
72 ఏళ్ల వృద్ధుడు 25 ఏళ్ల కోడలిని పెళ్లిచేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఛపియా ఉమారో అనే గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..72 ఏళ్ల కైలాష్ అనే వ్యక్తి బరహల్‌గంజ్ పోలీస్టేషన్‌లో చౌకీదార్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య 12 ఏళ్ల క్రితం చనిపోయింది. ఐతే అతని మూడో కొడుకు కూడా అనుకోకుండా మరణించాడు. దీంతో అతని కోడలు పూజా వితంతువుగా మారడంతో అప్పటి నుంచి ఆమె తన పుట్టింట్లోనే ఉంటోంది.
ఐతే అనుహ్యంగా గత కొన్ని రోజులుగా మళ్లీ తన భర్త ఇంటికి వచ్చి ఉంటోంది. దీంతో ఒక్కసారిగా ఆ గ్రామంలో ఈ విషయమై పలు అనుమానాలు తలెత్తాయి. ఈ కైలాష్ అనే వృద్ధుడు తన కోడలు పూజానే ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ఈ విషయం గుప్పుమంది. ఈ ఫోటో కాస్త పోలీసులు దృష్టికి వచ్చింది. దీంతో బర్హల్‌గంజ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ ఘటనపై విచారిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment