కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు నిర్మలాగీతాంబ
శ్రీకాకుళం సిటీ : జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మొత్తం 1,222 కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు వీబీ నిర్మలాగీతాంబ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.
జిల్లా కోర్టులో జరిగిన లోక్‌అదాలత్‌లో పాల్గొన్న జిల్లా జడ్జి మాట్లాడుతూ ప్రీలిటిగేషన్ కేసులు 52, జనరల్ కేసులు 1137, 33 సివిల్ కేసులు పరిష్కరించామన్నారు. ఈ లోక్ అదాలత్ ద్వారా వివిధ రూపాల్లో రూ.2,32,68,743 రాజీ కుదిర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాల్గవ అదనపు జిల్లా జడ్జి వి.గోపాలకృష్ణ, లోక్ అదాలత్ చైర్మన్ షేక్‌ఇంతియాజ్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.మేరీగ్రేస్‌కుమారి, స్పెషల్ జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ ఎక్సైజ్ మెజిస్ట్రేట్ వై.శ్రీనివాసరావు, న్యాయవాదులు జి.ఇందిరా్రçపసాద్, ఎ.ఉమామహేశ్వరరావు, జె.శ్రీనివాసరావు, ఎం.చందనకుమారి, సీఎస్ ప్రకాశరావు, బి.రమణ తదితరులు పాల్గొన్నారు.
పొటోలు