లోక్ అదాలత్‌లో రూ. 1.20 కోట్ల భూతగాదా కేసు పరిష్కారమైంది. మదనపల్లె మండల న్యాయసేవ అధికార సంస్థ చైర్మన్, రెండో అదనపు జిల్లా జడ్జి ఎస్.ఎస్.ఎస్.జయరాజ్ అధ్యక్షతన స్థానిక కోర్టు
మదనపల్లె రూరల్: లోక్ అదాలత్‌లో రూ. 1.20 కోట్ల భూతగాదా కేసు పరిష్కారమైంది. మదనపల్లె మండల న్యాయసేవ అధికార సంస్థ చైర్మన్, రెండో అదనపు జిల్లా జడ్జి ఎస్.ఎస్.ఎస్.జయరాజ్ అధ్యక్షతన స్థానిక కోర్టు ఆవరణలో జరిగిన లోక్‌అదాలత్‌లో జిల్లా జడ్జి ఆనంద్ ఈ కేసులో ఇరు వర్గాలకు రాజీ కుదిర్చారు.
వివాదమిదీ.. మదనపల్లెకు చెందిన గార్ల రాజేంద్ర ప్రసాద్ వాల్మీకిపురానికి చెందిన తబ్జూలోళ్ల స్వర్ణకుమారి వద్ద నాలుగేళ్ల క్రితం రూ. కోటి 10 లక్షలు అప్పు తీసుకున్నారు. ఇందుకు తనఖాగా రూ. కోట్ల విలువ చేసే ఐదు కుంటల స్థలాన్ని రాసిచ్చారు. ఏడాది లోపు అప్పు వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పారు. దాన్ని తీర్చలేదు. ఈ విషయమై ఏడాది క్రితం స్వర్ణకుమారి లోక్‌అదాలత్‌ను ఆశ్రయించడంతో ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తులు వారి మధ్య రాజీ కుదిర్చారు.