విద్యా హక్కుపై చట్టంపై అవగాహన అవసరం
– జిల్లా లోక్ అదాలత్ జడ్జి సోమశేఖర్
కర్నూలు సీక్యాంప్: విద్యా హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా లోక్ అదాలత్ జడ్జి సోమశేఖర్ అన్నారు. ఆదివారం అశోక్‌నగర్‌లోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో అవగాహన కార్యక్రమం రాయలసీమ మహిళా సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ.. విద్య ప్రజల ప్రాథమిక హక్కు అన్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సలహాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడారు. కార్యక్రమంలో రాయలసీమ మహిళా సంఘ్ నాయకురాళ్లు, నిరాశ్రయుల వసతి గృహం సభ్యులు పాల్గొన్నారు.