ఆయన అనిల్‌ అంబానీ, నీరవ్‌ మోదీలకు కాపలాదారు.. | Rahul Says PM Narendra Modi Not Your Chowkidar But Of Anil Ambanis And Nirav Modis | Sakshi
Sakshi News home page

ఆయన అనిల్‌ అంబానీ, నీరవ్‌ మోదీలకు కాపలాదారు..

Published Tue, Mar 26 2019 3:24 PM | Last Updated on Tue, Mar 26 2019 3:24 PM

Rahul Says PM Narendra Modi Not Your Chowkidar But Of Anil Ambanis And Nirav Modis   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ దూకుడు పెంచారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కాపలాదారు కాదని, ఆయన పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ, విదేశాలకు పారిపోయిన ఆభరణాల వ్యాపారి నీరవ్‌ మోదీలకు కాపలాదారని రాహుల్‌ ఎద్దేవా చేశారు. రాజస్ధాన్‌లోని శ్రీగంగా నగర్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి రాహల్‌ మాట్లాడుతూ రైతులు, నిరుగ్యోగ యువత ఇంటికి కాపలాదారును ఎవరైనా చూశారా అని ప్రశ్నించారు.

ప్రధాని మోదీ తాను కాపలాదారునని చెప్పుకొంటారు..కానీ ఆయన ఎవరికి కాపలాదారో (చౌకీదార్‌) మాత్రం చెప్పరని అన్నారు. మోదీ మీకు కాపలాదారు కాదని,ఆయన అనిల్‌ అంబానీ, నీరవ్‌ మోదీ వంటి వారికి కాపలాదారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. కాగా రాహుల్‌ ఇటీవల బిహార్‌లో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ మీరెప్పుడైనా దేశంలో సామాన్యుడి ఇంటి ఎదుట కాపలాదారును చూశారా అని ప్రశ్నించారు. ప్రధాని సంపన్న పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తారని ఆక్షేపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement