Chowkidar
-
అతడికి 72, ఆమెకు 28..కోడలినే పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు
72 ఏళ్ల వృద్ధుడు 25 ఏళ్ల కోడలిని పెళ్లిచేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఛపియా ఉమారో అనే గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..72 ఏళ్ల కైలాష్ అనే వ్యక్తి బరహల్‌గంజ్ పోలీస్టేషన్లో చౌకీదార్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య 12 ఏళ్ల క్రితం చనిపోయింది. ఐతే అతని మూడో కొడుకు కూడా అనుకోకుండా మరణించాడు. దీంతో అతని కోడలు పూజా వితంతువుగా మారడంతో అప్పటి నుంచి ఆమె తన పుట్టింట్లోనే ఉంటోంది. ఐతే అనుహ్యంగా గత కొన్ని రోజులుగా మళ్లీ తన భర్త ఇంటికి వచ్చి ఉంటోంది. దీంతో ఒక్కసారిగా ఆ గ్రామంలో ఈ విషయమై పలు అనుమానాలు తలెత్తాయి. ఈ కైలాష్ అనే వృద్ధుడు తన కోడలు పూజానే ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ఈ విషయం గుప్పుమంది. ఈ ఫోటో కాస్త పోలీసులు దృష్టికి వచ్చింది. దీంతో బర్హల్‌గంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ ఘటనపై విచారిస్తామని చెప్పారు. (చదవండి: ఎయిర్ షో సందర్భంగా నాన్‌వెజ్ అమ్మకాలు బంద్!) -
పంజాబ్‌లో తొలి మహిళా చౌకీదార్
టార్చ్‌లైట్ వేస్తుంది కౌర్. పాత ముఖం అయితే.. ‘ఇంత లేటేమిటి?’ అంటుంది. కొత్త ముఖం అయితే.. ‘ఎవరింటికీ..’ అంటుంది. వదిలిపెట్టనైతే వదలదు. ఆపాల్సిందే అడగాల్సిందే! కనురెప్పలా.. ఊరికి ఆమె కాపలా. దేవుడు ఆమె కోసమే చీకటిని ప్రసాదించినట్లున్నాడు! ఆ చీకటితో తన జీవితానికి వెలుగు దారి వేసుకుంది కులదీప్ కౌర్. యాభై ఐదేళ్ల కౌర్ పంజాబ్‌లోని తొలి మహిళా చౌకీదార్. పన్నెండేళ్లుగా జలంధర్ జిల్లా నకోదర్ పరిధిలోని బంగీవాల్ గ్రామానికి ఆమె కాపలా కాస్తోంది. మొదట్లో ఉన్న 800 జీతం ఇప్పుడు 1250 రూపాయలు కావడం ఎనిమిది మంది పిల్లలు గల ఈ తల్లి సంతోషించే సంగతే. అయితే పన్నెండేళ్లుగా ఆ ‘ఉద్యోగం’ తన చెయ్యి జారిపోకుండా ఉన్నందుకే ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తోంది కౌర్. ఒకందుకు ఆమె ఎప్పుడూ బిక్కుబిక్కుమంటూ ఉంటుంది. అర్ధరాత్రులు పహారా కాస్తున్నప్పుడు తాగుబోతులు, దొంగలు ఎవరైనా తనపై దాడి చేస్తారేమోనని కాదు ఆమె భయం. ‘ఇది మగవాళ్ల పని’ అని ప్రభుత్వం తన చేతిలోని టార్చిలైట్‌ను, పొడవాటి లాఠీ లాంటి ఆ కర్రను ఏ క్షణమైనా లాగేసుకుంటుందేమోనని! పంజాబ్ రాష్ట్రం మొత్తం మీద పదమూడు వేల గ్రామాలకు 13,500 మంది ప్రభుత్వ చౌకీదార్లు ఉన్నారు. వారిలో ఇద్దరంటే ఇద్దరే మహిళలు. తొలి మహిళ కులదీప్ కౌర్. రెండో మహిళ రజియా బేగం. బంగీవాల్‌కు పదిహేను కి.మీ. దూరంలోని బిర్ గ్రామనికి చౌకీదార్ రజియా. కౌర్ తర్వాత ఏడాదికి ప్రభుత్వం రజియాను నియమించింది. అలా పంజాబ్‌లో తొలి మహిళా చౌకీదార్ అయింది కౌర్. గ్రామం కాబట్టి రాత్రి తొమ్మిదిన్నరకే ఆమె డ్యూటీ మొదలవుతుంది. సల్వార్ కమీజ్ వేసుకుని, టార్చిలైట్, కర్ర పట్టుకుని ఊళ్లోని సందులు, గొందులన్నీ ఒక చుట్టు వేస్తుంది. ఆ తర్వాత ఊరి మధ్యలోని మర్రిచెట్టు అరుగు మీద ఇరవైనిముషాలు విశ్రాంతిగా కూర్చుంటుంది. పగటిపూట మగవాళ్లు పేకాట ఆడే ప్రదేశం అది. తర్వాత మళ్లీ డ్యూటీ. మధ్య మధ్య విరామాలతో ఉదయం నాలుగు గంటల వరకు డ్యూటీ చేస్తుంది. ఊళ్లో అంతా ఆమెకు తెలిసినవాళ్లే. ఆర్ధరాత్రి దాటాక కొత్త ముఖం కనిపిస్తే ముఖం మీదే లైఫ్ ఫోకస్ చేస్తుంది. ఆమెకేం భయం ఉండదు. ‘ఎవర్నువ్వు! ఎక్కడికెళుతున్నావు?’ అని వాళ్ల వాలకాన్ని బట్టి ఏక వచనంలో గద్దిస్తుంది. బంగీవాల్ గ్రామంలో 500 గడపలు ఉంటాయి. 1500 మంది జనాభా ఉంటారు. డ్యూటీ చేస్తున్నంతసేపూ ‘జాగ్తే రహో’ అని అంటూ ఉంటుంది కౌర్. ఆ అరుపు బలం తగ్గలేదు కానీ, ఆమె కంటిచూపు సన్నగిల్లింది. ఇప్పుడామె రెండు మూడు గంటలు మాత్రమే పని చేయగలుగుతోంది. మిగతా సమయాన్ని ఆమె పెద్ద కొడుకు పూరిస్తుంటాడు. ∙∙ మొదట్లో కులదీప్ కౌర్ భర్త అవతార్ సింగ్ ఆ ఊరికి చౌకీదార్. హఠాత్తుగా ఆయన గుండెపోటుతో చనిపోవడంతో ఆ పని ఆమెకు సంక్రమించింది. పనికి మగవాళ్లు పోటీ పడ్డారు కానీ, సర్పంచ్ పడనివ్వలేదు. న్యాయంగా ఆమెకే దక్కుతుంది అన్నాడు. ప్రారంభంలో కౌర్ పిల్లలంతా ‘‘అమ్మా.. నువ్వు వెళ్లొద్దు’’ అన్నారు. చీకట్లో అమ్మను ఎవరైనా ఏమైనా చేస్తారని భయం. ఊరికి కాపలాగా ఆమె అటు వెళ్లగానే, అమ్మకు కాపలాగా ఇటు వీళ్లు వెనకే వెళ్లేవాళ్లు. ఇప్పుడు ఆమెను పిల్లలే కాదు, ఊరు కూడా ‘సూపర్‌ఉమన్’ అంటోంది. కౌర్ చిన్నప్పుడు బడికిపోలేదు. అందుకే ఎంత కష్టమైనా పిల్లలందర్నీ చదివిస్తోంది. ప్రతి వేకువజామునా డ్యూటీ ముగిశాక కౌర్ చేసే మొదటి పని దేవుడికి ధన్యవాదాలు తెలుపుకోవడం. ప్రశాంతమైన మరొక రాత్రిని ఊరికి ప్రసాదించమని కోరుకోవడం. ఈ కరోనా సమయంలో ‘జాగ్తే రహో’ అనే మాటతోపాటు.. ‘ఘర్ వీచ్ రహో’ అని కూడా అంటోంది. ఇంట్లోనే ఉండండి అని అర్థం. ఏ మహిళా చేయని సాహసం తను చేస్తున్నానని కూడా అనుకోదు కౌర్. తననా పనిని చేయనిస్తున్న గ్రామస్థుల నమ్మకానికి తలవంచి నమస్కరిస్తుంటుంది. -
రాఫెల్‌పై మోదీ సర్కారుకు క్లీన్చిట్
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి, ఫ్రాన్స్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఎటువంటి అవకతవకలు జరగలేదు. గతంలో ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లలో ఎలాంటి పస లేదు. కాబట్టి గతంలో మేం కేంద్రానికి ఇచ్చిన క్లీన్చిట్కే కట్టుబడి ఉన్నాం. ఈ అంశంపై మోదీని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు తప్పు. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం.. దీనికి సంబంధించి ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం.. దీనికి అనుసరించిన విధానంలో ప్రభుత్వం తరఫున ఎలాంటి అవకతవకలు జరగలేదని గతేడాది డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లు సహేతుకంగా లేవని తాజాగా గురువారం కొట్టివేసిన ధర్మాసనం.. దీనిపై గతంలో ఇచ్చిన తీర్పునకే కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది. రూ.58 వేల కోట్ల విలువైన ఒప్పందం చుట్టూ నెలకొన్న వివాదంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలన్న అభ్యర్థనలను కూడా తిరస్కరించింది. న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో మోదీ ప్రభుత్వానికి మరోసారి ఊరట లభించింది. గతంలో ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రివ్యూ పిటిషన్లలో ఎలాంటి పస లేదని సుప్రీం స్పష్టంచేసింది. గతంలో కేంద్రానికిచ్చిన క్లీన్ చిట్కే కట్టుబడి ఉన్నట్టుగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు ఇచ్చింది. ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్‌తో కుదుర్చుకున్న 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం, దానికి అనుసరించిన విధానంలో ప్రభుత్వం తరఫున ఎలాంటి అవకతవకలు జరగలేదని 2018, డిసెంబర్ 14నే సుప్రీం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని పునఃసమీక్షించాలని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, లాయర్ ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లు సహేతుకంగా లేవని సుప్రీం స్పష్టంచేసింది. 58 వేల కోట్ల విలువైన ఒప్పందం చుట్టూ నెలకొన్న వివాదంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలన్న అభ్యర్థనల్ని కూడా తిరస్కరించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అంశాలేవీ అందులో లేవని న్యాయమూర్తులంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా జస్టిస్ కౌల్ తీర్పు చదివి వినిపించారు. తీర్పుపై తాను ఏకీభవిస్తానని చెబుతూనే... కొన్ని అంశాల్లో తనకు వేరే అభిప్రాయాలు ఉన్నాయంటూ జస్టిస్ జోసెఫ్ విడిగా తీర్పు ఇచ్చారు. అందుకు గల కారణాలను వెల్లడించారు. మే 10న రివ్యూ పిటిషన్లపై తీర్పుని రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు... ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న అంతర్ ప్రభుత్వ ఒప్పందంలో (ఐజీఏ) సాంకేతిక సహకారం బదిలీని ఎందుకు చేర్చలేదని, ఒప్పందానికి సంబంధించి సార్వభౌమ పూచీకత్తుని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా విచారణ సంస్థలు కేసుల్ని నమోదు చేయలేవని కోర్టుకు విన్నవించారు. ఇక టెక్నాలజీ బదిలీ వంటి అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని చెప్పారు. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి: అమిత్ షా రాఫెల్ ఒప్పందంపై సుప్రీం ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి సరైన సమాధానమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సుప్రీం తీర్పు వెల్లడయ్యాక ఆయన వరస ట్వీట్లు చేశారు. ఎన్డీయే ప్రభుత్వంపై, బీజేపీ నాయకులపై నిరాధార ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలందరూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ జాగ్రత్తగా ఉండండి: సుప్రీం కోర్టు చీవాట్లు కోర్టు ధిక్కార కేసులన్నీ క్లోజ్ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ప్రధాని మోదీనుద్దేశించి చౌకీదార్ చోర్ హై (కాపలదారుడే దొంగ) అని వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టింది. రాహుల్ వ్యాఖ్యలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని, భవిష్యత్‌లో ఈ తరహా వ్యాఖ్యలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. రాఫెల్ ఒప్పందంలో అవకతవకలేవీ జరగలేదని కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ పదే పదే అదే వ్యాఖ్య చేసి ప్రధాని పరువు తీశారని, ఇదంతా కోర్టు ధిక్కారం కిందకి వస్తుందని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి రాహుల్‌కు వ్యతిరేకంగా కేసు వేశారు. దీన్ని విచారించిన ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగాయ్, జస్టిస్ ఎస్కే పాల్, జస్టిస్ కేఎం జోసెఫ్ రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘రాజకీయాల్లో కీలకమైన హోదా అనుభవిస్తున్న రాహుల్ వాస్తవాలు పరిశీలించకుండా ప్రధానికి వ్యతిరేకంగా మాట తూలడం దురదృష్టకరం’అని వ్యాఖ్యానించారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలు కోర్టు తీర్పునుద్దేశించి చేసినవి కాదని, అవి పూర్తిగా రాజకీయ వ్యాఖ్యలని గతంలోనే రాహుల్ అఫడివిట్ దాఖలు చేశారు. ఇప్పుడు రాహుల్ కోర్టుకి బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో ధిక్కార కేసుల్ని మూసివేస్తున్నట్టుగా న్యాయమూర్తులు ప్రకటించారు. రాఫెల్‌పై విచారణ జరపాల్సిందే: రాహుల్ రాఫెల్ ఒప్పందంపై తీర్పు వెలువరించిన జస్టిస్ కేఎం జోసెఫ్ పేర్కొన్న అంశాల ఆధారంగా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి పేర్కొన్నారు. ‘సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ పేర్కొన్న అంశాలు రాఫెల్ కుంభకోణంపై విచారణకు మార్గం చూపాయి. దీనిపై ఇప్పుడు దర్యాప్తు పూర్తిస్థాయిలో జరగాలి. ఈ స్కాంపై జేపీసీ కూడా వేయాలి’అని గురువారం ఆయన ట్విట్టర్లో డిమాండ్ చేశారు. రాఫెల్ ఒప్పందం విషయంలో బీజేపీ ప్రజలను మోసం చేస్తోందని, సుప్రీంకోర్టు తీర్పుతో పండగ చేసుకోవడం మాని విచారణపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా కోరారు. కాంగ్రెస్ సంధించిన ప్రశ్నలు 1. జాతీయ భద్రతా ముసుగులో యుద్ధ విమానాల ధరను వెల్లడించకపోవడం ఎంతవరకు సరైనది ? ధర తడిసిమోపెడవడానికి కారణాలేంటి ? 2. రిలయెన్స్‌ను ఆఫ్సెట్ భాగస్వామిగా ఎంచుకోవాల్సిన అవసరం ఏమిటి ? 3. దేశీయ విమానాల తయారీ సంస్థ హాల్‌ను ఎందుకు పక్కన పెట్టారు ? 4. ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో పరిణామాలు ఎలా జరిగాయి ? -
ఈనెల 17లోగా 6 కీలక తీర్పులు!
న్యూఢిల్లీ: ముస్లిం మహిళల స్వేచ్ఛను హరించి వేస్తోన్న ట్రిపుల్ తలాక్ రద్దు మొదలుకొని సామాజిక అసమానతలు వేళ్లూనుకొన్న అనేక అంశాల్లో చారిత్రక, సంచలన తీర్పులిచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ ఈనెల 17న పదవీ విరమణ చేయబోతున్నారు. అయితే ఆయన పదవీ విరమణకు మిగిలి ఉన్న ఈ పది రోజుల్లో సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అత్యంత కీలకమైన తీర్పులిచ్చే అవకాశముంది. అందులో యావత్ భారత దేశం కొన్ని దశాబ్దాలుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న రామజన్మభూమి–బాబ్రీ మసీదు కేసు కీలకమైనది. దీంతోపాటు రాజకీయపరమైన, రక్షణకు సంబంధించిన, ఆర్థికపరమైన కేసుల్లో ధర్మాసనం తీర్పులను ఆవిష్కరించబోతోంది. రామజన్మభూమి–బాబ్రీ మసీదు దశాబ్దాలుగా దేశంలో ఎన్నో భావోద్వేగాలకు కారణమైన, ఎన్నెన్నో ఉద్రిక్తతలకు దారితీసిన, మరెన్నో వివాదాలకు తెరలేపిన రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదం ప్రధానమైనది. 70 ఏళ్ళుగా ఉన్న ఈ కేసులో జస్టిస్ గొగోయ్ సారథ్యంలోని బెంచ్ ఈ కీలక తీర్పుని వెలువరించనుంది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హిందు, ముస్లిం వర్గాలు దాఖలు అప్పీలు చేశాయి. దీనిపై సుప్రీంకోర్టు 40 రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు వినింది. శబరిమలలోకి మహిళల ప్రవేశం వయోపరిమితులకు అతీతంగా మహిళలందరినీ శబరిమల ఆలయంలోకి అనుమతించే అంశంలో రివ్యూ పిటిషన్‌పై తుదితీర్పును సైతం చీఫ్ జస్టిస్ గొగోయ్ రిజర్వులో ఉంచారు. కేరళలోని శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ 2018 నాటి తీర్పును జస్టిస్ గొగోయ్ సారథ్యంలోని ధర్మాసనం కొనసాగిస్తుందా? లేదా అన్నది ఈ వారంలో తేలనుంది. రఫేల్ ఒప్పందం... రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై తీర్పుని సుప్రీంకోర్టు రిజర్వ్‌లో పెట్టింది. 36 యుద్దవిమానాల అవినీతి ఒప్పందానికి సంబంధించి పిటిషనర్లు గత ఏడాది అక్టోబర్‌లో దాఖలు చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో సీబీఐ ఎందుకు విఫలమైందనేది ఈ కేసు విచారణ సందర్భంగా తలెత్తిన ప్రధాన వివాదాంశం. డిసెంబర్ 14, 2018లో ఈ ఒప్పందాన్ని సమర్థిçస్తూ తీర్పునివ్వడానికి ప్రభుత్వం కోర్టుని తప్పుదోవ పట్టించడమే కారణమని రివ్యూ పిటిషన్ ఆరోపించింది. చౌకీదార్ చోర్‌హై వివాదం మే 10న సీజేఐ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకురాలు మీనాక్షి లేఖీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ కేసులో చౌకీదార్ చోర్‌హై అనే పదబంధాన్ని తప్పుగా ఆపాదించినందుకు కోర్టుకి రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ కేసులో తుది తీర్పు ఇదే వారంలో వచ్చే అవకాశముంది. ఆర్థిక చట్టం రాజ్యాంగ బద్దత 2017 ఆర్థిక చట్టం యొక్క రాజ్యాంగబద్దమైన ప్రామాణికతను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై అంతిమ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో పెట్టింది. ఈ వివాదంపై సైతం గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పుని ఇదే వారంలో ఇచ్చే అవకాశముంది. ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం పరిధిలోకి వస్తుందా లేదా అన్న అంశంపై దాఖలైన పిటిషన్‌పై ఏప్రిల్ 4న వాదనల అనంతరం సుప్రీంకోర్టు తీర్పు రిజర్వులో పెట్టింది. సమాచార హక్కు చట్టం 2005, సెక్షన్ 2(హెచ్) ప్రకారం చీఫ్ జస్టిస్ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010, జనవరిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. -
చౌకీదార్ కే లియే.. హ్యాపీబార్
సాక్షి, సిటీబ్యూరో :వాళ్లు క్లోజ్ ఫ్రెండ్స్.. ఎంత మంచి స్నేహితులంటే ఏ దేశంలో ఉన్నా ఏటా తప్పనిసరిగా ఒక రోజున కలిసేంత. సమాజానికి ఏదో మంచి చేయాలనే తపన ఉన్న స్నే‘హితులు’. తీయటి తమ స్నేహాన్ని పరిపుష్టం చేసుకుంటున్న వీరంతా సమాజానికి తీపి బహుమతి ఇస్తున్నారు. ‘హ్యాపీ బార్’ పేరుతో వీరు సృష్టించిన ఓ చాక్లెట్ ఆరోగ్యార్థులకు బహుమతి మాత్రమే కాదు ఆపన్నులకు ఆసరా కూడా. ‘‘మేం మొత్తం 15 మంది స్నేహితులం. చదువు పూర్తయ్యాక యూకే, ఆస్ట్రేలియా, అమెరికా.. ఇలా పలు దేశాల్లో స్థిరపడ్డాం. అయితే మా స్నేహాన్ని చిరకాలం వర్థిల్లేలా చేసుకునేందుకు ప్రతి డిసెంబర్లో ఒక ప్లేస్ అనుకుని తప్పకుండా కలిసేవాళ్లం. ఆ క్రమంలోనే ఎవరికి వారుగా చారిటీ యాక్టివిటీస్ చేస్తున్నా, మేం అంతా కలిసి ఏదైనా సంయుక్తంగా చేద్దామనుకున్నాం. అందులో భాగంగా సమాజంలో ఎవరూ అంతగా పట్టించుకోని ఓ కమ్యూనిటీని ఎంచుకుని సాయం చేయాలనే ఆలోచన చేశాం. అప్పుడే మాకు గుర్తొచ్చింది వాచ్మెన్ కమ్యూనిటీ’’ అని చెప్పారు మహేష్. భవనాలు భళా.. కాపలా వెలవెల నగరాల్లో ఇంటికి కాపలా కాసే వాచ్మెన్ల జీవితాలు గమనిస్తే చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఖరీదైన అపార్ట్మెంట్స్, కాలనీల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండే వాచ్మెన్లు కుటుంబ సమేతంగా నివసిస్తుంటారు. చాలా వరకూ అపార్ట్‌మెంట్స్‌లో మెట్లకిందే వీరి జీవనం. ఖరీదైన భవనాలు, ఆకాశహరŠామ్యల్లో ఉంటున్నా సరైన తిండీ, వసతి, పిల్లల చదువుకు నోచుకోని విచిత్రమైన పరిస్థితి వీరిది. ఆర్గానిక్ పద్ధతుల్లో చాక్లెట్ తయారీ వ్యక్తిగతంగా వీరికి సాయం అందించడం అలవాటైన ఈ స్నేహితుల చర్చల్లో తరచూ వీరి గురించి ప్రస్తావన వచ్చేది. అలా అలా అది ఒక ప్రత్యేకమైన చారిటీ కార్యక్రమంగా అవతరించింది. ఈ వాచ్మెన్ కమ్యూనిటీకి ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడంతో మొదలుపెట్టి అంతకు మించి ఏదైనా చేయాలని మిత్రబృందం సంకల్పించింది. అందుకోసం ఒక చాక్లెట్‌కి రూపకల్పన చేశారు. అదే హ్యాపీ బార్. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతుల్లో తయారైన ఈ చాక్లెట్‌ను విక్రయించడం ద్వారా వచ్చే లాభాలను తమ చారిటీకి ఉపయోగిస్తామని ఈ మిత్రబృందం ప్రతినిధి మహేష్ చెప్పారు. -
‘నా నరనరాన జీర్ణించుకుపోయింది’
న్యూఢిల్లీ : చౌకీదార్ చోర్ హై అంటూ ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అఖండ భారతావని మరోసారి చౌకీదార్‌కే పట్టం కట్టింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ మరో సారి ఘన విజయం సాధించి రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు రెండు నెలల ముందు మోదీ ‘మైనే భీ చౌకీదార్’ నినాదాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మోదీతో సహా బీజేపీ నాయకులంతా తమ పేర్లకు ముందు చౌకీదార్ అని చేర్చుకున్నారు. ఫలితాల అనంతరం మోదీ తన పేరుకు ముందు చేర్చుకున్న ‘చౌకీదార్’ను తొలగించారు. ఈ విషయం గురించి మోదీ మాట్లాడుతూ.. ‘‘చౌకీదార్’ అనే పదాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. కేవలం ట్విటర్ పేరు నుంచి మాత్రమే చౌకీదార్‌ను తొలగించాను. కానీ ఈ పేరు నా జీవితంలో ఒక భాగమయ్యింది. నేను ఈ దేశానికి ‘చౌకీదార్’ అనే భావన నా నరనరాన జీర్ణించుకుపోయింది. భారత దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపంచడానికి నిరంతరం కృషి చేస్తాను. మిగతావారు కూడా ఇలానే చేయాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. అంతేకాక ‘‘చౌకీదార్’ అనే పదం చాలా శక్తివంతమైంది. కులతత్వ, మతతత్వ, అవినీతి లాంటి దుష్ట శక్తుల నుంచి కాపాడే గొప్పబాధ్యత చౌకీదార్ మీద ఉంది’ అని తెలిపారు. బీజేపీ ‘చౌకీదార్’ నినాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ‘చౌకీదార్ చోర్ హై’ అనే నినాదాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇవేవి కాంగ్రెస్‌ను ఓటమి నుంచి కాపాడలేకపోయాయి. -
రాహుల్ బేషరతు క్షమాపణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ బుధవారం సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. చౌకీదార్ చోర్ హై(మోదీ దొంగ) అని సుప్రీంకోర్టు చెప్పిందంటూ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతూ సుప్రీంకోర్టు ముందు 3 పేజీల అఫిడవిట్‌ను దాఖలుచేశారు. తనకు సుప్రీంకోర్టుపై చాలా గౌరవముందని వ్యాఖ్యానించారు. తాను చౌకీదార్ చోర్ హై అన్న వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా సుప్రీం తీర్పునకు ఆపాదించలేదనీ, అది అనుకోకుండా జరిగిందన్నారు. తనపై క్రిమినల్ విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును కోరారు. రఫేల్ ఒప్పందం విషయంలో పిటిషనర్లు సాక్ష్యాలుగా సమర్పించిన పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు 2019, ఏప్రిల్ 10న తెలిపింది. ఈ నేపథ్యంలో అమేథీలో రాహుల్ మీడియాతో మాట్లాడుతూ..‘చౌకీదార్ చోర్’ అని సుప్రీంకోర్టు కూడా తేల్చిందని వ్యాఖ్యానించారు. దీంతో రాహుల్ తన వ్యాఖ్యలను సుప్రీం తీర్పుకు ఆపాదించారనీ, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్రిమినల్ విచారణను కొట్టేయండి.. ఈ కేసు విచారణ సందర్భంగా బుధవారం సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ రాహుల్ తరఫున వాదిస్తూ.. ‘సుప్రీంకోర్టు తీర్పుకు తన అభిప్రాయాన్ని ఆపాదించినందుకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు కోరుతున్నారు. అనుకోకుండా ఆ వ్యాఖ్యలను చేశాననీ, ఉద్దేశపూర్వకంగా చెప్పలేదని వివరణ ఇచ్చారు. ఈ అఫిడవిట్‌ను న్యాయస్థానం అంగీకరించి, తనపై జరుగుతున్న క్రిమినల్ ధిక్కార విచారణను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరుతున్నారు’ అని తెలిపారు. బీజేపీ మీనాక్షి లేఖి పిటిషన్‌పై గతంలో రాహుల్ క్షమాపణలు కోరుతూ సుప్రీంకోర్టులో రెండు అఫిడవిట్లు దాఖలుచేశారు. -
రాహుల్ గాంధీపై సుప్రీం కోర్టు ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘చౌకీదార్ చోర్’ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టుకు క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలను కోర్టుకు ఆపాదించడం తప్పేనని.. ఇందుకు రాహుల్ బాధపడుతున్నట్లు ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మంగళవారం కోర్టుకు తెలిపారు. దీన్ని బట్టి రాహుల్, కోర్టును క్షమాపణ కోరినట్లే అని అర్థ చేసుకోవాలంటూ అభిషేక్ సింఘ్వీ కోర్టుకు నివేదించారు. గతంలో రాహుల్ గాంధీ.. రాఫెల్ కుంభకోణంలో ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ చౌకీదార్ చోర్ అని కోర్టే చెప్పిందంటూ.. తన వ్యాఖ్యలను సుప్రీం కోర్టుకు ఆపాదించిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ సుప్రీం కోర్టు వ్యాఖ్యలను వక్రీకరించారంటూ బీజేపీ ఎంపీ మీనాక్షి రాహుల్ గాంధీపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా రాఫెల్ డీల్ కేసులో చౌకీదార్ చోర్ అనే వ్యాఖ్యానం తాను ఎప్పుడు చేయలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మేము అని మాటలను మాకేలా ఆపాదిస్తారని కోర్టు రాహుల్‌ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న రాహుల్ అఫిడవిట్ దాఖలు చేశారు. దానిలో సదరు వ్యాఖ్యలపై ‘చింతిస్తున్న’ అని తెలిపారు. అయితే ‘చింతిస్తున్న’ అనే పదాన్ని బ్రాకెట్లో ఎందుకు చేర్చారని కోర్టు రాహుల్‌ని ప్రశ్నించింది. దీనిపై కోర్టు ధిక్కారం కింద చర్యలు చేపడతామని రాహుల్ గాంధీని కోర్టు హెచ్చరించింది. -
సుప్రీంకు రాహుల్ మరో‘సారీ’
న్యూఢిల్లీ: చౌకీదార్ చోర్ హై అన్న తన వ్యాఖ్యలను రఫేల్ కేసులో తీర్పుకు తప్పుగా ఆపాదించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి విచారం వ్యక్తంచేశారు. ఈ మేరకు మరో తాజా అఫడవిట్ దాఖలు చేశారు. తనపై ధిక్కార పిటిషన్ దాఖలు చేయడం ద్వారా.. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి తన రాజకీయ లబ్ది కోసం కోర్టును రాజకీయ వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. ధిక్కార పిటిషన్‌ను కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. ముమ్మర ఎన్నికల ప్రచార వేడిలో తానా వ్యాఖ్యలు చేశానని, సుప్రీంకోర్టు తీర్పులను తప్పుగా వక్రీకరించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. రఫేల్ కేసులో కోర్టు ఉత్తర్వులను చదవకుండానే ఎన్నికల వేడిలో మాటలన్నానని తెలిపారు. తన మాటలను ప్రత్యర్థి పార్టీలు ఉపయోగించుకున్నాయని, దుర్వినియోగం చేశాయని విమర్శించారు. తాను 130 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఒక బాధ్యతాయుతమైన రాజకీయ, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తినని పేర్కొంటూ.. కోర్టు ప్రక్రియపై తప్పుడు ప్రభావం చూపించే లేఖి పిటిషన్‌ను తోసిపుచ్చాలని విజ్ఞప్తి చేశారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వాటిపై విచారం వ్యక్తం చేస్తూ తొలిసారి ఏప్రిల్ 22న రాహుల్ కోర్టులో అఫడవిట్ దాఖలు చేశారు. విచారణను వాయిదా వేయాలన్న కేంద్రం గత డిసెంబర్ 14 నాటి రఫేల్ కేసు తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం నాటి విచారణను వాయిదా వేయాలని కేంద్రం సోమవారం సుప్రీంకోర్టును కోరింది. పార్టీల రివ్యూ పిటిషన్లపై స్పందించేందుకు సమయం కావాలని తన లేఖలో పేర్కొంది. కాగా ఈ మేరకు సంబంధిత పార్టీలకు లేఖను పంపిణీ చేసేందుకు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతించింది. సభలో ‘చౌకీదార్’ చొక్కాలు చురు/ధోల్పూర్ (రాజస్తాన్): రాజస్తాన్‌లోని చురు జిల్లా సర్దార్ షహర్లో రాహుల్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు ‘మై భీ చౌకీదార్’అని రాసున్న టీషర్ట్లను ధరించిన కొందరు యువకులు హాజరయ్యారు. వారిని స్వాగతిస్తామని రాహుల్ తెలిపారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ‘తాము అధికారంలోకి రాగానే 2 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చౌకీదార్ గారు ప్రమాణం చేశారు. మీలో ఎవరికైనా ఆ ఉద్యోగాలు వచ్చాయా’అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే అందరి బ్యాంకు అకౌంట్లలో రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారని.. మీలో ఎవరికైనా ఆ మొత్తం వచ్చిందా అని ప్రజలను ప్రశ్నించారు. జైపూర్ గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గంలో రాహుల్ ప్రచారం చేస్తూ ‘రఫేల్‌పై ఒక విచారణ జరగనుంది. ఇద్దరి పేర్లు బయటకు వస్తాయి. ఒకటి అనిల్ అంబానీ, రెండు నరేంద్ర మోదీ’ అని అన్నారు. -
మోదీ అన్యాయం చేశారు
జలోర్/అజ్మీర్/కోట: ప్రధాని మోదీ గత ఐదేళ్లలో దేశ ప్రజలకు అన్యాయం చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. ‘అచ్ఛే దిన్ ఆయేంగే’అన్న నినాదం పోయి దాని స్థానంలో ‘చౌకీదార్ చోర్ హై’ వచ్చిందన్నారు. అందరికీ న్యాయం ఒకే ఒక్క ‘హిందుస్తాన్’ ఉండాలని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పారు. గురువారం రాజస్తాన్‌లోని జలోర్, అజ్మీర్, కోటలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో రాహుల్ ప్రసంగించారు. హిందుస్తాన్‌లో అన్యాయమనేదే ఉండకూడదని, దేశం రెండు హిందుస్తాన్లుగా విభజింపబడకూడదని అన్నారు. గత ఐదేళ్లలో ప్రజలు ‘మన్ కీ బాత్’విన్నారని, కానీ ‘న్యాయ్’పథకానికి రూపకల్పన చేయడం ద్వారా కాంగ్రెస్ మేధావి వర్గం ‘కామ్ కీ బాత్’చేసిందని అన్నారు. మోదీజీ తెరిపించిన బ్యాంకు ఖాతాల్లోనే ‘న్యాయ్’పథకానికి సంబంధించిన డబ్బులు వేయాలనుకుంటున్నాననిæ చెప్పారు. ఆయా కుటుంబాల మహిళల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ‘మన్‌కీ బాత్’(మనసులోని మాట)ను వింటుందని, ఆ మేరకు నడుచుకుంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే ఒక్క ఏడాదిలోనే 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుందని చెప్పారు. -
ఎన్నికల బరిలో ‘చౌకీదార్’
నిజమేనండీ.. గుర్గావ్ లోక్‌సభ స్థానం నుంచి ఈ చౌకీదార్ పోటీ చేస్తున్నారు. అదేంటీ.. ఈ దేశపు చౌకీదార్ మోదీ వారణాసి నుంచి కదా పోటీ చేస్తోంది అని ఆశ్చర్యపోతున్నారా?. ఈ చౌకీదార్ మీరనుకుంటున్న చౌకీదార్ కాదు. ఈయన ఢిల్లీలోని గాంధీ సమాధి (రాజ్‌ఘాట్)ని కాపలా కాసే చౌకీదార్. ఈయన పేరు జై కవార్ త్యాగి. వయసు 64 ఏళ్లు. సైన్యంలో పని చేసిన త్యాగి 19 ఏళ్ల నుంచి రాజ్‌ఘాట్‌లో కాపలాదారుగా ఉంటున్నారు. ‘గాంధీజీ సమాధి దగ్గర పని చేస్తుండగా.. ఈ దేశానికి, సమాజానికి ఏదైనా చేయాలన్న ప్రేరణ కలిగింది. వ్యవస్థను బాగు చేయాలంటే దాంట్లో దిగాలన్న జ్ఞానోదయం కలిగింది. నా సర్వీసులో కాంగ్రెస్, బీజేపీ.. ఇలా ఎన్నో ప్రభుత్వాలను చూశాను. పేరు తేడా కాని తీరు అందరిదీ ఒక్కటే. దేశం ఎదుర్కొంటున్న అన్ని అనర్థాలకీ మూలం అవినీతి, ఆశ్రిత పక్షపాతమే. నిరుద్యోగం, అవినీతి యువతను, సమాజాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో కళ్లారా చూస్తున్నాను. వీటిని అరికట్టడం కోసమే నేను ఎన్నికల్లో దిగుతున్నాను’ అంటూ తన లక్ష్యాన్ని స్పష్టం చేశారు త్యాగీ. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయని, సర్కారు ఉద్యోగాలను తగ్గించేస్తున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన దక్ష పార్టీ తరఫున త్యాగీ నామినేషన్ దాఖలు చేశారు. దాన్ని ఎన్నికల అధికారులు ఆమోదించారు కూడా. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఐదేళ్ల నుంచి తన పింఛను సొమ్మును దాచుకుంటున్నానని త్యాగి చెప్పారు. -
మోదీ 100 శాతం దొంగ
సాక్షి, బెంగళూరు/కోలార్/చిత్రదుర్గ: చౌకీదార్(కాపలాదారు)గా తనను తాను చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ 100 శాతం దొంగని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో దొంగల ఇంటి పేర్లన్నీ మోదీ అని ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. ఈ లోక్‌సభ ఎన్నికలు అంబానీ–సామాన్యులకు, దొంగలు–నిజాయితీపరులైన ప్రజలకు, అబద్ధపు హామీలు–నిజాయితీకి మధ్య జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. అలాగే ఈ ఎన్నికలు రెండు భిన్నమైన భావజాలాల మధ్య జరుగుతున్నాయనీ, వీటిలో ఓవైపు విద్వేషం, కోపం, విభజన రాజకీయాలు ఉంటే, మరోవైపు ప్రేమ, ఆప్యాయత, సోదరభావం ఉన్నాయని అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి అభ్యర్థుల తరఫున శనివారం ప్రచారం నిర్వహించిన రాహుల్.. మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దొంగ స్నేహితుడికి రూ.30 వేల కోట్లు ఈ సందర్భంగా రఫేల్ ఒప్పందాన్ని ప్రస్తావించిన రాహుల్..‘మేం ప్రజల గొంతుకగా మారాలనుకుంటున్నాం. చౌకీదార్ కావాలనుకోవడం లేదు. ఈ చౌకీదార్(మోదీ) నిజంగా 100 శాతం దొంగే. మోదీ రూ.30,000 కోట్ల ప్రజాధనాన్ని తన దొంగ స్నేహితుడు అనిల్ అంబానీకి బహుమతిగా ఇచ్చారు. నీరవ్‌మోదీ, మెహుల్ చోక్సీ, అనిల్ అంబానీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ.. వీరంతా ఓ దొంగల ముఠా. ప్రజలకు నాదో ప్రశ్న.. ఈ దొంగలందరి పేర్లలో మోదీ అని ఎందుకుంది? ఇంకా ఎంతమంది మోదీల పేర్లు వెలుగులోకి వస్తాయో తెలియడం లేదు’ అని ఎద్దేవా చేశారు. మోదీ చౌకీదార్ ప్రచారంపై స్పందిస్తూ..‘మీరు ఎప్పుడైనా రైతులు, కార్మికులు, నిరుద్యోగుల ఇంటి ముందు చౌకీదార్ ఉండటం చూశారా? చూసుండరు. ఎందుకంటే చౌకీదార్ అనిల్ అంబానీ ఇంటి ముందు రక్షణగా ఉంటాడు. కేవలం 15–20 మంది ధనవంతులకే భద్రత కల్పిస్తాడు’ అని ఎద్దేవా చేశారు. బీజేపీలా అబద్ధాలు చెప్పబోం. ప్రధాని మోదీ రైతులు, ఉద్యోగాలు, అవినీతి గురించి మాట్లాడటం మానేశారని రాహుల్ దుయ్యబట్టారు. ‘మేం బీజేపీ నేతల్లాగా అబద్ధాలు చెప్పబోం. ఈ ఎన్నికలు ఐదేళ్ల అన్యాయానికి, కాంగ్రెస్ అందించే న్యాయ్(కనీస ఆదాయ భద్రత పథకం)కు మధ్య జరుగుతున్నాయి. దేశంలోని ప్రతీఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామని మోదీ చెప్పిన అబద్ధానికి, అత్యంత నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళల బ్యాంకు ఖాతాల్లో ఐదేళ్ల కాలానికి రూ.3.6 లక్షలు జమచేస్తామని చెప్పే కాంగ్రెస్ హామీకి మధ్య ఈ పోరాటం సాగుతోంది’ అని అన్నారు. బ్యాంకు రుణాలు చెల్లించకపోయిన రైతులను జైలుపాలు చేసిన మోదీ ప్రభుత్వం రుణాలు ఎగ్గొట్టిన అనిల్ అంబానీని మాత్రం కాపాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. -
చౌకీదార్.. నామ్‌దార్
అహ్మద్‌నగర్ / గంగావతి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. నిజాయితీపరుడైన చౌకీదార్(కాపలాదారు) కావాలో, లేక అవినీతిపరుడైన నామ్‌దార్(గొప్ప పేరున్న వ్యక్తి) కావాలో తేల్చుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఐదేళ్లలో ప్రజలు తన పాలనను చూశారన్న మోదీ, దేశ భవిష్యత్తు ఎటు వెళ్లాలో ప్రజలే నిర్ణయించాలని కోరారు. మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో శుక్రవారం బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ, విపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు. సుస్థిర ప్రభుత్వాన్ని అందించాం ‘సుస్థిరమైన మా ప్రభుత్వం ధైర్యంగా పలు నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రజలు గమనించారు. కానీ రిమోట్ కంట్రోల్ యూపీఏ పాలనలో కుంభకోణాలు, కీలక అంశాల్లో జాప్యం అన్నవి నిత్యకృత్యంగా ఉండేవి. తరచుగా జరిగే బాంబు దాడుల్లో రైతులు, మధ్యతరగతి ప్రజలు, వ్యాపారులు చనిపోయేవారు. రైళ్లు, బస్సుల్లో బాంబులు పేలేవి. కానీ చౌకీదార్ పాలనలో బాంబు పేలుళ్లు లేవు. ఎందుకో తెలుసా? చిన్నతప్పు చేసినా దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న భయాన్ని ఉగ్రవాదులకు అర్థమయ్యేలా ఈ చౌకీదార్ చేశాడు. ఉగ్రవాదుల ఇళ్లలో దూరి వారిని హతమార్చేందుకు ఈ చౌకీదార్ అనుమతించాడు’ అని వ్యాఖ్యానించారు. విదేశీ కళ్లద్దాలతో ఎన్సీపీ చూస్తోంది.. ‘కశ్మీర్‌కు ప్రత్యేకంగా ప్రధాని ఉండాలంటున్నవారికి కాంగ్రెస్, ఎన్సీపీలు మద్దతు ఇస్తున్నాయి. కాంగ్రెస్ తన ఆలోచనాశక్తిని ఎప్పుడో కోల్పోయింది. కాబట్టి వారిపై నాకు ఎలాంటి ఆశలు లేవు. కానీ శరద్ పవార్(ఎన్సీపీ అధినేత) దేశం కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. శరద్ రావ్.. ఇద్దరు ప్రధానుల డిమాండ్‌పై మీరెందుకు మౌనంగా ఉన్నారు? ఇది మీకు ఆమోదయోగ్యమేనా? మీ పార్టీ పేరు రాష్ట్రవాది. కానీ మీరు కాంగ్రెస్‌తో కలిసి దేశాన్ని విదేశీ కళ్లద్దాలతో చూస్తున్నారు’ అని విమర్శించారు. కర్ణాటకను ప్రస్తుతం ‘20 శాతం కమీషన్ ప్రభుత్వం’ పాలిస్తోందని మోదీ ఎద్దేవా చేశారు. కొప్పళ జిల్లాలోని గంగావతిలో జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ మోదీ మాట్లాడారు. ‘రెండు పూటలా భోజనానికి గతిలేని వారు మాత్రమే సైన్యంలో చేరతారని కర్ణాటక సీఎం కుమారస్వామి మాట్లాడటం సిగ్గుచేటు. ఈ వ్యాఖ్యలతో సైనికుల ఆత్మస్థైర్యాన్ని ఆయన దెబ్బతీశారు’ అని అన్నారు. -
దూషించిన వ్యక్తికి సుష్మా సాయం
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ట్విట్టర్లో పరుష పదజాలంతో తనను దూషించిన వ్యక్తికి సాయం అందించేందుకు మంత్రి సుష్మాస్వరాజ్ సానుకూలత వ్యక్తం చేశారు. సకాలంలో పాస్‌పోర్టు అందక పోవడంతో తీవ్ర నిరాశకు లోనైన ఓ వ్యక్తి సుష్మా స్వరాజ్‌ను మీరు కాపలాదారు(చౌకీదార్) కాదంటూ దూషించారు. ఇందుకు స్పందించిన సుష్మా.. ‘మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలు. మా కార్యాలయం సిబ్బంది మిమ్మల్ని సంప్రదిస్తారు. మీకు పాస్‌పోర్టు అందేందుకు సాయపడతారు’ అంటూ బదులిచ్చారు. ‘సదరు వ్యక్తి మార్చి 13వ తేదీన అధికారులకు సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాంట్లో అడ్రస్ ధ్రువీకరణ సరిగా లేదు. 20న అడ్రస్ ధ్రువీకరిస్తూ మరో పత్రం జత చేశారు. దీనిపై అంధేరీ పోలీస్‌స్టేషన్ సిబ్బంది విచారణ జరిపారు. నివేదిక అందాల్సి ఉంది’ అంటూ వ్యక్తిగత కార్యదర్శి ఇచ్చిన సమాచారాన్ని కూడా ఆ పోస్ట్‌కు జత చేశారు. -
పట్టుకోండి చూద్దాం..!
పక్క ఫొటో చూశారుగా.. మోదీ ‘మైభీ చౌకీదార్’ ప్రచారంపై కాంగ్రెస్ రూపొందించిన వ్యంగ్య ట్విట్టర్ గేమ్‌లివి. కాంగ్రెస్ అధికార ట్విట్టర్ హ్యాండిల్లో ఆదివారం వీటిని ఉంచారు. మొదటి దాంట్లో ఒకే రూపంలో (చౌకీదార్) ఉన్న పలువురి ఫొటోలు ఉన్నాయి. అందులో ఒక ఫొటోలో చౌకీదార్‌కు తెల్లగడ్డం ఉంటుంది. మోదీని పోలి ఉన్న ఆ ఫొటోను గుర్తించడమే ఈ గేమ్. ‘పైనున్న వారిలో ఒక్క చౌకీదారే దొంగ. వారెవరో గుర్తు పట్టగలరా’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఇక రెండోది ఒక వీడియో. స్లైడ్‌షో రూపం (పక్క ఫొటో)లో ఉన్న దీంట్లో ఊచల వెనుక ఒక దొంగ, వాచ్‌మన్ ఒకరివెనుక ఒకరు వస్తూ పోతూ ఉంటారు. దీనికి ‘దొంగను పట్టుకోండి’ అని కేప్షన్ పెట్టారు. కాగా, బీజేపీ మైభీ చౌకీదార్ నినాదానికి పోటీగా కాంగ్రెస్ ‘మైభీ బేరోజ్‌గార్’ అన్న నినాదాన్ని ఎత్తుకుంది. -
‘ఆ రోజు 130 కోట్ల మంది ప్రమాణం చేస్తారు’
సాక్షి,న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నాలుగు తరాలుగా తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గొప్ప మాటలు చెబుతున్న ఆ పార్టీ నేతలు ఘనమైన వాగ్ధానాలు చేయడమే తప్ప వాటిని నెరవేర్చలేదని దుయ్యబట్టారు. తమను మరోసారి గెలిపిస్తే ప్రజల ఆకాంక్షలను పూర్తిగా నెరవేరుస్తామన్నారు. ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీలో ‘మై భీ చౌకీదార్’ కార్యక్రమంలో మాట్లాడుతూ మిషన్ శక్తి విజయవంతమైందని, ఇది మన శాస్త్రవేత్తల విజయమని అభివర్ణించారు. ఈ విజయంతో భారత్ మూడు అగ్రదేశాల సరసన చేరిందని చెప్పుకొచ్చారు. పటిష్ట, సుసంపన్న భారత్ కోసం కృషి చేసే మనమంతా కాపలాదారులమేనని అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం తనతో పాటు 130 మంది భారతీయులు ప్రమాణం చేస్తారని చెప్పారు. కాగా, నాలుగు దశాబ్ధాలుగా మనం ఉగ్రవాదంతో బాధపడుతున్నామని, దీనికి బాధ్యులెవరో మనకు తెలుసునన్నారు. 2014 నుంచి ఉగ్రవాదులను జైలుకు పంపేందుకు తాను చర్యలు చేపట్టానన్నారు. దేశాన్ని లూటీ చేసిన వారే పెరిగిన అవినీతికి మూల్యం చెల్లించాల్సి ఉందని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. -
ట్వీట్లు చేసేది నేనే, దెయ్యం కాదు..!
సాక్షి, న్యూఢిల్లీ: ‘నా ట్విటర్ ఖాతాలో నుంచి ట్వీట్లు చేసేది నేనేనని, దెయ్యం కాద’ని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చమత్కరించారు. సమిత్ పాండే అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసిన ట్వీట్‌కు ఆమె ఈమేరకు బదులిచ్చారు. ‘సుష్మా స్వరాజ్ అకౌంట్‌ను ఆమె కాకుండా మరెవరో (పీఆర్) నిర్వహిస్తున్నార’ని సమిత్ పాండే అనుమానం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. దీనికి బదులుగా ‘ట్విటర్లో యూజర్లు అడిగిన ప్రశ్నలకు మాధానాలిచ్చేది నేనే, నా దెయ్యం కాద’ని సుష్మా తెలిపారు. గతవారం ట్విటర్లో మరోవ్యక్తి ‘మిమ్మల్ని మీరు ఎందుకు చౌకీదార్ (కాపలాదారు)గా పిలుచుకుంటార’న్న ప్రశ్నకు జవాబుగా.. ఎందుకంటే నేను భారత్‌లో, విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ప్రయోజనాలకు కాపలా కాస్తున్నానని సుష్మా దీటుగా సమాధానమిచ్చారు. -
నెటిజన్ వ్యంగ్యం.. ‘చిన్నమ్మ’ కౌంటర్
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ‘మై భీ చౌకీదార్’ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడు సహా అమిత్‌షా సహా కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు తమ ట్విటర్ ఖాతాల పేర్లకు ‘చౌకీదార్’పదాన్ని జతచేర్చారు. ‘నేను కాపాలాదారునే (మై భీ చౌకీదార్)’ అనే అర్థం ఉన్న ఈ పదంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా విపక్ష పార్టీలన్నీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బీజేపీ చౌకీదార్ క్యాంపెయిన్‌పై నెటిజన్లు కూడా తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇందులో భాగంగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్.. ‘ మేడమ్ మీరు మా దేశ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి అని అనుకుంటున్నాను. బీజేపీలో మీరొక్కరే కాస్త మంచి మనసున్న వ్యక్తి. మిమ్మల్ని మీరు చౌకీదార్ అని ఎందుకు అనుకుంటున్నారు’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ఇందుకు స్పందించిన సుష్మ.. ‘ అలా ఎందుకు చేశానంటే.. భారతీయుల, ప్రవాస భారతీయుల సమస్యలు తీర్చే కాపలాదారీ పని చేస్తున్నాను కదా. అందుకు మై భీ చౌకీదార్’ అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. Because I am doing Chowkidari of Indian interests and Indian nationals abroad. https://t.co/dCgiBPsagz — Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) March 30, 2019 -
ఆయన అనిల్ అంబానీ, నీరవ్ మోదీలకు కాపలాదారు..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ దూకుడు పెంచారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కాపలాదారు కాదని, ఆయన పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, విదేశాలకు పారిపోయిన ఆభరణాల వ్యాపారి నీరవ్ మోదీలకు కాపలాదారని రాహుల్ ఎద్దేవా చేశారు. రాజస్ధాన్‌లోని శ్రీగంగా నగర్లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి రాహల్ మాట్లాడుతూ రైతులు, నిరుగ్యోగ యువత ఇంటికి కాపలాదారును ఎవరైనా చూశారా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ తాను కాపలాదారునని చెప్పుకొంటారు..కానీ ఆయన ఎవరికి కాపలాదారో (చౌకీదార్) మాత్రం చెప్పరని అన్నారు. మోదీ మీకు కాపలాదారు కాదని,ఆయన అనిల్ అంబానీ, నీరవ్ మోదీ వంటి వారికి కాపలాదారని రాహుల్ వ్యాఖ్యానించారు. కాగా రాహుల్ ఇటీవల బిహార్‌లో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ మీరెప్పుడైనా దేశంలో సామాన్యుడి ఇంటి ఎదుట కాపలాదారును చూశారా అని ప్రశ్నించారు. ప్రధాని సంపన్న పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తారని ఆక్షేపించారు. -
ప్రియాంకకు ‘చౌకీదార్’ అర్థం తెలియదు
ముజఫర్‌నగర్: బీజేపీ ఉపాధ్య క్షురాలిగా ఇటీవల నియమించబడిన సీనియర్ నేత ఉమాభారతి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ వాద్రాపై విరుచుకుపడ్డారు. ఆమెకు చౌకీదార్ (కాపలాదారు) అర్థమే తెలియదని విమర్శించారు. బీజేపీ చౌకీదార్లు కేవలం ధనవంతుల కోసమే పనిచేస్తున్నారన్న ప్రియాంక వ్యాఖ్యలపై ఉమాభారతి స్పందించారు. ప్రియాంకకి చౌకీదార్ అర్థం తెలియదని, గ్రామాల్లో పేదల రక్షణ కోసం నిలబడేవారిని చౌకీదార్లు అంటారని ఆమె వివరించారు. ముజఫర్‌నగర్ లోక్‌సభ నియోజవకర్గంలో ఉమాభారతి ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అక్కడ సిట్టింగ్ ఎంపీ సంజీవ్ బల్యన్ని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్ఎల్డీ, ఎస్పీ, బీఎస్పీ పొత్తులో భాగంగా ఈ స్థానంలో సంజీవ్ బల్యన్కు పోటీగా ఆర్ఎల్డీ చీఫ్ అజిత్‌సింగ్ పోటీ చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీని ‘వికాస్ పురుష్’గా అభివర్ణించిన ఉమాభారతి, భారీ గెలుపుతో మోదీ తిరిగి అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
పేదల్ని ‘చౌకీదార్’లు పట్టించుకోట్లేదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. కాపలాదారులు(బీజేపీ నేతలు) ప్రస్తుతం ధనికుల కోసమే పనిచేస్తున్నారనీ, పేదలగోడు వారికి పట్టడం లేదని దుయ్యబట్టారు. యూపీలో చక్కెర రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.10,000 కోట్లు దాటడంపై ప్రియాంక ఆదివారం స్పందిస్తూ..‘యూపీలో చెరకు రైతులు పగలు,రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో బాధ్యత తీసుకోవడం లేదు. ప్రస్తుతం ఈ బకాయిలు రూ.10,000 కోట్లు దాటాయి. అంటే చెరకు రైతుల పిల్లల చదువులు, ఆహారం, ఆరోగ్యంతో పాటు మరో పంటసాగుకు అవసరమైన నగదు ఆగిపోయినట్లే’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలంతా తమ ట్విట్టర్ ఖాతాల్లో పేరుకు ముందు చౌకీదార్(కాపలాదారు) అనే పదాన్ని చేర్చిన నేపథ్యంలో ప్రియాంక ఈ మేరకు స్పందించారు. ప్రియాంకా గాంధీ ఇటీవల యూపీ తూర్పువిభాగం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. -
చాయ్‌వాలాలను మర్చిపోతున్నారు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చౌకీదార్లను గుర్తు చేసుకుంటూ తన తోటి చాయ్‌వాలాలను మర్చిపోతున్నారని, తదుపరి రాజకీయ ప్రయోజనాల కోసం మరొకరిని గుర్తు చేసుకుంటూ చౌకీదార్లను మర్చిపోతారని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఎద్దేవా చేశారు. ప్రధాని ‘మై భీ చౌకీదార్’ ప్రచారానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ‘చౌకీదార్ చోర్ హై’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోందని ఆయన చెప్పారు. ‘గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్, ఉరి, బారాముల్లా, పుల్వామాల్లో ఉగ్రదాడులు జరిగినప్పుడు చౌకీదార్ (మోదీ) ఏం చేస్తున్నారు. నిద్రపోతున్నారా? అప్పుడు ‘మై భీ చౌకీదార్’ నినాదం ఏమైంది?’ అని కపిల్ సిబల్ పీటీఐకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు. బాలాకోట్‌లో జరిపిన వైమానిక దాడులను మోదీ రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘బీజేపీ బహిరంగ ప్రకటనలు చేయడం ద్వారా వైమానిక దాడులను రాజకీయం చేయడంలో ముందే ఉంటుంది. ప్రధాని ప్రసంగాలు ఇచ్చే సమయంలో వెనుక అమర వీరుల ఫొటోలుంటాయి. పదే పదే తన ప్రసంగాల్లో వైమానిక దాడులను ప్రస్తావిస్తూ ప్రజల్లో కూడా అదే భావన ఉందంటున్నారు’ అని సిబల్ విమర్శించారు. వ్యవసాయ సంక్షోభం, విద్య, ఆరోగ్యం, ఆకలి వంటి సగటు మనిషి జీవితానికి సంబంధించిన విషయాల్లో బీజేపీ ప్రభుత్వానికి కనీస ఆందోళన లేదని ఆరోపించారు. అలాగే నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీ వంటి వారు దేశం విడిచి పారిపోయి నప్పుడు చౌకీదార్ ఉద్యమం ఏమైందని ఎద్దేవా చేశారు. ‘బాలాకోట్‌పై వైమానిక దాడులు చేయడం తప్పేమీ కాదు దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే దాన్ని రాజకీయం చేయడమే సరికాదు’ అని అన్నారు. -
చౌకీదార్ క్యాంపెయిన్ : ప్రొఫెషనల్స్‌కు ప్రధాని ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ : చౌకీదార్ క్యాంపెయిన్‌లో విరివిగా పాల్గొన్నాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రొఫెషనల్స్‌ను అభ్యర్ధించారు. ‘దేశాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడంలో మీరు కీలక పాత్ర పోషిస్తారని..మీ ప్రయత్నాలతో దేశం ఆరోగ్యకరంగా, సుసంపన్నంగా, విద్యాపరంగా సరికొత్త శిఖరాలకు చేరుకుంటుంద’ని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘ప్రియమైన వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, అధ్యాపకులు, ఐటీ ప్రొఫెషనల్స్, బ్యాంకర్లు సహా వివిధ వృత్తి నిపుణులు మైబీ చౌకీదార్ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఆహ్వానిస్తున్నా’మని ప్రధాని ఆదివారం పలు వృత్తి నిపుణులను కోరుతూ ట్విటర్లో రాసుకొచ్చారు. కాగా గతవారం ప్రధాని మోదీ తాను చేపట్టిన నేనూకాపలాదారు కార్యక్రమంలో పార్టీ నేతలను పాల్గొనాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే. ప్రధాని పిలుపుతో బీజేపీ చీఫ్ అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు ట్విటర్లో తమ పేర్ల ముందు చౌకీదార్ పదాన్ని జోడించారు. కాగా ప్రధాని చౌకీదార్ క్యాంపెయిన్‌ను విపక్షాలు విమర్శిస్తున్నాయి. -
మమతపై రాహుల్ ఫైర్
మాల్దా: ప్రధాని∙మోదీతోపాటు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రజలకిచ్చిన హామీల అమల్లో విఫలమయ్యారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. శనివారం మాల్దా(ఉత్తర) లోక్‌సభ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో రాహుల్ మాట్లాడారు. ‘మమతా బెనర్జీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు. గత కమ్యూనిస్టుల పాలనకు టీఎంసీ పాలనకు తేడా లేదు. అప్పటికీ ఇప్పటికీ రాష్ట్రంలో మార్పేమీ లేదు. ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. మమత పాలన అధ్వానం. ఆమెకు మినహా మరొకరు బహిరంగంగా మాట్లాడేందుకు అవకాశం లేదు. ప్రజలకిచ్చిన హామీల అమలులో మమత విఫలమయ్యారు’ అంటూ విమర్శించారు. అనంతరం ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘ధనవంతుల ఇళ్లకే కాపలాదార్లు(చౌకీదార్లు) ఉంటారు. రైతులు, నిరుపేదలకు వారి అవసరం ఉండదు. ఆర్థిక నేరగాళ్లయిన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్‌మాల్యా వంటి ఆర్థిక నేరగాళ్లకు ఈయన చౌకీదార్’ అంటూ ప్రధాని మోదీని ఎద్దేవా చేశారు. ఆయన ఎప్పుడూ అబద్ధాలే చెబుతుంటారు. ఎక్కడికి వెళ్లినా అబద్ధాలే. దేశాన్ని ఐక్యంగా ఉంచాలనుకునే కాంగ్రెస్‌కు, కుల, మత, భాషా భేదాలతో దేశాన్ని విభజించాలనుకునే బీజేపీ–ఆర్ఎస్ఎస్కు మధ్యే ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ’ అని పేర్కొన్నారు. ‘దేశానికి కాపలాదారుగా ఉంటానంటూ 2014 ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన మోదీ.. ప్రజలకు అడ్డంగా దొరికిపోయేసరికి జాతీయవాదం గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ చౌకీదారేనంటూ మాట మారుస్తున్నారు’ అని ఆరోపించారు. -
‘చౌకీదార్’ను సమర్థించండి
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని పురోభివృద్ధి దిశగా తీసుకెళ్తూ, ప్రపంచ దేశాల్లో భారత్‌ను ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేస్తున్న నరేంద్రమోదీ చౌకీదార్ (కాపలాదారు)ను మళ్లీ ప్రధాని చేసేందుకు అం దరూ మద్దతునివ్వాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కోరారు. 2014లో దేశ ఆర్థిక వ్యవస్థ పతన స్థాయికి చేరుకున్న దశలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఐదేళ్లలోనే అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందన్నారు. ఇదంతా కూడా సమర్థత, నిర్ణయాత్మక, శక్తివంతమైన నరేంద్రమోదీ నాయకత్వం వల్లనే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన కం పెనీ సెక్రటరీలు, చార్టెర్డ్ అకౌంటెంట్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఇతర రంగాలవారు, సీఏ, కంపెనీ సెక్ర టరీ, ఇతర వృత్తివిద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థులను ఉద్దేశించి గోయల్ మాట్లాడుతూ తెలంగాణ నుంచి బీజేపీ చౌకీదార్లను (ఎంపీలను) గెలిపించి మోదీని బలోపేతం చేయాలన్నారు. ఇక్కడి అవినీతి ప్రభుత్వానికి హెచ్చరికగా బీజేపీ ఎంపీలను పంపిస్తే పేదలు, రైతులు, ఇతర వర్గాలకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. శనివారం ఒక ప్రైవేట్ హోటళ్లో నిర్వహించిన ‘మై భీ చౌకీదార్’(నేను కూడా కాపలాదారున్ని) కార్యక్రమంలో బీజేపీ నాయకులు డా.కె.లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, ఎన్.రామచంద్రరావు, జి.కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఐటీ మదింపు మరింత సరళతరం ఆదాయపు పన్ను మదింపును మరింత పారదర్శ కంగా నిర్వహించడంతోపాటు సరళతరం చేసే చర్య లను ప్రభుత్వం చేపడుతోందని గోయల్ చెప్పారు. మొత్తం దాఖలు చేసిన లక్ష రిటర్న్స్‌లో కేవలం 0.3, 0.4 శాతం మాత్రమే స్క్రూటిని చేసి మిగతా వాటిని యథాతధంగా ఆమోదించనున్నట్టు వెల్లడించారు. సీఎం పీయూష్ గోయల్ అని కె.లక్ష్మణ్ తన ప్రసంగంలో ప్రస్తావించగా, ‘నన్ను సీఎంగా మార్చేశారు. ఈ రాత్రి సీఎం కేసీఆర్‌కు నిద్ర పట్టదు’ అంటూ గోయల్ అనడంతో హాలులో నవ్వులు విరిశాయి. పక్కదారి పట్టించేందుకే యాగాల చర్చ... మోదీ చేసిన అభివృద్ధి చర్చకు రాకుండా పక్కదారి పట్టించేందుకే దేశంలో తనకంటే ఎక్కువ యాగాలు చేసిన వారెవరూ లేరంటూ సీఎం కేసీఆర్ చెబుతున్నారని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. మోదీ కంటే కేసీఆర్ ఎక్కువ హిందువో కాదో తెలియదుకానీ, అసదుద్దీన్ ఒవైసీ కంటే ఎక్కువ ముస్లింగా కేసీఆర్ మారారని ఎద్దేవా చేశారు. మోదీ హయాంలోనే అయోధ్యలో రామమందిరం నిర్మితమవుతుందని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన ఫెడరల్ ఫ్రంట్ పడిపోయే టెంటేనని వ్యాఖ్యానించారు. మోదీ గత ఐదేళ్లలో ఒక్కరోజుకూడా సెలవు తీసుకోలేదని, ఆయనకు ఫామ్ హౌస్ లేదు, రెస్ట్ హౌస్ లేదని బీజేపీ నేత జి.కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు తీరడానికి కేంద్రం చేపట్టిన చర్యలే కారణమని బీజేపీ హైదరాబాద్ నగర పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న మేకిన్ ఇండియా అందించిన తోడ్పాటు కారణంగానే తెలంగాణలో అమెజాన్, గూగుల్ సంస్థలతోపాటు కొత్తగా పెట్టుబడులు వచ్చాయని, వాటిని తమ గొప్పదనంగా కేటీఆర్ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్డీయేకు మూడింట రెండు వంతుల మెజార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడు వందలకు పైగా సీట్లను కైవసం చేసుకుంటుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి 60 స్థానాలకు మించి రావని అన్నారు. ఐదేళ్ల మోదీ పాలనలో దేశం సురక్షితంగా ఉందన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఫిక్కీ)కి చెందిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ‘విజన్ ఇండియా’పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పీయూష్ గోయల్ ఎన్డీయే ప్రభుత్వం సాధించిన విజయాలను మీడియాతో పంచుకున్నారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాలను చాలామంది అసాధ్యంగా పరిగణించారని, వాటిని సాధ్యం చేసి చూపించామని చెప్పారు. దేశంలోని 77 కోట్ల సంప్రదాయ బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేయాలని 2015 జనవరిలో సంకల్పించామని.. ఈ బల్బుల వాడకం వల్ల దేశవ్యాప్తంగా ఏటా రూ.50 వేల కోట్లు ఆదా అవుతోందన్నారు. మహిళల శ్యానిటరీ ప్యాడ్స్ విషయంలోనూ ఇదే తరహా విప్లవాన్ని తీసుకు రావాలని, ఒక్క రూపాయికే ప్యాడ్స్ అందించడం కష్టమేమీ కాదని పీయూష్ అన్నారు. ఎన్నికల్లో తగినంత మెజార్టీ రాకపోతే తెలంగాణలో కె.చంద్రశేఖరరావు లేదా ఏపీలో వై.ఎస్.జగన్మోహనరెడ్డిలతో జట్టు కట్టే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు పీయూష్ సమాధానమిస్తూ పగటి కలలు కనేందుకు జీఎస్టీ కట్టనవసరం లేదని చమత్కరించారు.