compromised
-
తల్లే కాళ్లు కడిగింది
కూతుర్ని ఒడిలో కూర్చోబెట్టుకొని రాజీ కన్యాదానం చేస్తున్న ఈ ఫొటోను చూసిన వారెవరైనా... ఆమె సంప్రదాయ విరుద్ధంగా వెళ్లిందనుకోరు. ఆమె చిరునవ్వులో.. స్వచ్ఛమైన, నిష్కల్మషమైన కుటుంబ ఆనందాన్ని మాత్రమే చూస్తారు. అనురాగం నిండిన తల్లి హృదయాన్ని మాత్రమే చూస్తారు. అమ్మాయి పెళ్లిలో తల్లి తన చేతుల మీదుగా నీరు పోస్తుంటే, తండ్రి ఆ నీళ్లతో వరుడి కాళ్లు కడిగి తన కుమార్తెను వరుడికి కన్యాదానం చేస్తాడు. ఒకవేళ తండ్రి లేకపోతే దగ్గరి బంధువులు కన్యాదానం చేస్తారు. అయితే వేరెవరో కన్యాదానం చేయడానికి ఈ తల్లి మనసు అంగీకరించలేదు. తన కుమార్తెకు తానే కన్యాదానం చేయాలనుకుంది. అనుకోవడమే కాదు చేసింది కూడా! హిందూ వివాహాలలో తండ్రి కన్యాదానం చేస్తూ, ‘ఇంతవరకు నేను నా కుమార్తెను ఎంతో గారాబంగా పెంచుకున్నాను. ఈ రోజు నుంచి నీ చేతిలో పెడుతున్నాను. నేటి నుంచి నా కుమార్తె బాధ్యతంతా నీదే. జాగ్రత్తగా చూసుకో’ అని వరుడికి చెబుతాడు. అదే విధంగా ఈ తల్లి కన్యాదానం చేస్తూ తన కూతుర్ని కళ్లల్లో పెట్టి చూసుకొమ్మని వరుడిని కోరింది. రాజీ సింగిల్ మదర్. ఆమెది పెద్దలు కుదిర్చిన వివాహం. వరుడిది ఆస్ట్రేలియా. రాజీ ఉండేది చెన్నై. పెళ్లయ్యాక భర్తతో పాటు ఆస్ట్రేలియా వెళ్లిపోయింది. పిల్లలు పుట్టారు. సంధ్య, మహేశ్. 17 ఏళ్లు సాఫీగానే సాగాయి. క్రమేపీ భార్యాభర్తల మధ్య స్పర్థలు బయలుదేరాయి. అవి భరించలేని స్థాయికి చేరాయి. రాజీ విడాకులు తీసుకుంది. అంతకాలం భర్త మీదే ఆధారపడి జీవించడంతో, తన జీవితాన్ని మళ్లీ నిర్మించుకోవలసి వచ్చింది. ఆమెకు చిన్నప్పటి నుంచి వంట చేయడమంటే ఇష్టం. అదిప్పుడు ఎంతో ఉపయోగపడింది. శని, ఆదివారాల్లో కిచెన్ క్లాసెస్‌తో ఆదాయ మార్గం వెతుక్కుంది. విడాకులు తీసుకున్నందు వల్ల కుమార్తె వివాహంలో ఏవైనా ఇబ్బందులు వస్తాయేమో అనుకుంది. అలాంటివేమీ జరగలేదు. అయితే ఒక అడ్డంకి వచ్చింది. కన్యాదానం చెయ్యడానికి తండ్రి లేడు. ఎలా అని ఆమె నా మనసులో దిగులు బయలుదేరింది. ‘‘చాలా ఆలోచించాను. తల్లిని నేనున్నానుగా అనుకుని చివరికి నేనే కన్యాదానం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను’’ అన్నారు రాజీ. ఆ విషయం వరుడి తల్లిదండ్రులకు చెప్తే వారు కూడా సంతోషంగా అంగీకరించారు. అయితే సంప్రదాయ విరుద్ధంగా చేస్తున్నందుకు రాజీ బంధువులు ఆమెను వ్యతిరేకించారు. ఆచారాన్ని మంటగలుపుతోందని నిందించారు. అయినా పట్టించుకోలేదు. ఆమె చేత కన్యాదానం చేయించడానికి రాఘవన్ అనే పండితుడు ముందుకు వచ్చారు. పెళ్లి నిరాటంకంగా జరిగిపోయింది. -
చరిత్రలో అతిపెద్ద సైబర్ దాడి!
-
చరిత్రలో అతిపెద్ద సైబర్ దాడి!
న్యూయార్క్: ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజం యాహూ ఖాతాలో మరోసారి పెద్ద ఎత్తున హ్యాక్ అయ్యాయి. గతంలోనే ఒకసారి తమ ఖాతాలు భారీగా హ్యాకింగ్ కు గురయ్యాయని ధృవీకరించిన యాహూ మరోసారి షాకింగ్ న్యూస్ వెల్లడించింది. తమ ఖాతాలపై మరో మేజర్ సైబర్ ఎటాక్ జరిగిందని యాహూ వెబ్ సైట్ లో ప్రకటించింది. దాదాపు 100కోట్ల (1బిలియన్)కు పైగా ఖాతాలు హ్యాక్ అయినట్టు ప్రకటించడం ఆందోళన రేపింది. తమ వినియోగదారుల ఖాతాల నుంచి వ్యక్తిగత సమాచారం అపహరణకు గురైనట్టు తెలిపింది. 2013 ఆగస్టులో జరిగిన ఈ దాడి చరిత్రలోనే అతిపెద్ద సైబర్ దాడిగా పేర్కొంది. ఈ నేపథ్యంలో తమ యూజర్లకు పలు సూచనలు చేస్తూ తమ పాస్వర్డ్లు, సెక్యూరిటీ ప్రశ్నల సమాధానాలు మార్చుకోవాలని యూహూ పేర్కొంది. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో పడిన యాహూ మరిన్ని కష్టాల్లో చిక్కుకుపో్యింది. 2014లోనూ యాహూ తమ నెట్వర్క్ నుంచి 50 కోట్ల యూజర్ల అకౌంట్ల వివరాలు హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలిపింది. 50 కోట్ల యూజర్ల సమాచారం హ్యాకింగ్ గురవడమే ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద సైబర్ నేరంగా ఉంది. అయితే, తాజాగా 100 కోట్ల మంది యూజర్ల అకౌంట్లు హ్యాకింగ్ గురయ్యాయని తెలపడం కలకలం రేపుతోంది. గతంలో తమ యూజర్ల వివరాలను తస్కరించిన హ్యాకర్లు అప్పటి లాగే ఇప్పుడు కూడా యూజర్ల పేర్లు, ఈమెయిల్ ఐడీలు, టెలిఫోన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లతో పాటు, ఎన్క్రిప్టెడ్, అన్ ఎన్క్రిప్టెడ్ సెక్యూరిటీ ప్రశ్నలు, సమాధానాలు అపహరించినట్లు తెలిపింది. అయితే తమ యూజర్లకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ సమాచారం, పేమెంట్ డేటా మాత్రం అపహరణకు గురికాలేదని యాహూ స్పష్టం చేసింది. కాగా ఇంటర్నెట్ వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టిన సంస్థ అష్టకష్టాలు పడింది. చివరికి అమెరికా టెలికాం కంపెనీ వెరిజాన్ 4.8బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. అయితే యాహూ న్యూస్ సర్వీస్ తోపాటు, బ్లాగింగ్ ప్లాట్ ఫాం టంబ్లర్, ఫోటో షేరింగ్ సైట్ ఫ్లికర్, యాహూ ఫినాన్స్ ద్వారా టెక్ సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.