రూటు మార్చి.. ఘాటు పెంచి | - | Sakshi
Sakshi News home page

రూటు మార్చి.. ఘాటు పెంచి

Mar 31 2025 11:30 AM | Updated on Mar 31 2025 12:03 PM

రూటు

రూటు మార్చి.. ఘాటు పెంచి

సాక్షి, మహబూబాబాద్‌ : యువత జీవితాలను నాశనం చేస్తున్న గంజాయి ఇప్పుడు ఆకు, పువ్వు రూపంలోనే కాదు.. లిక్విడ్‌ రూపంలోనూ లభిస్తోంది. గంజాయి రవాణాపై పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నిఘా పెంచిన నేపథ్యంలో స్మగ్లర్లు రూటు మార్చి.. ఘాటు పెంచి.. ఎక్కువ మత్తునిచ్చే గంజాయిని తక్కువ మోతాదుకు కుదించి.. రేటు పెంచి.. సునాయసంగా సరఫరా చేస్తున్నారు. పెద్ద బస్తాలు, ప్యాకెట్లు కాకుండా.. వాటర్‌ బాటిల్‌ సైజ్‌లో ఎవరికీ అనుమానం రాకుండా గమ్య స్థానాలకు చేరవేస్తున్నారు. ఇటీవల మహబూబాబాద్‌లో గంజాయి ఆశీష్‌ ఆయిల్‌ రవాణా చేస్తూ పట్టుబడిన ఘటనతో రూటు మార్చి గంజాయి స్మగ్లింగ్‌ విషయాలు బయటపడ్డాయి.

కిలో గంజాయితో వంద మిల్లీ లీటర్ల ఆయిల్‌..

కిలోల కొద్ది గంజాయి తరలించడం కన్నా.. కుదించి సరఫరా చేయడం సులభమని భావించిన స్మగ్లర్లు ఎంచుకున్న కొత్త పంథా ఆశీష్‌ ఆయిల్‌ తయారీ చేసి అమ్మకాలు చేయడం. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మొదలైన ఈ విధానం ఇతర ప్రాంతాలకు పాకినట్లు తెలుస్తోంది. గంజాయిని ఎక్కువ మోతాదు నీళ్లల్లో గంటల కొద్ది ఉడికించి, అందులో కొన్ని రసాయనాలు కలిపితే ఆశీష్‌ ఆయిల్‌ వస్తుంది. కిలో గంజాయికి 100 మిల్లీ లీటర్ల ఆయిల్‌ తీస్తారు. అంటే పదికిలోలకు ఒక లీటర్‌, క్వింటా గంజాయిని పది వాటర్‌ బాటిళ్లు అంటే పది లీటర్ల పరిమాణంలోకి కుదిస్తారు. ఇలా తయారీ చేసిన గంజాయి తైలం లీటర్‌ రూ.లక్ష నుంచి దూరం వెళ్లే కొద్ది రూ. 2లక్షలు కూడా పలుకుతున్నట్లు సమాచారం. ఏఓబీ(ఆంధ్ర–ఒడిశా బార్డర్‌) నుంచి భద్రాచలం మీదుగా మహబూబాబాద్‌, హైదరాబాద్‌, మహారాష్ట్ర, కొవ్వూరు, సూర్యాపేట నుంచి హైదరాబాద్‌, కర్ణాటక, నర్సీపట్నం నుంచి వైజాగ్‌ మొదలైన ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు ఇటీవల పట్టుబడిన స్మగ్లర్లు చెబుతున్నారు. తేనె, మిక్స్‌డ్‌ డ్రైప్రూట్స్‌ను పోలి ఉండే ఈ ఆశీష్‌ ఆయిల్‌ను చిన్న మోతాదుల్లో జిందా థిలిస్మాత్‌, సెంట్‌ సీసాల సైజ్‌లో ఉన్న బాటిళ్లలో పోసి గుట్టుచప్పుడు కాకుండా ఆర్డర్లపై సప్లయ్‌ చేస్తుండడం గమనార్హం.

మహబూబాబాద్‌లో

స్మగ్లర్‌ నుంచి పట్టుకున్న ఆశీష్‌ ఆయిల్‌(ఫైల్‌)

గంజాయి రవాణాలో స్మగ్లర్మ కొత్త పంథా

ఏఓబీ నుంచి తెలంగాణ, మహారాష్ట్రకు

ఆశీష్‌ ఆయిల్‌గా మార్చి విక్రయాలు

లీటర్‌ గంజాయి ఆయిల్‌ ధర

రూ. 2 లక్షలు

శీతల పానీయాలు,

ఐస్‌క్రీమ్‌, చాక్లెట్లలో మిక్సింగ్‌

సులభంగా మిక్సింగ్‌..

యువత వినియోగించే సిగరెట్లు, తినుబండారాల్లో కలిపేందుకు సాధారణ గంజాయి కన్నా.. ఆశీష్‌ ఆయిల్‌ కలపడం సులభంగా ఉంటుంది. ప్రధానంగా కుల్ఫీ, ఐస్‌క్రీమ్‌, కూల్‌ డ్రిక్‌, చాక్కెట్‌, కేక్‌, స్వీట్లు మొదలైన తినుబండారాలు, సిగరెట్లు, కట్‌చీప్స్‌పై వేసుకొని పీల్చ డం, మొదలైన పద్ధతుల్లో వాడేందుకు అనుకూలంగా ఉంటుంది. అయితే మామూలు గంజాయి కన్నా.. పదిరెట్లు ఈ లిక్విడ్‌ గంజాయి మ త్తెక్కించే గుణం ఉంటుంది. అందుకో సమే సూక్ష్మ పరిమాణంలో కలిపితే సరిపోతుంది.

రూటు మార్చి.. ఘాటు పెంచి1
1/2

రూటు మార్చి.. ఘాటు పెంచి

రూటు మార్చి.. ఘాటు పెంచి2
2/2

రూటు మార్చి.. ఘాటు పెంచి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement