పాము కాటుతో ఆరేళ్ల పాప మృతి | six year old baby dies during snake bite | Sakshi
Sakshi News home page

పాము కాటుతో ఆరేళ్ల పాప మృతి

Published Thu, Sep 10 2015 11:36 AM | Last Updated on Tue, Nov 6 2018 4:56 PM

six year old baby dies during snake bite

కర్నూలు : కర్నూలు జిల్లా కోసిగి మండలం చిత్తనకల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నేలపై నిద్రిస్తున్న ఆరేళ్ల  చిన్నారిని గురువారం పాము కాటేసింది. దాంతో పాప ఏడవటం ప్రారంభించింది. పాము కాటేసిన విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆ చిన్నారి మరణించింది. దీంతో ఆ చిన్నారి మృతితో తల్లిదండ్రులు ఈరన్న, అంజనమ్మ కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement