
లోక్‌అదాలత్‌తో కేసుల సత్వర పరిష్కారం
జిల్లా జడ్జి నాగమారుతీశర్మ
సెంటినరీకాలనీ : లోక్‌అదాలత్ ద్వారా వివిధ కేసులకు పరిష్కారం లభిస్తుందని జిల్లా జడ్జి నాగమారుతీశర్మ అన్నారు. రాజ్యాంగం, చట్టాల ప్రకారం ఆస్తులపై వ్యక్తులకు హక్కు ఉన్నా బహుళజాతి ప్రయోజనాల దృష్ట్యా వాటిని స్వాధీనం చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని వెల్లడించారు. శనివారం సెంటినరీకాలనీలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో న్యాయ విజ్ఞాన సదస్సు, బుధవారంపేట గ్రామంలో భూసేకరణపై అభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జడ్జి మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ఆస్తిపై యజమానికి సర్వాధికారాలు ఉన్నా.. బహుళజాతి ప్రయోజనాల దృష్ట్యా స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని, అరుుతే పరిహారం అడగడంలో మాత్రం స్వేచ్ఛ ఉంటుందని వెల్లడించారు. పరిహారం చెల్లింపులో అన్యాయం జరుగుతుందని బావిస్తే చట్ట పరిధిలో వివిధరూపాల్లో తన భావాన్ని వ్యక్తీకరించవచ్చన్నారు.
కోర్టులకు వెళితే సమయం వృథాతోపాటు ఆశించిన లాభం కూడా కలగపోవచ్చని, పైగా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముందని పేర్కొన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ తెలంగాణ మెంబర్ సెక్రటరీ ఏ.వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మూడో వ్యక్తితో సంబంధం లేకుండా.. ఇరువురి మధ్య వారధిగా ఉండి సమస్యను పరిష్కరించడమే లోక్ అదాలత్ లక్ష్యమన్నారు.
పరిహారం సక్రమంగా నిర్ణరుుంచాలి
సదస్సులో సర్పంచ్, జెడ్పీటీసీ, నిర్వాసితులు తమ అభిప్రాయాలను వివరించారు. సింగరేణి యాజమాన్యం తమ భూములు తీసుకునే క్రమంలో చుట్టుపక్కల గ్రామాల భూముల ధరలను పరిగణనలోకి తీసుకోవాలని కోరా రు. వ్యవసాయ భూములు తీసుకుంటే జీవనాధారం కోల్పోతామని, సింగరేణి స్పందించి ఉద్యోగావకాశాలు కల్పించాలని సూచించారు. బోర్లు, బావులు, పైపులైన్లను పరిగణనలోకి తీసుకుని పరిహారం నిర్ణరుుంచాలన్నారు. కార్యక్రమంలో మంథని జూనియర్ సివిల్ జడ్జి ఏ. కుమారస్వామి, స్పెషల్ డెప్యుటీ కలెక్టర్ ఎన్.మధుసూదన్‌రావు, అడిషనల్ జీఎం (లా) తిరుమల్‌రావు, సీజీఎం ఎస్టేట్స్ అంటోనిరాజా, ఆర్జీ-3, ఏపీఏ జీఎంలు ఎంఎస్.వెంకట్రామయ్య, ఎస్.చంద్రశేఖర్, టూటౌన్ సీఐ దేవారెడ్డి, కమాన్‌పూర్ ఎస్సై ప్రదీప్‌కుమార్, ముత్తారం జెడ్పీటీసీ చొప్పరి సదానందం, సర్పంచ్ రవీందర్, రైతులు పాల్గొన్నారు.