పర్యాటకంతోనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

పర్యాటకంతోనే అభివృద్ధి

Apr 2 2025 1:36 AM | Updated on Apr 2 2025 1:36 AM

పర్యా

పర్యాటకంతోనే అభివృద్ధి

కురవి: మండల కేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి, కందికొండ గ్రామంలోని కందగిరి పర్వతంపై ఉన్న లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత ప్రజలు, భక్తులు కోరుతున్నారు. ఈమేరకు కురవి పెద్దచెరువును రిజర్వాయర్‌ చేయాలంటున్నారు.

వీరభద్రస్వామి ఆలయం..

తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన వీరభద్రస్వామి ఆ లయం మరింత అభివృద్ధి చెందాల్సి ఉంది. మహా శివరాత్రి నుంచి 16 రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పెద్ద చెరువులో తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. కాగా చెరువును రిజర్వాయర్‌ చేస్తే అందులో బోటింగ్‌తో పాటు తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం కురవిలో హరిత హోట ల్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

హామీ ఇచ్చి..

కురవి పెద్ద చెరువును రిజర్వాయర్‌గా మారిస్తే వీరభద్రస్వామి ఆలయం అభివృద్ధి జరుగుతుంది. 2017లో అప్పటి మంత్రి హరీశ్‌రావు కురవిలో జరిగిన కాటమయ్య ఉత్సవంలో పాల్గొన్న సందర్భంగా చెరువును పరిశీలించి రిజర్వాయర్‌ చేస్తానని హామీ ఇచ్చి మర్చిపోయారు. కాగా చెరువును రిజర్వాయర్‌ చేస్తే బహుళ ప్రయోజనం కలుగుతుంది. తిర్మలాపురం, నల్లెల్ల, బలపాల, చిలుకోడు, వెన్నారం వరకు చెరువు నీటిని సాగుకు ఉపయోగించుకోవచ్చు. అలాగే భూగర్భజలాలు పెరిగి బావుల కింద సాగు చేయవచ్చు. చెరువులో బోటింగ్‌ ఏర్పాటు చేస్తే ఆలయానికి వచ్చే భక్తులు ఆనందంగా గడుపుతారు. ఆదాయం సమకూరుతుంది.

కందగిరిపై రోప్‌వేతో లాభాలు..

కందికొండ గుట్టపైన కొలువైన లక్ష్మీనర్సింహస్వామి జాతర ఏటా కార్తీక పౌర్ణమిరోజు జరుగుతుంది. గుట్టపై ఉన్న లక్ష్మీనర్సింహస్వామి, గుట్ట కింద వేంకటేశ్వరస్వామి ఆలయాలు అభివృద్ధి జరగాలంటే గుట్టపైకి రోప్‌వేను నిర్మించాల్సిన అవసరం ఉంది. గుట్టపైకి వెళ్లడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు రెండు కిలోమీటర్ల దూరం పైకి వెళ్లాల్సి ఉంటుంది. రోప్‌వే ఏర్పాటు చేస్తే భక్తుల సౌకర్యంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి జరుగుతుంది. కాగా రెండు ఆలయాలను మంత్రులు పట్టించుకుని పర్యాటకాభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది. ప్రభుత్వ విప్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే జాటోత్‌ రాంచంద్రునాయక్‌ అసెంబ్లీలో కందికొండ గుట్ట, వీరభద్రస్వామి ఆలయం, పెద్ద చెరువు అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరారు.

కురవి ఆలయం, కందికొండ గుట్ట

అభివృద్ధికి నిధులు అవసరం

పర్యాటకంగా డెవలప్‌ చేస్తేనే

మెరుగైన వసతులు

భక్తులు, పర్యాటకుల రాకతో

పెరగనున్న ఆదాయం

రోప్‌ వే నిర్మించాలి..

కందగిరి పర్వతంపైకి వెళ్లేందుకు ప్రభుత్వం రోప్‌వే నిర్మించాలి. రోప్‌వే నిర్మాణంతో భక్తులందరూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. గుట్టపైకి వెళ్లేందుకు 45 ఏళ్లు దాటినవారు ఇబ్బంది పడుతున్నారు. రోప్‌వే నిర్మిస్తే ఆలయం అభివృద్ధి చెందుతుంది.

–బి.హేమలత, కందికొండ

మినీ రిజర్వాయర్‌ చేయాలి

కురవి పెద్ద చెరువును మినీ రిజర్వాయర్‌ చేస్తే పర్యాటకంగా అభివృద్ధి జరుగుతుంది. రిజర్వాయర్‌తో అనేక లాభాలున్నాయి. రైతుల పంటల సాగుకు, తాగునీటికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వం రిజర్వాయర్‌ చేసి బోటింగ్‌ ఏర్పాటు చేయాలి.

–కరణం రాజన్న, కురవి

పర్యాటకంతోనే అభివృద్ధి 1
1/3

పర్యాటకంతోనే అభివృద్ధి

పర్యాటకంతోనే అభివృద్ధి 2
2/3

పర్యాటకంతోనే అభివృద్ధి

పర్యాటకంతోనే అభివృద్ధి 3
3/3

పర్యాటకంతోనే అభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement