మెగాలోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి
Published Mon, Feb 6 2017 11:54 PM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM
బనగానపల్లె రూరల్: ఈ నెల 11న నిర్వహించే మెగా లోక్ అదాలత్‌ను ఇరువర్గాల కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి సూచించారు. సోమవారం సాయంత్రం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పలు శాఖల అధికారులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ సివిల్, క్రిమినల్, చెక్‌బౌన్స్ కేసులు, పీఎల్‌సీ, భూసేకరణ తదితర కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకునేలా అ«ధికారులు కక్షిదారులకు సూచించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటి కార్యదర్శి సోమశఖర్, స్థానిక జడ్జి లావణ్య, తహసీల్దార్ అనురాధ, సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐలు సీఎం రాకేసు, విజయలక్ష్మి, హనుమంత్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, సీనియర్ న్యాయవాదులు పరశురామిరెడ్డి, మాధవరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, అబ్దుల్‌ఖైర్, యూసుప్‌హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement