత్ల గురించి తెలుసుకోవాలి' | Prime Minister Narendra Modi addresses a conference on the occasion of Legal Services Day | Sakshi
Sakshi News home page

'ప్రజలంతా లోక్ అదాలత్ల గురించి తెలుసుకోవాలి'

Published Mon, Nov 9 2015 11:30 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

Prime Minister Narendra Modi addresses a conference on the occasion of Legal Services Day

ఢిల్లీ: ప్రజలంతా లోక్ అదాలత్ల వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. న్యాయసేవల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన న్యాయసేవా సదస్సులో మోదీ పాల్గొని ప్రసంగించారు. లోక్ అదాలత్ల ద్వారా సామాన్యులకు న్యాయం జరుగుతోందనీ, ఇవి అందిచే న్యాయసేవలను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు.

ఇప్పటివరకు లోక్ అదాలత్ ద్వారా 8.5 లక్షల కేసులు పరిష్కారమయ్యాయని ఆయన వెల్లడించారు. కోర్టులకు రావడానికి ఆర్థీక స్థోమత లేని వారికి లోక్ అదాలత్లు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. ప్రజలందరికీ అభివృద్ధితో పాటు న్యాయసేవలు కూడా అందాల్సిన అవసరముందని తెలిపిన ప్రధాని న్యాయ విశ్వవిద్యాలయాలయాలు లోక్ అదాలత్లకు సంబంధించిన ప్రత్యేక ప్రాజెక్టులను తమ విద్యార్ధులకు ఇవ్వాలని సూచించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement