సత్వర న్యాయమే లోక్ అదాలత్ ధ్యేయం
సత్వర న్యాయమే లోక్ అదాలత్ ధ్యేయం
Published Sat, Sep 10 2016 9:03 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM
– జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి
కర్నూలు(లీగల్) : కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ ధ్యేయమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి అన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.లోక్ అదాలత్ ద్వారా సమస్యలు పరిష్కారమైతే కక్షిదారులకు సమయం, ధనం ఆదా అయినట్లేనన్నారు. కేసుల పరిష్కారంలో రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని, ఇక్కడి న్యాయవాదులు, పోలీసు శాఖల సహకారం బాగుందని తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్‌లో అధ్యక్షులు కె.ఓంకార్, జిల్లా అదనపు న్యాయమూర్తులు ఎస్.ప్రేమావతి, టి.రఘురాం, వి.వి.శేషు బాబు, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కె.సుధాకర్, సబ్ జడ్జి సి.కె.గాయత్రిదేవి, లోక్ అదాలత్ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్, జూనియర్ సివిల్ జడ్జిలు కె.పద్మిని, ఎం.బాబు, పి.రాజు, కె.స్వప్నరాణి, సీనియర్ న్యాయవాదులు నాగలక్ష్మిదేవి, శివసుదర్శన్, కోటేశ్వరరెడ్డి, కక్షిదారులు పాల్గొన్నారు.
1,707 కేసులు పరిష్కారం...
జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌తో 1,707 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి, కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్ తెలిపారు. ఒకవైపు బంద్ జరుగుతున్న అత్యధిక కేసులు పరిష్కారం కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
Advertisement