మహబూబాబాద్
గురువారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2024
7
నెహ్రూసెంటర్: ఆర్టీసీలో ప్రమాదాలను నివారించేలా సంస్థ వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈమేరకు ఈ నెల 24నుంచి 30వ తేదీ ప్రమాద రహిత వారోత్సవాలను నిర్వహించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈమేరకు రోడ్డు భద్రత నియమాలు, జాగ్రత్తలపై డ్రైవర్లకు అవగాహన కల్పించనున్నారు. అలాగే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాదాలను నిలువరించేలా చర్యలు తీసుకోనున్నారు.
ప్రత్యేక కార్యక్రమాలు..
ప్రమాద రహిత వారోత్సవాలను ఏడు రోజులు నిర్వహించనున్నారు. ప్రతీరోజు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతారు. మొదటి రోజు వారోత్సవాలను ప్రారంభించడం, రెండోరోజు డ్రైవర్లకు శిక్షణ, మూడో రోజు డ్రైవర్లకు మెడికల్ క్యాంపు ద్వారా చెకప్‌లు చేయించడం, నాలుగోరోజు ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్లు, ఓనర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి వారికి వివరించడం, ఐదోరోజు బస్సు ప్రత్యేక సేఫ్టీ కోసం అదనపు మెకానిక్‌లతో స్పెషల్ మెయింటెనెన్స్ చేయించడం, ఆరోరోజు తరచూ ప్రమాదాలు చేసే డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులతో కోఆర్డినేషన్ మీటింగ్, కౌన్సెలింగ్, ఏడోరోజు ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్లను సన్మానిస్తారు.
డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
డ్రైవర్లు ౖడ్రైవింగ్ సమయంలో మెళకువలు పాటించాలి. వైపరు పనిచేసేలా చూసుకోవడం, బ్రేకులు, లైట్లు, టైర్లలో గాలి, సైడు అద్దాలను సరి చూసుకోవాలి. వేగ నియంత్రణ పాటించడంతో పాటు ముందు వెళ్లే వాహనాలకు సురక్షిత దూరాన్ని పా టించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు.
జాగ్రత్తలు పాటించాలి..
ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డుపై తగు జాగ్రత్తలు పాటించాలని డీఎస్పీ తిరుపతిరావు సూచించారు. ప్రమాద రహిత వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రాంగణంలో వారోత్సవాలను బుధవారం ప్రారంభించారు. డీఎస్పీ మాట్లాడు తూ.. డైవర్లు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బస్సులను నడపాలని సూచించారు. ఆర్టీసీ అంటే ప్రజల సంస్థ అని డ్రైవర్లు సమయపాలన పాటించాలని, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. వర్షాకాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలు జరుగకుండా చూసుకోవా లన్నారు. ప్రమాద రహిత వారోత్సవాలను విజయవంతం చేయాలని మానుకోట డీఎం ఎం.శివప్రసాద్ తెలిపారు. అనంతరం ప్రమాదరహిత వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఈఎస్ చారి, మల్లికార్జున్, రాఘవేంద్ర, పాపిరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదాల నివారణకు చర్యలు
ప్రమాదాలను నివారించేలా డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రమాద రహిత వారోత్సవాలను నిర్వహిస్తూ డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నాం. డ్రైవర్లు అప్రమత్తంగా ఉండేలా శిక్షణతో పాటు ఆరోగ్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ప్రమాద రహిత ఆర్టీసీగా చర్యలు చేపడుతాం.
– ఎం.శివప్రసాద్, ఆర్టీసీ డీఎం
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment