తల్లే కాళ్లు కడిగింది | have increased my daughter very much | Sakshi
Sakshi News home page

తల్లే కాళ్లు కడిగింది

Published Wed, Feb 7 2018 12:11 AM | Last Updated on Wed, Feb 7 2018 12:11 AM

 have increased my daughter very much - Sakshi

కన్యాదానం

కూతుర్ని ఒడిలో కూర్చోబెట్టుకొని రాజీ కన్యాదానం చేస్తున్న ఈ ఫొటోను చూసిన వారెవరైనా... ఆమె సంప్రదాయ విరుద్ధంగా వెళ్లిందనుకోరు. ఆమె చిరునవ్వులో.. స్వచ్ఛమైన, నిష్కల్మషమైన కుటుంబ ఆనందాన్ని మాత్రమే చూస్తారు. అనురాగం నిండిన తల్లి హృదయాన్ని మాత్రమే చూస్తారు. 

అమ్మాయి పెళ్లిలో తల్లి తన చేతుల మీదుగా నీరు పోస్తుంటే, తండ్రి ఆ నీళ్లతో వరుడి కాళ్లు కడిగి తన కుమార్తెను వరుడికి కన్యాదానం చేస్తాడు. ఒకవేళ తండ్రి లేకపోతే దగ్గరి బంధువులు కన్యాదానం చేస్తారు. అయితే వేరెవరో కన్యాదానం చేయడానికి ఈ తల్లి మనసు అంగీకరించలేదు. తన కుమార్తెకు తానే కన్యాదానం చేయాలనుకుంది. అనుకోవడమే కాదు చేసింది కూడా! హిందూ వివాహాలలో తండ్రి కన్యాదానం చేస్తూ, ‘ఇంతవరకు నేను నా కుమార్తెను ఎంతో గారాబంగా పెంచుకున్నాను. ఈ రోజు నుంచి నీ చేతిలో పెడుతున్నాను. నేటి నుంచి నా కుమార్తె బాధ్యతంతా నీదే. జాగ్రత్తగా చూసుకో’ అని వరుడికి చెబుతాడు. అదే విధంగా ఈ తల్లి కన్యాదానం చేస్తూ తన కూతుర్ని కళ్లల్లో పెట్టి చూసుకొమ్మని వరుడిని కోరింది.  రాజీ  సింగిల్‌ మదర్‌. ఆమెది పెద్దలు కుదిర్చిన వివాహం. వరుడిది ఆస్ట్రేలియా. రాజీ ఉండేది చెన్నై. పెళ్లయ్యాక భర్తతో పాటు ఆస్ట్రేలియా వెళ్లిపోయింది. పిల్లలు పుట్టారు. సంధ్య, మహేశ్‌. 17 ఏళ్లు సాఫీగానే సాగాయి. క్రమేపీ భార్యాభర్తల మధ్య స్పర్థలు బయలుదేరాయి.

అవి భరించలేని స్థాయికి చేరాయి. రాజీ విడాకులు తీసుకుంది. అంతకాలం భర్త మీదే ఆధారపడి జీవించడంతో, తన జీవితాన్ని మళ్లీ నిర్మించుకోవలసి వచ్చింది. ఆమెకు చిన్నప్పటి నుంచి వంట చేయడమంటే ఇష్టం. అదిప్పుడు ఎంతో ఉపయోగపడింది. శని, ఆదివారాల్లో కిచెన్‌ క్లాసెస్‌తో ఆదాయ మార్గం వెతుక్కుంది. విడాకులు తీసుకున్నందు వల్ల కుమార్తె వివాహంలో ఏవైనా ఇబ్బందులు వస్తాయేమో అనుకుంది. అలాంటివేమీ జరగలేదు. అయితే ఒక అడ్డంకి వచ్చింది. కన్యాదానం చెయ్యడానికి తండ్రి లేడు. ఎలా అని ఆమె నా మనసులో దిగులు బయలుదేరింది. ‘‘చాలా ఆలోచించాను. తల్లిని నేనున్నానుగా అనుకుని చివరికి నేనే కన్యాదానం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను’’ అన్నారు రాజీ. ఆ విషయం వరుడి తల్లిదండ్రులకు చెప్తే  వారు కూడా సంతోషంగా అంగీకరించారు. అయితే సంప్రదాయ విరుద్ధంగా చేస్తున్నందుకు రాజీ బంధువులు ఆమెను వ్యతిరేకించారు. ఆచారాన్ని మంటగలుపుతోందని నిందించారు. అయినా పట్టించుకోలేదు. ఆమె చేత కన్యాదానం చేయించడానికి రాఘవన్‌ అనే పండితుడు ముందుకు వచ్చారు. పెళ్లి నిరాటంకంగా జరిగిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement