పోలీసులకు‘స్టోరీ’చెప్పిన నవనంది విద్యార్థిని
బొల్లవరం వద్ద కిడ్నాపర్లు వదిలేశారట!
బాలిక కట్టుకథ చెబుతోందన్న ఎస్‌ఐ
నందికొట్కూరు: పట్టణంలోని నవనంది ప్రైవేట్ పాఠశాలకు చెందిన 5వ తరగతి విద్యార్థిని అఖిల బుధవారం రాత్రి దాదాపు 6.30 గంటల ప్రాంతంలో కిడ్నాప్‌కు గురైనట్లు ఆమె తల్లి శివమ్మ ఫిర్యాదు చేశారు. తనను కిడ్నాప్ చేసిన వ్యక్తులు బొల్లవరం వద్ద వదిలేయడంతో ఎట్టకేలకు సురక్షితంగా కొందరి సాయంతో ఇంటికి చేరినట్టు బాలిక పోలీసుల వద్ద పేర్కొంది. అయితే, బాలిక చెబుతున్నదంతా కట్టుకథ అని ఎస్‌ఐ తేల్చిచెప్పారు. వివరాలు..కర్నూలులోని గణేష్‌నగర్‌కు చెందిన అఖిల తాను చదువుతున్న పాఠశాల హాస్టల్‌లోనే ఉంటోంది. తాను బాత్రూమ్‌కు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు బక్కెట్‌తో తలపై కొట్టి కొట్టినట్లు ఆమె చెబుతోంది. భయపడి పరుగులు తీసిన తనను వారు వెంబడించారని, తాను కొంతదూరంలో కాయిన్‌బాక్స్ నుంచి హాస్టల్‌కు ఫోన్ చేసి మాట్లాడుతుండగా, వారు వెంటాడి కొట్టడంతో స్పృహ కోల్పోయినట్టు పేర్కొంది.
తనకు మెలకువ వచ్చేసరికి బొల్లవరం గ్రామ సమీపంలోని కాలువ వద్ద పడి ఉన్నట్టు గుర్తించిందట. సమీపంలోని కాయిన్ బాక్స్ నుంచి తన ఇంట్లోని వారికి ఫోన్ చేసిందట! రోడ్డుపై నిలిచి ఉండగా ఆర్మీ డ్రస్‌లో ఉన్న ముగ్గురు వాహనంలో వెళుతూ తనను చూసి వివరాలు తెలుసుకుని కర్నూలులోని ఇంటివద్ద వదిలి వెళ్లినట్టు చెప్పుకొచ్చింది. అఖిల చెప్పిన దాంట్లో ఏమేరకు వాస్తవమో తెలుసుకునేందుకు ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది బుధవారం రాత్రికి రాత్రికే దర్యాప్తుకు ఉపక్రమించారు. గురువారం నవనంది పాఠశాల నుంచి బొల్లవరం వరకూ బాలికను వెంట బెట్టుకొని ఎస్‌ఐ జీవన్ గంగానాథ్‌బాబు విచారణ చేశారు. అనంతరం ఎస్‌ఐ మాట్లాడుతూ బాలిక చెప్పిన దానిలో వాస్తవాలు లేవన్నారు. వీధుల్లో జనాలు ఉంటారని, కిడ్నాప్ యత్నం చేస్తే కేకలు ఎందుకు వేయలని ప్రశ్నిస్తే బాలిక నుంచి సమాధానం లేదన్నారు. పొంతన లేని సమాధానాలు చెబుతోందని, విచారణ పూర్తి చేసిన తరువాత వివరాలని వెల్లడిస్తానని తెలిపారు. ఇదలా ఉంచితే, గతంలోనూ ఇద్దరూ అమ్మాయిలు ఇలాగే కిడ్నాప్ కథ చెప్పి అనవసర రాద్ధాంతం చేశారని నవనంది పాఠశాల నిర్వాహకులు శ్రీధర్ తెలిపారు. మరోవైపు- తన కుమార్తెను కిడ్నాప్ చేయకపోతే చెవి కమ్మలు ఏమయ్యాయి అని బాలిక తల్లి శివమ్మ ఎస్‌ఐను స్టేషన్‌లో ప్రశ్నించింది. తన కుమార్తెకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొంది.
నన్ను కిడ్నాప్ చేశారు
Published Fri, Nov 14 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM
Advertisement
Advertisement