
శ్రియ
పెళ్లి పీటల మీద కూర్చుని, మూడు ముళ్లు వేయించుకుని, ఏడడుగులు వేయడానికి శ్రియ రెడీ అయ్యారని సమాచారం. ‘మీ పెళ్లెప్పుడు?’ అని ఎప్పుడు అడిగినా ‘దాని గురించి నేను చెప్పను. అది నా వ్యక్తిగత విషయం’ అని నిర్మొహమాటంగా చెప్పేవారు శ్రియ. ఇటీవల ‘గాయత్రి’ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్‌లోనూ అలానే అన్నారు. అయితే శ్రియ సైలెంట్‌గా పెళ్లి పనులతో బిజీగా ఉన్నారన్నది తాజా వార్త. రష్యాకి చెందిన క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రై కొశ్చీవ్, శ్రియ లవ్‌లో ఉన్నారని కొన్ని రోజుల క్రితం వార్త వచ్చింది.
ఈ ఇద్దరూ త్వరలో ‘వెడ్‌లాక్’లోకి ఎంటరవ్వాలనుకుంటున్నారట. ఇటీవల రష్యా వెళ్లి ఆండ్రై తల్లిదండ్రులను కూడా కలిశారట శ్రియ. పెద్దల సమ్మతం లభించిందని టాక్. వచ్చే నెల 17, 18, 19 తేదీల్లో రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహ వేడుకలు జరుగుతాయని తెలిసింది. హోలీ థీమ్‌లో ఓ రోజు వేడుక, ఇంకో రోజు సంగీత్, మరో రోజు మెహందీ.. ఇలా మూడు వేడుకలను ఇప్పటికి ప్లాన్ చేశారట. మరి... మూడు ముళ్లు పడే డేట్ ఈ మూడు తేదీల్లో ఒకటా? లేక వేరేనా? అని తెలియాల్సి ఉంది.