
సాక్షి, అనంతపురం: వైఎస్ జగన్ ఏడాది పాలనలో సర్వత్రా ప్రశంసలు పొందింది గ్రామవాలంటీర్ వ్యవస్థ. అందుకు అనుగుణంగానే సీఎం ఆశయాలకు తోడ్పాటుగా గ్రామ వాలంటీర్లు పనిచేస్తూ తమ పెద్ద మనసును చాటుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో ఓ గ్రామవాలంటీర్ పెళ్లయిన గంటల వ్యవధిలోనే విధుల్లో చేరి తనకున్న బాధ్యతను తెలియజేశాడు. అమడగూరు మండలం గోపాల్‌నాయక్ తాండాలో తెల్లవారుజామున 6 గంటలకు పెళ్లి చేసుకున్న రాజశేఖర్ నాయక్ అనే గ్రామవాలంటీర్ 9 గంటలకు పెళ్లి బట్టల్లోనే గ్రామంలో పింఛన్లు పంపిణీ చేస్తూ తన గొప్పతనాన్ని చాటుకోవడం విశేషం.
గ్రామ సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌లను నియమించి ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకు తీసుకురాగలిగారు. అంతేకాదు ఈ వాలంటీర్ల సహాయంతో వృద్ధాప్య పెన్షన్లను రికార్డు స్థాయిలో లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకు ఒకటవ తేదీనే చేర్చగలుగుతున్నారు. రాష్ట్రంలో మార్పు కోసమే గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చినట్లు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో అనేకసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: తాకట్టులో సాగరిక.. విడిపించిన మాజీ ఎంపీ
.