జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహించారు. ప్రతీ నెల రెండో శనివారం నిర్వహించే లోక్‌అదాలత్‌లో భాగంగా జిల్లాలోని కోర్టుల్లో 17 బెంచీలు ఏర్పాటుచేయగా వివిధ రకాల 2,046 కేసులు పరిష్కారమయ్యాయి.
జాతీయ లోక్ అదాలత్‌లో 2,046 కే సుల పరిష్కారం
Published Sun, Aug 14 2016 12:30 AM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
వరంగల్ లీగల్ : జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహించారు. ప్రతీ నెల రెండో శనివారం నిర్వహించే లోక్‌అదాలత్‌లో భాగంగా జిల్లాలోని కోర్టుల్లో 17 బెంచీలు ఏర్పాటుచేయగా వివిధ రకాల 2,046 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా కోర్టు, మహబూబాబాద్ కోర్టుల్లో 23 సివిల్ కేసులు పరిష్కారం కాగా, జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో కలిపి 173 క్రిమినల్ కేసులు పరిష్కరించారు. ఇంకా 1,740 విద్యుత్ సంబంధిత కేసులు రాజీ మార్గంలో పరిష్కరించగా, ప్రమాద బాధితులకు నష్టపరిహారం చెల్లింపునకు సంబంధించి 23 కేసుల్లో బాధితులకు రూ.54.36 లక్షలు చెల్లించేందుకు వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకరించాయి. లోక్ ఆదాలత్‌లో జిల్లా ప్రధాన జడ్జి, జిల్లా న్యాయాధికార సంస్థ చైర్మన్ ఎం.లక్ష్మణ్, మొ దటి అదనపు జిల్లా జడ్జి కే.బీ.నర్సింహాలు, ఏడో అదనపు జిల్లా జడ్జి సాల్మన్‌రాజ్, సీనియర్ సివిల్ జడ్జి వరప్రసాద్, న్యాయాధికార సేవ సంస్థ కార్యదర్శి జడ్జి నీలిమతో పాటు ఇతర న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యా యవాదులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement