Akhila
-
అన్నీ తానై.. తానే నాన్నయి
తండ్రి ఉన్నప్పుడు అఖిలకు చదువే లోకం. ఎప్పుడో తప్ప పొలానికి వెళ్లేది కాదు. నాన్నకు మాత్రం వ్యవసాయమే లోకం. నాన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిన తరువాత అఖిలకు దుఃఖం తప్ప బతుకు దారి కనిపించలేదు. ఆ విషాద సమయంలో ‘నాన్నా... నీకు నేను ఉన్నాను’ అంటూ పచ్చటి పొలం అఖిలకు అభయం ఇచ్చింది. కుటుంబ బాధ్యతలను తలకెత్తుకున్న అఖిల ఇప్పుడు రైతుగా మారింది. తన రెక్కల కష్టంతో కుటుంబానికి అండగా నిలుస్తోంది. ‘డిగ్రీ సదివి ఏందమ్మా ఈ కష్టం’ అంటారు చాలామంది సానుభూతిగా. కానీ వ్యవసాయం చేయడం తనకు కష్టంగా కంటే ఇష్టంగా మారింది. ఎందుకంటే... పొలం దగ్గరికి వెళితే నాన్న దగ్గరికి వెళ్లినట్లు అనిపిస్తుంది. నాన్న ఎక్కడి నుంచో తన కష్టాన్ని చూస్తున్నట్లు, సలహాలు ఇస్తున్నట్లు అనిపిస్తుంది.యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన ఎల్మ శ్రీనివాస్ నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ‘చనిపోవాల్సిన వయసు కాదు’ అని తల్లడిల్లిన వాళ్లు.... ‘పిల్లల గతి ఏం కావాలి’ అని కన్నీళ్లు పెట్టుకున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ‘ఇంత అన్యాయం చేసి పోతవా కొడకా’ అంటూ వృద్ధాప్యంలో ఉన్న శ్రీనివాస్ తల్లి ఏడుస్తుంటే అక్కడ ఉన్నవారికి ఏడుపు ఆగలేదు.‘కాలం ఎంత బాధకు అయినా మందుగా పనిచేస్తుంది’ అంటారు. అయితే రోజులు గడిచినా, నెలలు గడిచినా శ్రీనివాస్ భార్య బాధ నుంచి తేరుకోలేదు. ఆ బాధతోనే ఆమె మంచం పట్టింది. శ్రీనివాస్‌కు ఇద్దరు కుమార్తెలు. గత ఏడాది పెద్దకుమార్తె వివాహం జరిగింది. ఇక కుటుంబ భారాన్ని మోయాల్సిన బాధ్యత చిన్న కుమార్తె అఖిలపై పడింది.‘ఎవుసాయం నీ వల్ల ఎక్కడ అవుతుంది బిడ్డా... పట్నంలో ఏదన్న ఉద్యోగం చూసుకో’ అన్నారు కొందరు. ‘వ్యవసాయం అంటే వంద సమస్యలుంటయి. నీ వల్ల కాదుగని పొలాన్ని కౌలుకు ఇయ్యండ్రీ’ అని సలహా ఇచ్చారు కొందరు. ‘వ్యవసాయం ఎందుకు చేయకూడదు. అఖిల చెయ్యగలదు’ అనే మాట ఏ నోటా వినిపించలేదు.పూరింట్లో మంచం పట్టిన అమ్మను, వృద్ధాప్యంలో ఉన్న నానమ్మను విడిచి పట్నంలో ఉద్యోగంలో చెయ్యలా? ‘చెయ్యను. వ్యవసాయమే చేస్తాను’ అని గట్టిగా నిశ్చయించుకుంది అఖిల. వ్యవసాయం అనేది కాలేజీని మించిన మహా విశ్వవిద్యాలయం. ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయి. కాలేజీలో చదివే వారికి సంవత్సరానికి ఒక సారే పరీక్ష ఉంటుంది. కాని రైతుకు ప్రతిరోజూ పరీక్షే.‘యస్... ఆ పరీక్షల్లో నేను పాస్ కాగలను’ అంటూ ధైర్యంగా పొలం బాట పట్టింది కాలేజి స్టూడెంట్ అఖిల. ‘వచ్చినవా బిడ్డా’ అంటూ నాన్న చల్లగా నవ్వినట్లు అనిపించింది. ఆ ఊహ తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ‘నేను పరాయి దేశానికి పోలేదు. నాన్నకు ఇష్టమైన చోటుకే వచ్చాను. నాకు భయమెందుకు!’ అనుకుంది.మొదట బైక్ రైడింగ్ నేర్చుకుంది. ఆ తరువాత ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. ఇప్పుడు తనకు మరింత ధైర్యం, ‘వ్యవసాయం చేయగలను’ అనే నమ్మకం వచ్చింది. పొలంలో రెండు బోర్ల సాయంతో రెండు ఎకరాల వరకు వరి సేద్యం చేస్తోంది. ఇప్పుడు అఖిలకు వ్యవసాయం మాత్రమే కాదు... ఏ పనులు చేసుకోలేక మంచానికే పరిమితమైన తల్లి ఆలనాపాలన, నానమ్మ ఆరోగ్యం గురించి పట్టించుకోవడంలాంటి ప్రధాన బాధ్యతలు ఉన్నాయి. ఒక్కముక్కలో చె΄్పాలంటే ఇప్పుడు అమ్మకు అమ్మ అయింది. నానమ్మకు కొడుకు అయింది అఖిల. నాన్న చెప్పిన మాట‘ఎందుకింత కష్టపడతవు నాన్నా’ అని పిల్లలు అన్నప్పుడు ‘రెక్కల కష్టం వుట్టిగ పోదురా’ అని నవ్వేవాడు నాన్న. ‘రెక్కల కష్టం’ విలువ గురించి చిన్న వయసులోనే నాన్న నోటి నుంచి విన్న అఖిల ఇప్పుడు ఆ కష్టాన్నే నమ్ముకుంది. ఒకవైపు వ్యవసాయం చేస్తూనే మరోవైపు పోటీ పరీక్షలపై దృష్టి పెట్టింది. కానిస్టేబుల్ కావాలనుకుంటోంది. అలా అని వ్యవసాయానికి దూరం కావాలనుకోవడం లేదు. ఎందుకంటే... తనకు వ్యవసాయం అంటే నాన్న! – బిర్రు బాలకిషన్,సాక్షి, రాజాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా -
పెళ్లిలో భర్తతో డాన్స్.. కొన్ని గంటల్లోనే మృతి
మక్కువ: పెళ్లైన ఆనందంలో భర్తతో కలిసి డాన్స్ చేసిన నవ వధువు కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందిన విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దబ్బగెడ్డలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దబ్బగెడ్డ గ్రామానికి చెందిన భాస్కరరావుతో పార్వతీపురం మండలం కొత్తవలస గ్రామానికి చెందిన అఖిల(20)కు శుక్రవారం రాత్రి పెళ్లి జరిగింది. మాంగల్యధారణ అనంతరం శనివారం తెల్లవారు జామున 3 గంటల వరకు ఊరేగింపు సాగింది. డీజే పాటలకు భర్తతో కలిసి అఖిల డాన్స్ చేసింది. అనంతరం నీరసంగా ఉందంటూ నిద్రలోకి జారుకుంది. తర్వాత బంధువులు వెళ్లి లేపగా, ఎంతకూ లేవకపోవడంతో వెంటనే మక్కువ పీహెచ్‌సీకు తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యసేవలు అందిన అనంతరం మెరుగైన చికిత్స కోసం సాలూరు సీహెచ్‌సీకు తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అఖిలకు తల్లిదండ్రులు లేరు. నానమ్మ, తాతయ్యల వద్దే పెరిగింది. ముందు రోజు ఉపవాసం ఉండటం, పెళ్లి తర్వాత డాన్స్ వేయడం వల్ల డీహైడ్రేషన్‌కు గురై మృతి చెంది ఉండవచ్చునని గ్రామస్తులు, బంధువులు భావిస్తున్నారు. -
సేద్య కళ
చదువుకుంటూ పార్ట్‌టైమ్ జాబ్స్ చేసే యువత గురించి మనకు తెలుసు. అలాగే, చదువుకుంటూనే తమ అభిరుచులకు పదును పెట్టుకునేవారినీ మనం చూస్తుంటాం. అయితే, నెల్లూరు జిల్లా కలువాయి మండలం, పెన్న బద్వేల్‌వాసి అయిన చాట్ల అఖిల మాత్రం హాస్టల్లో ఉండి బయోటెక్నాలజీలో డిగ్రీ చేస్తూనే, ఖాళీ సమయంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తోంది. తనకున్న ఇష్టం వల్ల సేద్యంలో రకరకాల ప్రయోగాలు సొంతంగా చేయగలుగుతున్నాను అని చెబుతున్న అఖిల తన కలనే కాదు కళను కూడా పండిస్తోంది. ‘‘మాది వ్యవసాయ కుటుంబం అవడంతో చిన్నప్పటి నుంచి ఇంటి పనులతో పా టు పొలం పనులు కూడా తెలుసు. అమ్మ పద్మ, నాన్న గురువయ్య. అమ్మానాన్నలకు అన్న, నేను సంతానం. డిగ్రీ మూడవ సంవత్సరం నెల్లూరు టౌన్లోనే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. డిగ్రీ పూర్తయిన తర్వాత నాకు నేనుగా స్థిరపడాలంటే ఏది ఎంచుకుంటే బాగుంటుంది అని చాలా ఆలోచించాను. కరోనా కాలంలో రెండేళ్లు ఇంటి వద్దే ఉన్నప్పుడు ఎక్కువ సమయం పొలంలోనే గడిపేదాన్ని. అలా వ్యవసాయంలోని కష్టం, ఇష్టం రెండూ అలవాటయ్యాయి. అయితే, ఊళ్లో వ్యవసాయం చేస్తూ, కాలేజీకి వెళ్లి చదువుకోలేను. ఇంటి వద్దే ఉండి నాకు నచ్చిన రీతిలో వ్యవసాయం చేయాలంటే అందుకు అమ్మానాన్నలను ఒప్పించడం కష్టమనుకున్నాను. ‘చదువుకుంటున్నావు కదా ఎందుకింత కష్టం’ అంటారు. అందుకే అమ్మానాన్నలకు చెప్పకుండానే ఎక్కడైనా కొంత భూమి కౌలుకు తీసుకోవాలని వ్యవసాయం చేయాలని, కరోనా టైమ్‌లోనే తెలిసివారి ద్వారా చాలా వెతికాను. సాగులో లేని భూమి.. నేనున్న హాస్టల్‌కి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లిపా డులో ఒక ఎన్ఆర్ఐ భూమి ఉందని తెలిసింది. వారి వివరాలు కనుక్కొని, ఫోన్లో సంప్రదించి, రెండెకరాల భూమి కౌలుకు తీసుకున్నాను. అది ఏ మాత్రం సాగులో లేని భూమి. అందుకు చాలా కష్టపడాలి. మొదట కష్టమవుతుందేమో అనుకున్నాను. కానీ, ఇష్టమైన పని కావడంతో సాగు చేయాలనే నిశ్చయించుకున్నాను. మట్టితో పిచికారి భూమిని చదును చేయించాను. ఆకు కూరలు, కూరగాయల సాగు చేస్తున్నాను. సాగులో వచ్చే ఇబ్బందులు స్వయంగా తెలుసుకుంటూ, వాటికి పరిష్కారాలు వెదుక్కుంటూ నా ఎఫర్ట్‌ను పెడుతున్నాను. ఓ వయసుపైబడిన వ్యక్తి ఉంటే, అతనికి అవసరాలకు డబ్బు ఇచ్చి పొలానికి కాపలాకు పెట్టాను. శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజులు ఈ పనికి ఎంచుకున్నాను. ఉదయం ఫార్మ్ దగ్గరకు వెళతాను. సాయంత్రం వరకు అక్కడే ఉంటాను. మొక్కల ఏపుగా పెరగడానికి మట్టి ద్రావకంతో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాను. పెన్నానది పక్కన ఉండటంతో అక్కణ్ణుంచి మోటార్ ద్వారా నీటి సదుపా యాన్ని ఏర్పాటు చేసుకున్నాను. తక్కువ పెట్టుబడితో.. ఇప్పుడు పా లకూర, చుక్కకూర, తోటకూర, గోంగూర, బెండ, చిక్కుడు, స్వీట్‌కార్న్, వంగ, దోస, సొరకాయ వంటివి సాగుచేస్తున్నాను. ఆకుకూరలు 15 రోజులకొకసారి కోతకు వస్తాయి. వీటన్నింటిని వాతావరణం బట్టి నా పనిలో మార్పులు చేసుకుంటాను. తెలిసినవాళ్లే వాటిని స్వయంగా వచ్చి తీసుకెళుతుంటారు. భూమిని చదును చేయించడానికి రూ.5 వేల వరకు పెట్టుబడి పెట్టాను. అన్ని ఖర్చులు పోను రూ. 15 వేల వరకు ఆదాయం వచ్చింది. అయితే, ఈ మొత్తాన్ని కూడా భూమిలో సేంద్రీయ పద్ధతులను అమలు చేయడానికి ఖర్చు పెడుతున్నాను. మా ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు వచ్చి సరదాగా వర్క్ చేస్తుంటారు. సొంతంగా వ్యవసాయం చేస్తున్నానని ఎవరికైనా చెబితే ‘చదువుకుంటున్నావు కదా, ఆడపిల్లవు కదా! ఎందుకంత కష్టం, ఇంకేం పని దొరకలేదా’ అని నవ్వుతున్నారు. అందుకే ఎవరికీ చెప్పడం లేదు. ఇంకొంత భూమి తీసుకుని సాగు చేయాలనేది తర్వాతి ప్లాన్. ‘మా భూమిలో కూడా ఇలా మట్టిని కాపా డుతూ సేద్యం చేయండి..’ అని అడిగేవాళ్లున్నారు. ఏషియన్, మిల్లెట్ ఫార్మింగ్‌ను పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచన ఉంది’’ అని వివరించింది అఖిల. – నిర్మలారెడ్డి -
పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథ 'నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా'
తేజ్ కూరపాటి, అఖిల జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా'. వెంకట్ వందెల దర్శకత్వంలో ముల్లేటి నాగేశ్వరావు, ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీని ఈనెల 14న థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుందని చిత్రబృందం ప్రకటించింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి మెహన్ వడ్లపట్ల, యం.ఆర్.సి. వడ్ల పట్ల , నిర్మాతలు సి.హెచ్వీ.యస్.యన్ బాబ్జీ, కాసుల రామకృష్ణ, రవీంద్ర గోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి మెహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. 'ఇంతకుముందు ముల్లేటి నాగేశ్వరావు చాలా మంచి సినిమాలు తీశారు. 15 ఏళ్ల గ్యాప్ తరువాత నిర్మించిన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి. ఈ నెల 14న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి' అని అన్నారు. యం.ఆర్.సి. వడ్లపట్ల చౌదరి మాట్లాడుతూ.. 'ముల్లేటి వారు సినిమాను ఒక తపస్సులా భావించి చాలా కష్టపడి తీశారు. మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీశారు.ఈ సినిమా తరువాత ముల్లేటి ఫ్యామిలీతో మరో సినిమా తీస్తున్నాం. ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి' అని అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముల్లేటి నాగేశ్వరావు మాట్లాడుతూ.. 'మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మంచి కాన్సెప్ట్ తో పల్లెటూరి నేపధ్యంలో సాగే చక్కటి ప్రేమకథలో యూత్‌కు కావాల్సిన వినొదాన్ని మిక్స్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. తేజ్ కూరపాటి ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. హీరోయిన్‌కు ఇది మొదటి సినిమా అయినా చాలా చక్కగా నటించింది. మంచి కథతో వస్తున్న ఈ సినిమాను ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా ఉంటుంది.' అని అన్నారు. చిత్ర దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ..'మంచి కంటెంట్‌తో రెగ్యులర్ స్టోరీకు భిన్నంగా వస్తున్న ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది.ప్రతి ఒక్కరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశ్యంతో సరైన థియేటర్స్ దొరకనందున మేము సినిమాను వాయిదా వేసుకుంటూ వచ్చాం. చివరకు మాకు అనుకున్న థియేటర్స్ లభించడంతో ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నాం. అందరూ మా సినిమాను అశీర్వదించాలని కోరుతున్' అని అన్నారు. -
అఖిల మృతిపై డీఎంఈ విచారణ
నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం కట్టంగూరు మండలం చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన బాలింత అఖిల మృతి చెందిన ఘటనపై సోమవారం డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి, ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కలిసి విచారణ నిర్వహించారు. మగశిశువుకు జన్మనిచ్చిన అఖిల తీవ్ర రక్తస్రావంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేం«ద్రంలో ఉన్న వార్డులను డీఎంఈ పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది తమను కించపరిచేవిధంగా దుర్భాషలాడుతున్నారని పలువురు ఆయనకు ఫిర్యాదు చేయగా ఆస్పత్రి వర్గాల వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డీఎంఈ మీడియాతో మాట్లాడుతూ అఖిల మృతిలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదని తమ ప్రాథమిక విచారణంలో తేలిందని తెలిపా రు. కాన్పుల సందర్భంగా సిబ్బంది తీరుపై తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. మరోవైపు మృతు రాలి అత్త, మామ, భర్త, కుటుంబసభ్యులు శిశువుతోపా టు ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. ఆందోళన చేస్తున్నవారిని డీఎంఈ కనీసం పలకరించకపోవడం గమనార్హం. ధర్నా లో కాంగ్రెస్ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ కూడా పాల్గొన్నారు. న్యాయంచేయాలని అఖిల మామ పోలీసు ల కాళ్లపైపడి ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదు. -
ఆకట్టుకుంటున్న‘ చినుకమ్మా .. నా వెంటే పడుతున్న చిన్నాడెవడమ్మా’ సాంగ్
‘హుషారు’ఫేమ్ తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్ వందెల దర్శకత్వం లో జి వి ఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేశారు మేకర్స్. ‘పుడిమిని తడిపే తొలకరి మొరుపుల చినుకమ్మా .. నా వెంటే పడుతున్న చిన్నాడెవడమ్మా ’అంటూ సాగే ఈ పాటకి డాక్టర్ భవ్య దీప్తిరెడ్డి లిరిక్స్ అందించగా.. రమ్య బెహరా అద్భుతంగా ఆలపించారు. సందీప్ కుమార్ సంగీతం అందించిన ఈ సాంగ్‌కి గణేష్ మాస్టర్ కొరియోగ్రఫి చేశారు. ఇటీవలే విడుదల చేసిన సాంగ్ ప్రోమో కి మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇప్పడు ఈ సాంగ్ ని ప్రముఖ నటులు , రచయిత, దర్శకులు తణికెళ్ళ భరణి చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా తణికెళ్ల భరణి మాట్లాడుతూ.. భవ్య దీప్తి సాహిత్యంతో గణేశ్ మాస్టర్ కొరియోగ్రఫి చాలా బాగుంది. ఈ పాటలో హీరో తేజ, అఖిల చాలా అందంగా ఉన్నారు. ఈ చిత్రం మరింత విజయం సాధించాలని కొరుకుంటున్నాను’ అన్నారు. దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ.. ‘పల్లెటూరి నేపధ్యం లో సాగే చక్కటి ప్రేమకథ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ చిత్రం ఫ్యామిలి మరియు యూత్ ని ఆకట్టకుంటుంది’ అన్నారు. -
అఖిల కథ
జయసింహా, అక్ష జంటగా నటించనున్న చిత్రం ‘అఖిల’. మోహన్ రావ్ దర్శకత్వం వహించనున్నారు. జై చిరంజీవ ఫిలింస్ పతాకంపై శెట్టి చిరంజీవి నిర్మించనున్న ఈ చిత్రం టైటిల్‌ని నిర్మాతలు ప్రతాని రామకృష్ణ గౌడ్, ప్రసన్న కుమార్ విడుదల చేశారు. మోహన్ రావ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. హీరో జయసింహ, హీరోయిన్ అక్ష పాత్రలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయి. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించనున్నారు శెట్టి చిరంజీవిగారు’’ అన్నారు. ‘‘మోహన్ రావుగారు చెప్పిన పాయింట్ బాగుంది. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు శెట్టి చిరంజీవి. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రాబోతున్న ‘అఖిల’ సినిమాతో నాకు మంచి పేరు లభిస్తుందని భావిస్తున్నా’’ అన్నారు అక్ష. ‘‘అఖిల’ సినిమాతో తెలుగులో తొలిసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. అందరి సహకారం నాకు కావాలి’’ అన్నారు జయసింహా. ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్, కెమెరా: శేఖర్. -
నాలుగు నిమిషాలు.. యాబై మంది వాయిస్‌లు
మిమిక్రీలో చాలావరకు పురుషుల గొంతులే వినిపిస్తాయి. మహిళలూ ఆ అనుకరణను అవలీలగా చేస్తారు... అని అఖిల ఏఎస్ అనే అమ్మాయి నిరూపిస్తోంది. నాలుగు నిమిషాల్లో యాభై ఒక్కమంది సెలబ్రీటీలను అనుకరించి చూపించింది! ఆ వీడియో వైరలయింది. ‘‘ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు దుమ్ము.. ఓ వైపు పొగ...’’ అంటూ యాంటీ స్మోక్ యాడ్‌లో వినిపించే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ను అనుకరిస్తోంది ఓ ఇరవై ఏళ్ల అమ్మాయి తన తరగతి గదిలో. అచ్చంగా యాడ్‌లోని పురుషుడి గొంతుతోనే మాట్లాడుతున్న ఆ మాటలకు క్లాస్ అంతా ఈలలు, చప్పట్లతో మారుమోగిపోతోంది. వన్స్ మోర్ అంటున్నారు క్లాస్మేట్స్. అలా గోపన్ నాయర్ (మలయాళం వాయిస్ ఆర్టిస్ట్, ఈ నగరానికి ఏమైంది అనే యాడ్‌కు మలయాళంలో వాయిస్ ఇచ్చింది అతనే) నుంచి మలయాళ నటీమణులు పార్వతి, నజిరియా నాజిమ్, కేరళ రాజకీయ నాయకులు ఇలా ఒకరి తర్వాత ఒకరిని అనుకరిస్తూనే ఉంది. ఆ అమ్మాయి పేరు ఏఎస్ అఖిల. ఆయుర్వేద వైద్యవిద్యను అభ్యసిస్తోంది. ఈ యేడాదితో చదువు పూర్తయిపోయి డాక్టర్ పట్టా పుచ్చుకోనుంది. పైన చెప్పుకున్న ఆమె మిమిక్రీ సీన్ ఆ కాలేజ్‌లో చేసిందే. మిమిక్రీఖిల అఖిల మలయాళ అమ్మాయి అని ఈపాటికే అర్థమయ్యుంటుంది. పుట్టింది, పెరిగింది తిరువనంతపురం జిల్లాలోని నేడుమంగడ్లో. చిన్నప్పటి నుంచీ చుట్టూ ఉన్న పరిసరాలను, మనుషులను పరిశీలించడం అలవాటు ఆమెకు. ఆ పరిశీలనలోంచే ఈ మిమిక్రీ కళ అబ్బింది, అలవడింది. స్కూల్లో ఉన్నప్పుడే క్లాస్‌లో తన కళను ప్రదర్శించేది. క్లాస్ టీచర్స్‌ను, క్లాస్‌మేట్స్‌ను అనుకరిస్తూండేది. ఒకసారి ఇలాగే క్లాస్‌లో డెమో ఇస్తూండగా టీచర్స్‌కు పట్టుబడింది. ఫలితం.. స్కూల్లో ఆమె కళాప్రదర్శన. దాంతో అఖిలకు స్టేజ్ ఫియర్ పోయి ధైర్యం వచ్చింది. ఎక్కడైనా ప్రదర్శనలు ఇవ్వగలననే ఆత్మవిశ్వాసమూ పెరిగింది. అప్పటినుంచి తిరువనంతపురంలో జిల్లాల్లోని ప్రతి ఇంటర్‌స్కూల్ కాంపిటీషన్లో పాల్గొనడం మొదలుపెట్టింది. ఎక్కడ గొంతు సవరిస్తే అక్కడ ప్రైజులు వచ్చిపడేవి. ఆ కళను తనతోపాటే పెంచి పెద్దచేసుకుంది. అయితే ఎక్కడా దానికి సంబంధించి శిక్షణ తీసుకోకుండానే. టీవీ, పరిశీలన ఇవే ఆమె ధ్వన్యనుకరణ నైపుణ్యాన్ని పెంచిన గురువులు. ఎవరెవరిని అనుకరిస్తుంది? ఎవరిని కాదు అని అడగొచ్చు. రజినీకాంత్, కమల్‌హసన్, అద్నన్ సమీ, ఎస్. జానకి, ఓమెన్ చాందీ, వీఎస్ అచ్యుతానందన్, షాలినీ, షామిలీ (చిన్నప్పటి వాయిస్‌లను).. ఇలా చెప్పుకుంటూ పోతే వందకు పైనే తేలొచ్చేమో జాబితా. ఈ వీడియో వైరల్.. ఒక మలయాళం చానెల్లోని ఓ ప్రోగ్రామ్‌లో అఖిల చేసిన మిమిక్రీ వీడియోలో కేవలం నాలుగంటే నాలుగు నిమిషాల్లో యాభై ఒక్కమంది సెలబ్రిటీల స్వరాన్ని అనుకరించింది. ప్రతి నాలుగు సెకన్లకు ఆడ, మగ గొంతును మారుస్తూ. ఆ ‘షో’ను చూసిన ప్రేక్షకులు ఆమె ప్రతిభకు అబ్బురపడ్డారు. మిమిక్రీ కళలో మహిళా సూపర్‌స్టార్ అనే పేరు తెచ్చేసుకుంది అఖిల ఈ షోతో. ఇప్పటివరకు మలయాళంలో ఎందరో మిమిక్రీ కళాకారులు వచ్చినా.. తర్వాత తర్వాత వాళ్లంతా సినిమా ఆర్టిస్టులుగా స్థిరపడ్డారు. కాని అఖిల అలా కాకుండా మిమిక్రీ కళాకారిణిగానే కొనసాగాలనుకుంటోందట. ఈ నగరానికి ఏమైంది.. ‘‘ఈ నగరానికి ఏమైంది’’ మలయాళం యాడ్‌కు గళమిచ్చిన గోపన్ నాయర్‌ను అనుకరిస్తూ ఓ వీడియో కూడా చేసింది అఖిల. ఆ వీడియోకు మైఖేల్ జాక్సన్ ‘డేంజరస్’ పాట మ్యూజిక్‌ను జతకూర్చి ఒక కొత్త ప్రయోగానికి రూపమిచ్చింది. అన్నట్టు అఖిల .. కేరళకు చెందిన తొలి ‘లేడీస్ ఓన్లీ మిమిక్స్ పరేడ్ గ్రూప్’లో సభ్యురాలు కూడా. మీ లక్ష్యం ఏంటి అని అడిగితే ‘‘ఇలాగే ముగ్గురిని అనుకరిస్తూ ముప్పైమందిని నవ్వించడమే’’ అంటుంది నవ్వుతూ అఖిల ఏఎస్. ‘చిన్నప్పటినుంచీ పక్షుల కిలకిలారావాలు, జంతువుల అరుపులను బాగా అబ్జర్వ్ చేసేదాన్ని. నేను ఫస్ట్ మిమిక్రీ చేసింది కూడా పక్షుల కూతలనే. తర్వాత ఇంట్లోవాళ్లను, ఫ్రెండ్స్‌ని, టీచర్స్ని అనుకరించే దాన్ని. నిజానికి మా ఇంట్లో ఎవరికీ ఈ కళ లేదు. కేవలం పరిశీలనతో నా అంతట నేను నేర్చుకున్నదే. సెలబ్రిటీల విషయానికి వస్తే నేను ఎస్. జానకమ్మను ముందు ఇమిటేట్ చేశా. టీవీ బాగా చూస్తాను. నా స్కిల్‌ను పెంచి నాకు కచ్చితత్వాన్ని ఇస్తున్న సాధనం అదే’ – అఖిల -
ఒంటికి నిప్పంటించుకొని..
సాక్షి, సంగెం: క్షణికావేశంతో ఓ మహిళ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందగా..కాపాడబోయిన భర్త తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతున్నాడు. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలిన విషాద సంఘటన మండలంలో సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కాపులకనిపర్తి గ్రామానికి చెందిన సదిరం మమత అలియాస్ అఖిల(25) అదే గ్రామానికి చెందిన సదిరం అనిల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెద్దలు సైతం వీరి ప్రేమ అంగీకరించారు. సజావుగా సాగిన వీరి కాపురానికి గుర్తుగా కుమార్తె లాస్య(4), సిద్దార్థ(2)జన్మించారు. కూలీనాలీ చేసుకుని కుటుం బాన్ని పోషించుకుంటున్నారు. కొంత కాలంగా అఖిల మనస్సు స్థిమితంగా లేకుండా ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన భర్తతో గొడవ పడింది. క్షణికావేశానికి గురై ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పం చుకుంది. మంటల్లో కాలుతున్న అఖిల అరుపులు విన్న అనిల్ కాపాడే ప్రయత్నంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అఖిల 90 శాతం, అనిల్ 50 శాతం గాయపడగా ఇరువురిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగా అఖిల సోమవారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి మృతి చెందింది. అనిల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి తండ్రి కలకొట్ల రాజు ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.నాగరాజు తెలిపారు. చిన్నారులు లాస్య(4), సిద్దార్థ(2)లకు అసలు తమ తల్లితండ్రులకు ఏం జరిగిందో తెలుసుకోలేని పరిస్థితి. తల్లి, తండ్రి ఎందుకు గొడవ పడ్డారో తెలియదు. ఎందుకు కాల్చుకుని గాయపడ్డారో కూడా తెలియదు. తల్లి మృతి చెందిందని, తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కూడా తెలియని ఇద్దరు చిన్నారులను చూసిన స్థానికుల గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దని భగవంతుడిని ప్రార్ధిస్తున్నారు. తల్లి మృతి చెందగా తండ్రి చావు బతుకుల మధ్య పోరాటం చేస్తుండడంతో ఆ చిన్నారులు అనాథలుగా మిగిలారు. అనాథలుగా మిగిలిన చిన్నారులు -
డైరెక్టర్ ప్రదీప్.. సన్నాఫ్ ఏవీఎస్
‘‘ఏవీయస్‌గారు నాకు మంచి మిత్రులు. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తి. సినిమాలను, సాహిత్యాన్ని ఔపోసన పట్టారు. ‘తుత్తి, రంగు పడుద్ది’ వంటి మేనరిజమ్స్‌ను ఆయన చాలా బాగా వాడేవారు. ఏవీఎస్‌గారు లేని లోటు ఇండస్ట్రీలో ఉంది. ఆయన తనయుడు రాఘవేంద్ర ప్రదీప్ తెరకెక్కించిన ‘వైదేహి’ ట్రైలర్ బావుంది’’ అని డైరెక్టర్ ఎన్. శంకర్ అన్నారు. మహేష్, ప్రణతి, సందీప్, అఖిల, లావణ్య, ప్రవీణ్ ముఖ్య తారలుగా ఏవీయస్ తనయుడు ఎ.రాఘవేంద్ర ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వైదేహి’. ఎ.జి.ఆర్. కౌశిక్ సమర్పణలో యాక్టివ్ స్టూడియోస్ పతాకంపై ఎ.జననీ ప్రదీప్ నిర్మిస్తున్నారు. దివంగత నటుడు ఏవీయస్ జయంతిని పురస్కరించుని బుధవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌ని ఎన్. శంకర్ విడుదల చేశారు. ఏవీయస్ జయంతి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కేక్ కట్ చేశారు. ఎ.రాఘవేంద్ర ప్రదీప్ మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి జయంతి నాడు మా సినిమా ట్రైలర్ విడుదల చేయడం హ్యాపీ. మా బావగారు నాకు ఇచ్చే సపోర్ట్‌ను మర్చిపోలేను. చాలా సందర్భాల్లో ఆయన మా నాన్నగారిలాగా నన్ను ప్రోత్సహిస్తున్నారు’’ అన్నారు. ‘‘బాపు–రమణగారికి, ఏవీయస్‌గారికి ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఏవీయస్‌గారితో నాకూ చక్కటి సాన్నిహిత్యం ఉంది. వాళ్ల అబ్బాయి దర్శకుడు కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు పసుపులేటి రామారావు. ఈ సినిమాకు కెమెరా: దేవేంద్ర సూరి, సంగీతం: షారుఖ్. -
గోండుకు బ్రాండింగ్
చేనేత వస్త్రాలు ఆయా ప్రాంతాలను ప్రతిబింబిస్తాయి. అక్కడి సంస్కృతులను ప్రపంచానికి పరిచయం చేస్తాయి. అందుకే ప్రాచీన కాలం నుంచీ వస్తున్న డిజైన్లతోనే నేటికీ వస్త్రాలు నేస్తుంటారు చేనేత కళాకారులు. ఈ క్రమంలో వాటిని మరింతగా ఆధునీకరించి, కొత్త కొత్త డిజైన్లతో నేటి తరానికి చేరవేయడం కోసం దేశమంతా పర్యటిస్తూ అక్కడి వారితో మమేకం అవుతున్నారు హైదరాబాద్‌కు చెందిన యువ సృజనశీలి అఖిల నూకల. చేనేతల్లో ప్రస్తుతం అందరూ కలంకారి వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే సంప్రదాయానికి పెద్ద పీట వేస్తున్నారు. కాబట్టి కలంకారిలోనే మొదట ప్రయోగాలు చేయాలనుకున్నారు అఖిల. అందుకోసం తెలంగాణ, మహారాష్ట్రలోని గోండు తెగకు చెందిన ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న గోండు విద్యార్థులతో కలిసి పనిచేశారు. అలాగే అస్సాంలోని బక్సార్ జిల్లా బరామా ప్రాంతంలో చాలా రోజులు ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా అక్కడి గిరిజన జాతుల వారితో సన్నిహితంగా మెలిగి, వారికి సంబంధించిన సాంస్కృతిక అంశాలను తెలుసుకుని, అందుకు అనుగుణంగా వస్త్రాల మీద డిజైన్లు రూపొందించడాన్ని లక్ష్యంగా చేసుకున్న అఖిల.. హైదరాబాద్ భవాన్స్ వివేకానంద కాలేజీలో బి.ఎస్.సి. చదివారు. అస్సాంలో డిజైనింగ్ ఎస్.బి.ఐ ‘యూత్ ఫర్ ఇండియా’లో సభ్యురాలిగా ఉన్న 21 ఏళ్ల అఖిల, 2017 నుంచి అస్సామీ చేనేత వస్త్రాలను విస్తృతంగా ప్రాచుర్యం కల్పించే పనిలో ఉన్నారు. ఇంతకుముందే వేరొకరు ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టి మధ్యలోనే విరమించుకున్నారంటే.. అదంత సులువైన పనేమీ కాదని అర్థమౌతోంది. ప్రస్తుతం అఖిల తన ఈ ప్రణాళికకు మరో రెండు మాసాల్లో అనుకున్న ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు. చేనేత మగ్గాల మీద నేస్తున్న చీరలకు ఆర్డర్లు సంపాదించి, వాటిని తన సృజనాత్మకతతో అస్సాంలో డిజైన్ చేయించి, వాటిని దేశవ్యాప్తంగా అందరికీ అందేలా చేయడమే అఖిల ముఖ్యోద్దేశం. చెప్పి చేయించుకోవాలి ‘‘వస్త్రాలు నేయడం వారి వృత్తి మాత్రమే కాదు, వారి జీవన విధానం కూడా. వారు నేసిన వస్త్రాలే వారి జీవనాధారం. ఆ వస్త్రాల నుంచే వారికి ఆదాయం రావాలి’’ అంటారు అఖిల తరచు తను పర్యటించే అస్సామీ ప్రాంతాల వారిని ఉద్దేశించి. అక్కడి వారికి వ్యవసాయ భూమి, పశుసంపద రెండూ ఉంటాయి. వారిలో చేనేత కార్మికులు వస్త్రాలు నేయడం కంటె, కుటుంబ బాధ్యతల కోసం ఎక్కువ సమయం గడపవలసి వస్తోంది, అందువల్ల అనుకున్న సమయానికి ఆర్డరు ఇచ్చిన వారికి వస్త్రాలు అందించలేకపోతున్నారు. దీనిని గ్రహించిన అఖిల, అక్కడి చేనేత కార్మికులను పని దిశగా మళ్లిస్తూ, సకాలంలో ఆర్డర్లు పూర్తి చేయించేందుకు కృషి చేస్తున్నారు. తరచు ప్రయాణాలు అఖిల తనొక్కరే ఈ పని చేస్తున్నా.. హ్యాండ్స్ ఆఫ్ ఇండియా, వృందావన్, బీడ్ సోషల్ ఎంటర్ప్రైజ్ (బెంగళూరు) వారితో భాగస్వామి అయ్యారు. ఇందుకోసం ఆమె గువహాటికి అనేకసార్లు ప్రయాణించవలసి వస్తోంది. ఈ పని పెద్ద కష్టం కాకపోవచ్చు కాని, భాష సమస్యను తనింకా దాటవలసి ఉందని నవ్వుతూ అంటారు అఖిల. ‘‘కొందరైనా హిందీ అర్థం చేసుకోగలుగుతున్నారు, ఇందుకు సంతోషంగా ఉంది’’ అని చెబుతున్న అఖిల, ఇతర స్థానిక భాషలు నేర్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. – రోహిణి -
సామాన్యులు చేస్తే తప్పా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘లవ్ జిహాదీ’ పేరిట దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన 24 ఏళ్ల అఖిల అశోకన్ అలియాస్ హదియా పెళ్లి కేసుపై సుప్రీం కోర్టులో మంగళవారం ఆసక్తికరమైన చర్చ, వాదోపవాదాలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, షా నవాజ్ హుస్సేన్‌లు హిందూ మహిళలను వివాహం చేసుకొని వారి మతాన్ని మార్చవచ్చుగానీ ఓ సామాన్య హిందూ మహిళైన అఖిల మతం మారి పెళ్లి చేసుకుంటే తప్పయిందా? అని ఆమెను పెళ్లి చేసుకున్న షఫీన్ జహాన్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఇష్టపూర్వకంగా మతం మారి తన ఇష్టపూర్వకంగానే ముస్లిం యువకుడైన జహాన్‌ను పెళ్లి చేసుకున్నందుకు ఆమె పెళ్లిని రద్దు చేయడమే కాకుండా లవ్ జిహాదీ కేసంటూ వేధింపులకు గురిచేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రముఖులు పెళ్లి చేసుకుంటే తప్పులేదుగానీ, సామాన్యుల పెళ్లి చేసుకుంటే తప్పయిందా? అలాంటప్పుడు అబ్బాస్ నఖ్వీ, షా నవాజ్ హుస్సేన్‌లను కూడా లవ్ జిహాదీ కింద ఎందుకు విచారించరని న్యాయవాది ఆవేశంగా సంవాదం చేయడం కొత్త చర్చకు దారితీసింది. భారతీయ జనతా పార్టీలో వీరిద్దరే కాకుండా రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన సికందర్ భక్త్ కూడా హిందూ మహిళనే పెళ్లి చేసుకున్నారు. వీరి భార్యలు కూడా ఇస్లాం మతం స్వీకరించారు. ఒక్క బీజేపీనే కాదు, మతాంతర వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించే ఆరెస్సెస్, వీహెచ్‌పీ, శివసేన నాయకుల ఇళ్లలోనే మతాంతర వివాహాలు దివ్యంగా జరిగాయి. శివసేన దివంగత చీఫ్ బాల్ ఠాక్రే మనమరాలు ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడి కూతురు కూడా ముస్లిం యువకుడినే పెళ్లి చేసుకొంది. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కూతురు ముస్లిం యువకుడిని, బీజేపీ నేత సుబ్రమణియం స్వామి కూతురు సుహాసినీ కూడా ముస్లింనే పెళ్లి చేసుకొంది. పార్టీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ మేన కోడలు కూడా ముస్లింను పెళ్లి చేసుకుంది. ఇక ప్రముఖుల్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజరుద్దీన్ మాజీ భార్య సంగీత బిజిలానీ అనే విషయం అందరికి తెల్సిందే. బాలివుడ్ హీరో షారూక్ ఖాన్, గౌరీని, నవాబ్ అలీఖాన్ పటోడి, షర్మిలా ఠాకూర్‌ను, అర్బాజ్ ఖాన్, మల్లికా అరోరాను, షైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌ను పెళ్లి చేసుకున్నారని, వారంతా హిందూ మహిళలేనన్న విషయం తెల్సిందే. ఆమీర్ ఖాన్ మొదటి భార్య రీణు, రెండో భార్య కిరన్ రావులు కూడా హిందువులే. అఖిల అలియాస్ హదియా కేసును విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా కూడా కీలకమైన న్యాయ అంశాలను లేవనెత్తారు. మైనారిటీ తీరిపోయిన అఖిల తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే దాన్ని రద్దు చేసే హక్కు ఓ హైకోర్టుకు రాజ్యాంగంలోని 226 కింద ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తున్న ఈ అధికరణం కింద పెళ్లిని రద్దు చేయడం అంటే ఆ హక్కునే ఉల్లంఘించినట్లు కాదా? అని ప్రశ్నించారు. అఖిల పెళ్లిని రద్దు చేయడంపై పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పుడు ఆ పెళ్లి చెల్లుతుందా, లేదా అన్న అంశానికే పరిమితం కావాల్సిన సుప్రీం కోర్టు బెంచీ ఆమెకు టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయో, లేవో తేల్చాల్సిందిగా 136 అధికరణం కింద సంక్రమించిన అధికారాల మేరకు ఎన్ఐఏను ఆదేశించడం ఏమిటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయమై అక్కడే ఉన్న సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్‌ను పిలిచి ప్రశ్నించారు. ఓ కేసులో సంపూర్ణ న్యాయం జరుగుతుందని అనుకున్నప్పుడు 136 అధికరణం కింద కాకుండా 142 అధికరణం కింద ఇలాంటి అదేశాలను సుప్రీం కోర్టు జారీ చేయవచ్చని నారిమన్ వివరించారు. పైగా పెళ్లిని రద్దు చేసినప్పటి నుంచి తండ్రి ఇంట్లో కూతురును నిర్బంధించి ఉంచడం, అందులో పోలీసుల కాపలా పెట్టడం ఏమిటని కూడా మిశ్రా ప్రశ్నించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. హోమియోపతి డిగ్రీ చదివిన అఖిల 2016 మొదట్లోనే ఇస్లాం కోర్సు పాసై మతం మార్చుకున్నారు. అదే సంవత్సరం మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా సంబంధాలు వెతక్కొని 2016, డిసెంబర్ నెలలో ముస్లిం సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ముస్లిం సంఘాల ప్రోద్బలంతో అఖిల పెళ్లి చేసుకున్నారంటూ, ఇది లవ్ జీహాదీయేనంటూ ఆమె తండ్రి అశోక్ హైకోర్టును ఆశ్రయించడంతో 2017, మే 24వ తేదీన కేరళ హైకోర్టు ఆమె పెళ్లిని రద్దు చేసింది. ఆమెను తండ్రి సంరక్షణలో ఉండాల్సిందిగా ఆదేశించింది. కేరళలోని కొట్టాయం జిల్లా, టీవీ పురంలోని తన తండ్రి ఇంట్లో అఖిల నిర్బంధంగా ఉంటున్నారు. ఆమె భర్త షఫీన్ జహాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కేసు విచారణ కొనసాగుతోంది. -
యడ్లపాడులో విషాదం
యడ్లపాడు: గుంటూరు జిల్లా యడ్లపాడులో విషాదం చోటు చేసుకుంది. తన ఇద్దరు కుమారులతో ఓ తల్లి యడ్లపాడు పరిధిలో ఎన్ఎస్పీ కాలువ సమీపంలోని బావిలో ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే పసిబిడ్డలతో కలసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు.. మృతులను కోడిరెక్క భూలక్ష్మి(25), ఆమె కుమారుడు రాము(4), కుమార్తె అఖిల(3)లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
మెదడువాపు వ్యాధితో బాలిక మృతి
జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఓడిపెల్లి అఖిల(13) శనివారం అర్ధరాత్రి మెదడువాపు వ్యాధితో చనిపోరుుంది. ఒడ్డెపల్లి స్వామి, లక్ష్మి దంపతుల కూతురు అఖిల కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మూడు రోజుల క్రితం రక్త పరీక్షలు చేస్తే రక్తకణాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. దీంతో ఆమెను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. తలనొప్పి ఎక్కువగా ఉందని తెలుపడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి మెదడు వాపు వ్యాధిగా నిర్ధారించారని తల్లిదండ్రులు తెలిపారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి అఖిల మృతిచెందిందని పేర్కొన్నారు. -
పరువు... ప్రాణం
అమానుషం బేటీ బచావో... బేటీ పడావో.. నినాదం కులం పరువుకు బలవుతోంది! ఇది అంటువ్యాధికన్నా బలంగా ప్రబలుతోంది! అందుకే మొన్నటి వరకు హర్యాణా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకే పరిమితమైన పరువు హత్యలు తమ దుష్ర్పభావాన్ని అత్యంత వేగంగా దక్షిణ భారతానికీ వ్యాప్తిచేస్తున్నాయి. ఆ పీడ తెలంగాణకూ పట్టుకుంది. ఓ ఆడబిడ్డను పొట్టన పెట్టుకుంది. కీడు జరిగింది వారం కిందట... ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండలో! చౌహాన్ లక్ష్మణ్‌సింగ్, చంద్రకళకు ఐదుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వాళ్లలో అఖిల అందరికన్నా పెద్దది. పదిహేడేళ్లు. ఇంటర్ సెకండియర్‌లో ఉంది. లక్ష్మణ్‌సింగ్ తనకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ.. ఆసుపత్రులు లేని మారుమూల గ్రామాల్లో ప్రాథమిక వైద్యం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అఖిల తల్లి చంద్రకళ ఇంటి పనులతోపాటు, వ్యవసాయ పనులూ చూసుకుంటోంది. ఉన్నతస్థానంలో చూడాలనుకొని... కూతురును బాగా చదివించి, ఉన్నతస్థానంలో చూడాలనుకున్న లక్ష్మణ్‌సింగ్ అఖిలను ఇచ్చోడలోని ఓ ప్రైవేటు కళాశాలలో చేర్పించాడు. నిత్యం వైద్యం చేసేందుకు ఇచ్చోడకు వెళ్లే ఆయన దారిలోనే కూతురు కాలేజీ ఉండడంతో అఖిలను కూడా వెంట తీసుకునివెళ్లి కాలేజీలో వదిలేస్తూండేవాడు. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు మళ్లీ కూతురుని వెంటబెట్టుకుని వచ్చేవాడు. ప్రేమే ప్రాణం తీసింది లక్ష్మణ్ ఇంటి సమీపంలోనే మండల తహశీల్దార్ కార్యాలయం ఉంటుంది. అందులో పనిచేస్తున్న మహేందర్‌తో అఖిలకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఈ క్రమంలో 24 వతేదీ (శుక్రవారం) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మహేందర్ అఖిల ఇంటికి వచ్చాడు. ఆవేళలో యువకుడు తన ఇంటికి రావడం లక్ష్మణ్‌కు కోపాన్ని తెప్పించింది. అంతే! వాళ్లింటి దగ్గర్లో ఉండే కానిస్టేబుల్‌కు ఫోన్‌చేసి సమాచారం ఇచ్చాడు. కానిస్టేబుల్ వచ్చి మహేందర్‌ను పట్టుకుని ప్రశ్నించాడు. తామిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు మహేందర్, అఖిల కానిస్టేబుల్‌కు చెప్పారు. ఆ విషయం తెలిసిన లక్ష్మణ్ వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తే తన పరువేం కావాలని కోపోద్రిక్తుడయ్యాడు. కన్నబిడ్డ అని కూడా చూడకుండా చున్నీతో అఖిలకు ఉరివేసి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు లక్ష్మణ్‌ను విచారిస్తే.. తనకు మరో ఇద్దరు ఆడపిల్లలున్నారని, వేరే కులానికి చెందిన అబ్బాయితో పెద్ద కూతురి ప్రేమవ్యవహారం తక్కిన ఇద్దరమ్మాయిల పెళ్లికి చేటు తెస్తుందనే అభద్రతాభావంతో ఈ దారుణానికి ఒడిగట్టానని ఒప్పుకున్నాడు లక్ష్మణ్‌సింగ్. ‘పరువు’ అనే భావనకు కూతురు ప్రాణాలను బలిచ్చిన లక్ష్మణ్‌సింగ్, అతని భార్య చంద్రకళను 25వతేదీ(శనివారం)న పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపించారు. అమ్మానాన్నలిద్దరూ జైలుకి వెళ్లడంతో ఆ కుటుంబంలోని మిగిలిన నలుగురి పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. వాళ్ల ఆలనాపాలనా బాధ్యత దాదాపు 70 ఏళ్ల వయసున్న వారి నానమ్మ సంపావతిభాయిపై పడింది. వారి బాగోగులు చూడడంలో ఆ వృద్ధురాలు పడుతున్న కష్టం అందరిచేత కంటనీరు పెట్టిస్తోంది. - పాత బాలప్రసాద్ సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ దీనికి బాధ్యులెవరు? స్త్రీల రక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణలో మాత్రం విఫలమవుతున్నాయి. ప్రాణం కంటే కులమే గొప్పదనే భావనలో ఆ కులం కోసం, ఆ పరువు కోసం కన్నబిడ్డలనే చంపుకునే దుస్థితితో తల్లిదండ్రుల ఆలోచనలు ఉండడం దారుణం. దీనికి బాధ్యులెవరు?ఇలాంటి ఆలోచనలను నాశనం చేసేలా విద్యాబోధన జరగాలి. ఈ బాధ్యత ప్రభుత్వాలకు ఉందని ఎంతో కాలంగా మహిళ సంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు స్పందించక పోవడంతో జరిగే దారుణాలు జరిగి పోతున్నాయి. - సి.కమలకుమారి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి -
పరువు హత్యపై విచారణ ప్రారంభించిన చెల్లప్ప కమిషన్
నేరుడుగొండలో జరిగిన పరువు హత్యపై విచారణ జరపడానికి చెల్లప్ప కమిషన్ సభ్యులు ఆదివారం నేరుడుగొండ తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కమిషన్ సభ్యులు హెచ్ కే నాగు, ఐటీడీఏ పీఓ ఆర్వీ కర్ణన్, ఆదిలాబాద్ ఆర్డీఓ సుధాకర్ రెడ్డిలు ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. వివరాలు..తమ కుమార్తె ప్రవర్తన కారణంగా కుటుంబం పరువుపోతోందని భావించిన తల్లిదండ్రులు కన్నకూతుర్నే కడతేర్చారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలకేంద్రంలో రెండు రోజుల క్రితం చోటుచేసుకుంది. నేరడిగొండకు చెందిన అఖిల(17) అనే యువతి, తహశీల్ధార్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న మహేందర్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరుకావడంతో పరువుపోతుందని భావించిన యువతి తల్లిదండ్రులు గురువారం రాత్రి యువతిని చున్నీతో ఉరివేసి చంపి అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిదండ్రులను రిమాండ్‌కు తరలించారు. చెల్లప్ప కమిషన్ సభ్యులు ఔట్సోర్సింగ్ ఉద్యోగి మహేందర్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. -
మంటలతో రోడ్డుపైకి దూసుకొచ్చిన మహిళ
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. అనంతరం మంటల వేడికి తట్టుకోలేక రోడ్డుపైకి పరుగులు తీసింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోలేపల్లి అఖిల(26) ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటిచుకొని రోడ్డు పైకి పరుగులు తీసింది. ఇది గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఉస్మానియ ఆస్పత్రికి తరలించారు. -
పాము కాటుతో ఆరేళ్ల పాప మృతి
కర్నూలు : కర్నూలు జిల్లా కోసిగి మండలం చిత్తనకల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నేలపై నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని గురువారం పాము కాటేసింది. దాంతో పాప ఏడవటం ప్రారంభించింది. పాము కాటేసిన విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆ చిన్నారి మరణించింది. దీంతో ఆ చిన్నారి మృతితో తల్లిదండ్రులు ఈరన్న, అంజనమ్మ కన్నీరుమున్నీరవుతున్నారు. -
నన్ను కిడ్నాప్ చేశారు
పోలీసులకు‘స్టోరీ’చెప్పిన నవనంది విద్యార్థిని బొల్లవరం వద్ద కిడ్నాపర్లు వదిలేశారట! బాలిక కట్టుకథ చెబుతోందన్న ఎస్ఐ నందికొట్కూరు: పట్టణంలోని నవనంది ప్రైవేట్ పాఠశాలకు చెందిన 5వ తరగతి విద్యార్థిని అఖిల బుధవారం రాత్రి దాదాపు 6.30 గంటల ప్రాంతంలో కిడ్నాప్‌కు గురైనట్లు ఆమె తల్లి శివమ్మ ఫిర్యాదు చేశారు. తనను కిడ్నాప్ చేసిన వ్యక్తులు బొల్లవరం వద్ద వదిలేయడంతో ఎట్టకేలకు సురక్షితంగా కొందరి సాయంతో ఇంటికి చేరినట్టు బాలిక పోలీసుల వద్ద పేర్కొంది. అయితే, బాలిక చెబుతున్నదంతా కట్టుకథ అని ఎస్ఐ తేల్చిచెప్పారు. వివరాలు..కర్నూలులోని గణేష్‌నగర్‌కు చెందిన అఖిల తాను చదువుతున్న పాఠశాల హాస్టల్లోనే ఉంటోంది. తాను బాత్రూమ్కు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు బక్కెట్‌తో తలపై కొట్టి కొట్టినట్లు ఆమె చెబుతోంది. భయపడి పరుగులు తీసిన తనను వారు వెంబడించారని, తాను కొంతదూరంలో కాయిన్‌బాక్స్ నుంచి హాస్టల్‌కు ఫోన్ చేసి మాట్లాడుతుండగా, వారు వెంటాడి కొట్టడంతో స్పృహ కోల్పోయినట్టు పేర్కొంది. తనకు మెలకువ వచ్చేసరికి బొల్లవరం గ్రామ సమీపంలోని కాలువ వద్ద పడి ఉన్నట్టు గుర్తించిందట. సమీపంలోని కాయిన్ బాక్స్ నుంచి తన ఇంట్లోని వారికి ఫోన్ చేసిందట! రోడ్డుపై నిలిచి ఉండగా ఆర్మీ డ్రస్‌లో ఉన్న ముగ్గురు వాహనంలో వెళుతూ తనను చూసి వివరాలు తెలుసుకుని కర్నూలులోని ఇంటివద్ద వదిలి వెళ్లినట్టు చెప్పుకొచ్చింది. అఖిల చెప్పిన దాంట్లో ఏమేరకు వాస్తవమో తెలుసుకునేందుకు ఎస్ఐ, పోలీసు సిబ్బంది బుధవారం రాత్రికి రాత్రికే దర్యాప్తుకు ఉపక్రమించారు. గురువారం నవనంది పాఠశాల నుంచి బొల్లవరం వరకూ బాలికను వెంట బెట్టుకొని ఎస్ఐ జీవన్ గంగానాథ్బాబు విచారణ చేశారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ బాలిక చెప్పిన దానిలో వాస్తవాలు లేవన్నారు. వీధుల్లో జనాలు ఉంటారని, కిడ్నాప్ యత్నం చేస్తే కేకలు ఎందుకు వేయలని ప్రశ్నిస్తే బాలిక నుంచి సమాధానం లేదన్నారు. పొంతన లేని సమాధానాలు చెబుతోందని, విచారణ పూర్తి చేసిన తరువాత వివరాలని వెల్లడిస్తానని తెలిపారు. ఇదలా ఉంచితే, గతంలోనూ ఇద్దరూ అమ్మాయిలు ఇలాగే కిడ్నాప్ కథ చెప్పి అనవసర రాద్ధాంతం చేశారని నవనంది పాఠశాల నిర్వాహకులు శ్రీధర్ తెలిపారు. మరోవైపు- తన కుమార్తెను కిడ్నాప్ చేయకపోతే చెవి కమ్మలు ఏమయ్యాయి అని బాలిక తల్లి శివమ్మ ఎస్ఐను స్టేషన్లో ప్రశ్నించింది. తన కుమార్తెకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొంది. -
పృధ్విరాజ్ హీరోగా ‘తేజాభాయ్’ స్టిల్స్
-
లోక్ అదాలత్‌లో 148 కేసుల పరిష్కారం
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన లోక్‌అదాలత్‌ల ద్వారా దాదాపు 148 కేసులను పరిష్కరించినట్టు తిరువళ్లూరు కోర్టు న్యాయమూర్తి అఖిలా, మహేశ్వరీ భానురేఖ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా భారతీయ స్టేట్ బ్యాంకు ఆధ్వర్యంలో లోక్‌అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి తిరువళ్లూరు ప్రధాన బ్రాంచి మేనేజర్ రమేష్ అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ జపురుల్లాఖాన్ లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం నుంచి రుణాల వసూలుతోపాటు ఇతర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కేసుల పరిష్కారం, నిధుల పంపిణీ, రుణాల వసూలు తదితర వాటిపై విలేకరులతో మాట్లాడారు. తిరువళ్లూరు మెయిన్ బ్రాంచిలో లోక్‌అదాలత్ ద్వారా 148 కేసులు పరిష్కరించినట్టు వారు తెలిపారు. దీంతోపాటు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని చెల్లించని వారి నుంచి రూ.10 లక్షల 47 వేలను వసూలు చేసినట్టు వివరించారు. బ్యాంకు నుంచి ఖాతాదారులకు, ఖాతాదారుల నుంచి బ్యాంకుకు 2.50 కోట్లను సర్దుబాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం రవీంద్రన్, జనరల్ మేనేజర్ కష్ణమోహన్, బ్రాంచ్ మేనేజర్ రేణుకా, రమేష్, మాధవన్, శ్రీధర్ పాల్గొన్నారు.