
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని కేససముద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డుపక్కనే ఉన్న పాడుబడిన బావిలోకి ఓ కారు దూసుకెళ్లింది. కాగా, ప్రమాదం జరిగిన సందర్భంలో కారులో ఏడుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం.
వివరాల ప్రకారం.. బాణోత్ భద్రునాయక్ కుటుంబ సభ్యులు భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి నుంచి అన్నారం షరీఫ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు ప్రమాదానికి గురైన సమయంలో బాణోత్ భద్రునాయక్, ఆయన భార్య సుమలత, కొడుకు దీక్షిత్‌తో పాటు డ్రైవర్ గుగులోతు బిక్కు, ఆయన కోడలు అచ్చాలి సహా మరో ఇద్దరు మహిళలున్నారు.
కాగా, కారు ప్రమాదంలో ఇప్పటి వరకు ఇద్దరు మహిళల మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదం నుంచి డ్రైవర్ గుగులోతు బిక్కు, ఆయన కోడలు ఆచాలి ప్రాణాలతో బయటపడ్డారు. బావిలో ఉన్న బానోతు భద్రునాయక్ ఆయన భార్య సుమలత, కొడుకు దీక్షిత్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్రేన్ సాయంతో కారును బయటకు తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment