హైదరాబాద్: కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాలని కక్షిదారులు కోరుకోవడం లేదని, వెంటనే పరిష్కారం కోరుకుంటున్నారని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ.రామలింగేశ్వర్‌రావు తెలిపారు. సిటీ సివిల్ కోర్టు, రంగారెడ్డి, మెట్రోపాలిటన్ న్యాయసేవాధికార సంస్థల తరపున ప్యానెల్ న్యాయవాదులకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు.
లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారం: శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన లోక్‌అదాలత్‌లో 5,627 కేసులు పరిష్కారమయ్యాయి. ఏపీలో 8,308 కేసులు పరిష్కరించి 11.63 కోట్లు పరిహారంగా ప్రకటించారు. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. భోసలే, తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిగ్యూటివ్ చైర్మన్ ఆర్.సుభాష్‌రెడ్డిల మార్గదర్శకత్వంలో లోక్‌అదాలత్‌లు జరి గాయి. సిటీ సివిల్‌కోర్టు చీఫ్ జడ్జి ఎన్.బాలయోగి నేతృత్వంలో జరిగిన లోక్ అదాలత్‌లో 436 కేసులు పరిష్కరించి రూ.2.44 కోట్లు పరిహారాన్ని ప్రకటించారు.
‘కోర్టుల చుట్టూ తిరగాలని అనుకోవడం లేదు’
Published Sun, Aug 9 2015 1:44 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement