సత్వర న్యాయమే లోక్ అదాలత్ ధ్యేయం
సత్వర న్యాయమే లోక్ అదాలత్ ధ్యేయం
Published Thu, Mar 30 2017 10:37 PM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM
- జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి
- ఏప్రిల్ 8న దేశవ్యాప్తంగా లోక్‌అదాలత్
బనగానపల్లె రూరల్ : కక్షిదారులకు సత్వర న్యాయమే ధ్యేయంగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి తెలిపారు. దేశ వ్యాప్తంగా రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో ఏప్రిల్ 8వతేదీన నిర్వహించే లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని న్యాయవాదులు, పోలీసులకు సూచించారు. బనగానపల్లె జూనియర్ సివిల్ జడ్జీ కోర్టు బార్ అసోసియేషన్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం జడ్జీ లావణ్యతో కలిసి సమావేశం నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో సామరస్యంగా కక్షిదారులతో చర్చించి ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలన్నారు. రాజీ కాదగిన క్రిమినల్, చెక్‌బోన్స్, రెవెన్యూ, పంచాయతీ, బ్యాంకు రుణాల కేసులు పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సోమశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జెడ్‌వీ కృష్ణారెడ్డి, ఏపీపీ గోపాలకృష్ణ, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు,
Advertisement
Advertisement