తిరువళ్లూరు, న్యూస్‌లైన్: తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన లోక్‌అదాలత్‌ల ద్వారా దాదాపు 148 కేసులను పరిష్కరించినట్టు తిరువళ్లూరు కోర్టు న్యాయమూర్తి అఖిలా, మహేశ్వరీ భానురేఖ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా భారతీయ స్టేట్ బ్యాంకు ఆధ్వర్యంలో లోక్‌అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి తిరువళ్లూరు ప్రధాన బ్రాంచి మేనేజర్ రమేష్ అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ జపురుల్లాఖాన్ లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం నుంచి రుణాల వసూలుతోపాటు ఇతర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కేసుల పరిష్కారం, నిధుల పంపిణీ, రుణాల వసూలు తదితర వాటిపై విలేకరులతో మాట్లాడారు.
తిరువళ్లూరు మెయిన్ బ్రాంచిలో లోక్‌అదాలత్ ద్వారా 148 కేసులు పరిష్కరించినట్టు వారు తెలిపారు. దీంతోపాటు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని చెల్లించని వారి నుంచి రూ.10 లక్షల 47 వేలను వసూలు చేసినట్టు వివరించారు. బ్యాంకు నుంచి ఖాతాదారులకు, ఖాతాదారుల నుంచి బ్యాంకుకు 2.50 కోట్లను సర్దుబాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం రవీంద్రన్, జనరల్ మేనేజర్ కష్ణమోహన్, బ్రాంచ్ మేనేజర్ రేణుకా, రమేష్, మాధవన్, శ్రీధర్ పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌లో 148 కేసుల పరిష్కారం
Published Mon, Nov 25 2013 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM
Advertisement
Advertisement