
కేసుల సత్వర పరిష్కారానికే లోక్ అదాలత్
- సీనియర్ సివిల్ జడ్జీలు రాధాకృష్ణమూర్తి, భవానీప్రసాద్
- నిర్మల్, అసిఫాబాద్‌లో పలు కేసుల పరిష్కారం
నిర్మల్ అర్బన్/ఆసిఫాబాద్ : ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికే లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిర్మల్, ఆసిఫాబాద్ సీనియర్ సివిల్ జడ్జీలు రాధాకృష్ణమూర్తి, భవానీప్రసాద్ తెలిపారు. నిర్మల్, ఆసిఫాబాద్ కోర్టు ల్లో శనివారం వేర్వేరుగా లోక్ అదాలత్ నిర్వహించగా వారు మాట్లాడారు. చిన్నచిన్న గొడవలతో కేసుల్లో చిక్కుకుని ఇబ్బంది పడొద్దని హితవు పలికారు. ప్రతీ నెల రెండో శనివారం లోక్‌అదాలత్ జరుగుతుందని, పెండింగ్ కేసులు ఉన్న వారు ఇందులో పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే, మండల న్యాయ సే వా సంస్థ ద్వారా అందించే ఉచిత న్యాయ సహాయా న్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇంకా కేసుల పరిష్కారం అనంతరం ఇరువర్గాల వా రు సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. ఈ సందర్భంగా కక్షిదారులు, ఫిర్యాదుదారులతో మాట్లాడిన న్యాయమూర్తులు పలు కేసులను పరిష్కరించారు. నిర్మల్‌లో జరిగిన కార్యక్రమంలో అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్‌రావు, డీఎస్పీ మనోహర్‌రెడ్డి, టౌన్, రూరల్ సీఐలు జీవన్‌రెడ్డి, పురుషోత్తమాచారి, ఏపీపీవోలు శ్యాంసుందర్‌రెడ్డి, నాగభూషణం, అడ్వకేట్ జేఏసీ నాయకులు లింగయ్య పాల్గొన్నారు. కాగా, ఆసిఫాబాద్ లోక్ అదాలత్‌లో ఎనిమిది కేసుల తో పాటు కెరమెరి, వాంకడి, రెబ్బెన మండలాలకు పలు కేసులు పరిష్కరించారు. కార్యక్రమంలో సీఐ సతీష్‌కుమార్, న్యాయవాదులు ఎం.సురేష్, టి.సురేష్, నికోడె రవీందర్ తదితరులు పాల్గొన్నారు.