సాక్షి, హైదరాబాద్: టెలికం శాఖ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ త్రైమాసిక పింఛన్ అదాలత్‌ను వచ్చే నెల 27న నిర్వహించనున్నట్టు టెలికం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అబిడ్స్‌లోని కమ్యూనికేషన్ ఖాతాల ప్రధాన నియంత్రణ కార్యాలయం మొదటి అంతస్తులో అదాలత్ ఉంటుందని, టెలికం, బీఎస్‌ఎన్‌ఎల్ పింఛన్‌దారులు తమ సమస్యలను వచ్చే నెల 18లోపు కమ్యూనికేషన్ అకౌంట్స్ అధికారి(పింఛన్-1)కి లిఖితపూర్వకంగా అందజేయాలని సూచించారు. ఇతర వివరాలకు 040-24761445 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చు.