9 లక్షల కేసులు పరిష్కారం
బండీ: న్యాయం మీ ఇంటి ముందుకు(జస్టిస్ ఎట్ యువర్ డోర్ స్టెప్) ప్రచారంతో రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహించిన లోక్ అదాలత్ లు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ఇప్పటివరకు లోక్ అదాలత్ ల ద్వారా గ్రామాల్లో భూమి వివాదాలకు సంబంధించిన 9 లక్షల కేసులు పరిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 4 వేల లోక్ అదాలత్ లతో ఈ కేసులు పరిష్కరించినట్టు ప్రభుత్వం వెల్లడించింది.
మే 18 నుంచి ప్రారంభమైన లోక్ అదాలత్ లు జూలై 15 వరకు కొనసాగనున్నాయి. పంచాయతీ కారాలయాల్లో లోక్ అదాలత్ లు నిర్వహిస్తున్నారు. కౌన్సెలింగ్, రాజీ కుదర్చడం ద్వారా కేసులు పరిష్కరిస్తున్నారు. బండీ జిల్లాలో 996 రెవెన్యూ కేసులు పరిష్కారమయ్యాయని కలెక్టర్ నెహా గిరి తెలిపారు.