
ఫర్నిచర్ షాపుల్లో
భారీ అగ్ని ప్రమాదం
వరంగల్: వరంగల్ ములుగురోడ్ సమీపాన భద్రకాళీ ఆలయం వైపు వెళ్లే రహదారిలోని నాలుగు ఫర్నిచర్ షాపుల్లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు వరంగల్ ఫైర్ ఆఫీసర్(ఎస్‌ఎఫ్‌ఓ) రాజేశ్వర్ తెలిపారు. మంజునాథ ఉడ్ వర్క్స్, సాహస్ర ఉడ్ వర్క్స్ ఫర్నిచర్స్, ఉపేంద్ర కార్పెంటర్ వర్క్స్, ముఖేష్ ఉడ్ ఫర్నిచర్స్, నవీన్ ఉడ్ వర్క్స్‌లకు చెందిన షాపుల్లో షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపినట్లు ఎస్‌ఎఫ్‌ఓ పేర్కొన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగడంతో బాధితుల ఫిర్యాదు మేరకు వెళ్లి ఆర్పినట్లు తెలిపారు. కర్రతో చేసిన సామగ్రి కావడంతో అప్పటికే మొత్తం అగ్నికి ఆహుతైనట్లు బాఽధితులు తెలిపారు. ఈప్రమాదంలో సుమారు రూ.50లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు నాగరాజు, నవీన్ తదితరులు కన్నీరుమున్నీరయ్యాయి. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఓ తెలిపారు.
ఘనంగా జడకొప్పులాట
నర్మెట: ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలోని పోశమ్మగుడి మర్రిచెట్టు వద్ద జడకొప్పుల ఆట ఘనంగా నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఆటలో కర్రకు చేసిన 22 రంధ్రాల ద్వారా చెట్టుకు వేలాడదీసిన తాళ్లను యువత కోలాటాల నడుమ జడకొప్పుగా అల్లడం, అదేవిధంగా తిరిగి విడదీయడం విశేషం. గోల్కొండ చంద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలో డీసీసీ ఉపాధ్యక్షుడు గంగం నర్సింహారెడ్డి, దేవులపల్లి భాగ్యలక్ష్మి, పులి కనకయ్య, గడ్డం మల్లేశ్, గొల్కొండ రవి, కొలెపాక స్వామి, తదితరులు పాల్గొన్నారు.
యువకుడి ఆత్మహత్య
● జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన
వాజేడు: ఫ్లై ఓవర్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకునన్నాడు. ఈఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్లలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. మండల పరిధి లోని సుందరయ్య కాలనీ గ్రామానికి చెందిన అల్లి రాంబాబు, వరలక్ష్మి దంపతుల మూడో కుమారుడు సాయి ప్రసాద్ (20) భద్రాచలంలోని మదర్ థెరిస్సా డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. 20 రోజుల క్రితం చదువుపై ఆసక్తి లేదని హైదరాబాద్ వెళ్లి ఏదైనా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పా డు. చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని తల్లిదండ్రులు చెప్పినా పట్టించుకోకుండా హైదరా బాద్ వెళ్లాడు. రాంబాబు.. కొడుకు సాయిప్రసాద్ ఆచూకీ తెలుసుకుని జీడిమెట్ల వెళ్లి మాట్లాడాడు. ఇంటికి రావాలని బతిమిలాడాడు. అయితే ఇంటికి వస్తానని చెప్పిన సాయిప్రసాద్.. ఆ వెంటనే ఫ్లై ఓ వర్ పైనుంచి దూకాడు. ఆస్పత్రిలో చేర్పించగా చికి త్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రాంబాబు ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫర్నిచర్ షాపుల్లో

ఫర్నిచర్ షాపుల్లో