నిజామాబాద్ లీగల్, న్యూస్‌లైన్ : లోక్ అదాలత్‌ల ద్వారా కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా అవుతుందని జిల్లా జడ్జి, న్యాయ సేవాసంస్థ అధ్యక్షుడు డాక్టర్ షమీమ్ అక్తర్ అన్నారు.
అలాగే సత్వరం న్యాయం పొందవచ్చన్నారు. కాబట్టి జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే లోక్ అదాలత్‌లను వినియోగించుకోవాలని కోరారు. న్యాయసేవా సదన్‌లో శనివారం మెగా లోక్ అదాలత్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సత్వర న్యాయం అందించే లోక్ అదాలత్‌లతో ఇరు పక్షాల వారు గెలుపొందుతారన్నారు.
రాజీమార్గంలో కేసులను పరిష్కరిస్తామన్నారు. బ్యాంకుల ఫ్రీ లిటిగేషన్ కేసులతోపాటు వివిధ కోర్టుల్లో దాఖలు చేసిన కేసులను కూడా ఈ అదాలత్‌లో పరిష్కరిస్తామన్నారు. అనంతరం కేసులో అప్పటికే చెల్లించిన కోర్టు ఫీజులను వాపసు చేస్తామన్నారు. న్యాయసేవా సంస్థ కార్యదర్శి మహ్మద్ బందె అలి మాట్లాడారు. కార్యక్రమంలో జడ్జిలు బీఎస్. జగ్జీవన్‌కుమార్, కె. రవీంద్రబాబు, ఎం.రాధాకృష్ణ చౌహాన్, ఎన్‌ఎల్ శాస్త్రి, లోక్ అదాలత్ సభ్యులు రాజ్‌కుమార్ సుబేదార్, హెచ్. అంకిత, ఎం. కుసుమ కుమారి, న్యాయవాదులు పాల్గొన్నారు.
అవార్డు అంద చేసిన జిల్లా జడ్జి..
మెగాలోక్ అదాలత్ ప్రారంభంలో జిల్లా జడ్జి డాక్టర్ షమీమ్ అక్తర్ బ్యాంకు కేసులను పరిష్కరించారు. మొత్తం 1,400ల బ్యాంకు కేసులను పరిష్కరించారు. పట్టు విడుపులతో రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకున్న కక్షిదారులను ఆయన అభినందించారు.
లోక్ అదాలత్‌లను వినియోగించుకోండి
Published Sun, Apr 13 2014 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM
Advertisement