
కాజీపేట మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : వేసవిలో ప్రయాణికుల సౌకర్యార్థం కాజీపేట జంక్షన్ మీదుగా ఏప్రిల్ 6వ తేదీ నుంచి చర్లపల్లి–హజ్రత్‌నిజాముద్దీన్ మధ్య 13 రైళ్ల సర్వీస్‌లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ ఆదివారం తెలిపారు.
వేసవి ప్రత్యేక రైళ్ల సర్వీస్ వివరాలు..
చర్లపల్లి నుంచి ఏప్రిల్ 6వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు ప్రతీ ఆదివారం చర్లపల్లి–హజ్రత్‌నిజాముద్దీన్ (07023) ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తుంది. అదేవిధంగా హజ్రత్‌నిజాముద్దీన్‌లో ఏప్రిల్ 8వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకు ప్రతీ మంగళవారం హజ్రత్‌నిజాముద్దీన్–చర్లపల్లి (07024) ఎక్స్‌ప్రెస్ బుధవారం కాజీపేట జంక్షన్‌కు చేరుకుంటుందని తెలిపారు. 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ కోచ్‌లతో ప్రయాణించే ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీస్‌లకు అప్ అండ్ డౌన్ రూట్‌లో కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్‌కాగజ్‌నగర్, బల్హార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, భోపాల్, బీనా, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా స్టేషన్‌లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.
చర్లపల్లి–హజ్రత్‌నిజాముద్దీన్
మధ్య 13 సర్వీస్‌లు