పెళ్లికి చెలి కళ | New fashion show to weeding wear | Sakshi
Sakshi News home page

పెళ్లికి చెలి కళ

Published Fri, Jun 22 2018 12:04 AM | Last Updated on Fri, Jun 22 2018 12:04 AM

New fashion show  to weeding wear - Sakshi

అమ్మాయి పెళ్లికి చెలులే కళ.. అలంకారాలకు పువ్వులు, ముగ్గులు, తోరణాలే కాదు స్నేహితులు కూడా! స్నేహాన్ని మించిన.. ఆభరణం ఉండదు కదా! పెళ్లి కూతురుకి వీళ్లే శుభశకునాలు.. పెళ్లికళలు...

పెళ్లి కూతురేకాదు ఆమెను అంటిపెట్టుకుని ఉండే నిచ్చెలుల అలంకారణం కూడా ఇప్పుడు ప్రధానమైంది. ప్రత్యేకమైంది. ట్రెండ్‌ అయ్యింది. కళకళలాడుతూ చెలుల అంతా ఒకే అలంకారంలో తిరుగుతుంటే పెళ్లి కళ వెయ్యింతలై వెలుగుతోంది. రాజకుమారిలా నవవధువు.. ఆమె చుట్టూ తూనీగల్లా చెలులు తిరగాడుతుంటే ఫ్లాష్‌ కెమరాలు షార్ప్‌గా మెరుస్తుంటాయి. బ్రైడ్స్‌ మెయిడ్‌ అనే ఈ ఫ్యాషనబుల్‌ డ్రెస్‌కి తప్పనిసరిగా పాటించాల్సిన రూల్స్‌.. ఎంగేజ్‌మెంట్, సంగీత్, రెసెప్షన్‌ వేడు స్నేహితులు/అక్కచెల్లెళ్లను మీ ప్లాన్‌లో భాగస్తులను చేయండి. ఎంత మంది అవుతారో ఒక జాబితా తయారుచేసుకొని డిజైనర్స్‌ని సంప్రదించాలి. రంగులు, డిజైన్స్‌ ఏవి బాగుంటాయో పెళ్లి కూతురు డ్రెస్‌ ఎంపికను బట్టి ఎంపిక చేసుకోవాలి. గ్రూప్‌ అందరూ ఒకలా ఉండి అందులో ఒకరు రాంగ్‌ డ్రెస్‌ డిజైన్, రంగులు వేరేగా ఉంటే ప్లాన్‌ ప్లాప్‌ అవుతుంది. అందుకని వధువు అందరి డ్రెస్‌ డిజైన్స్‌ వేడుకకు కనీసం వారం రోజుల ముందుగానే ఫైనల్‌ చేయాలి. పెళ్లికి ముందు డ్రెస్సులు వేసుకొని సరిచూసుకోవడం పెళ్లికి ముందు చాలా వరకు చేయరు. కానీ, ముందుగా అందరూ ఒకసారి ధరించి సరిచూసుకోవడం వల్ల వేడుక అనుకున్న విధంగా పూర్తి అవుతుంది. వేడుకలో ధరించే దుస్తులు ఒకసారి ధరించి చూసుకోవడం వల్ల ఆల్ట్రేషన్‌ సమస్యలు ఉండవు. అందరూ ఎలాంటి ఆభరణాలు ధరించాలో చూసుకోవాలి.

ఉదాహరణకు : కుందన్స్‌ లేదా పోల్కీ, వరుసల హారాలు, చెవి బుట్టలు, గాజులు, వడ్డాణాలు.. ఇవన్నీ అందరూ ఒకే తరహావి ఎంచుకోవాలి. ∙అత్యంత ఖరీదైన ఆభరణాలను ధరించకపోవడమే మేలు. సంగీత్‌ వంటివి ఆటపాటలతో వేడుక జరిగే సమయం. మరీ ఖరీదైన లెహంగా వంటివి కూడా గ్రూప్‌కి పెట్టకూడదు. బ్రైట్‌ కలర్స్‌లో ఉండే ఒకే రంగు చీరలు లేదా సల్వార్‌ కుర్తా వంటివి కూడా బాగుంటాయి. డ్యాన్స్‌ చేయడానికి అనువైన డ్రెస్‌ అయితే సౌకర్యానికీ లోటుండదు. ఇండోవెస్ట్రన్‌ లుక్‌ వచ్చేలా గౌన్లు, క్రాప్‌టాప్, లంగాఓణీ డ్రెస్‌ .. కూడా ఈ వేడుకకు నిండుదనాన్ని తీసుకువస్తాయి. హెవీగా మేకప్‌ కాకుండా మీదైన సొంత మేకప్‌నే ఎంచుకోవడం ఉత్తమం. పెళ్లి కూతురువరకు మేకప్‌ ఆర్టిస్ట్‌కి ఛాన్స్‌ ఇవ్వచ్చు. ఎవరికి వారు మేకప్‌కి సొంత మేకప్‌బాక్స్‌ని ఉపయోగించడం వల్ల ఇరిటేట్‌ వంటి సమస్యలు తలెత్తవు. వెంట మేకప్‌ బాక్స్‌లో .. చెమట అద్దడానికి బ్లాటింగ్‌ షీట్స్, కన్సీలర్, హెయిర్‌ స్ప్రే, చిన్న అద్దం, లిప్‌స్టిక్, మస్కారా, టచ్‌అప్స్‌ వంటివి ఉంచుకోవాలి. పెళ్లి కూతురు దగ్గర ఉండే సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి చెలుల తయారీ ముఖ్యం. అందుకని డ్రెస్సులు, ఆభరణాలు కనీసం రెండు సెట్స్‌ అయినా ఉండేలా చూసుకోవాలి. ఏ సంప్రదాయ వేడుకకైనా హాజరయ్యే సమస్యంలో డ్యాన్స్‌ చేయడానికి అనువుగా ఉండేలా మరొక డ్రెస్‌ కూడా వెంట తీసుకెళ్లడం ముఖ్యం. సేఫ్టీ పిన్స్, డ్రేప్స్, ఐ లాష్, గ్లూ, సూది–దారం వంటివి తప్పనిసరిగా ఉండాలి. – నిర్వహణ: ఎన్‌.ఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement