సాక్షి, గుంటూరు: ప్రత్తిపాడు మండలం పెద్ద గొట్టిపాడులో తెలుగుదేశం నాయకుల రౌడీయిజానికి దిగారు. జడ్పీ హైస్కూల్‌లో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక వ్యవహారంలో తెలుగు తమ్ముళ్లు అరాచాకానికి పాల్పడ్డారు. విద్యా కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులతో బూసి యేసు మరియమ్మ చైర్మన్‌గా ఎంపికయ్యారు. దీంతో మరియమ్మ గెలిచనట్లు అధికారులు ప్రకటించారు.
అయితే అధికారులపై ఒత్తిడి తెచ్చిన టీడీపీ నేతలు.. బూసి ఏసు మరియమ్మ పానెల్ గెలుపును రద్దు చేయించారు. అంతేగాక వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై దాడి చేసి పోలీసులు సహాయంతో బయటకు నెట్టేశారు. అనంతరం తెలుగుదేశం మద్దతుదారుల ప్యానెల్ గెలిచినట్టు అధికారులతో ప్రకటన చేయించుకున్నారు.
విషయం తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు భారీ స్థాయిలో జడ్పీ హైస్కూల్‌కు తరలి వచ్చారు. ప్రజాస్వామ్య బద్దంగా ఒక దళిత మహిళ చైర్మన్ అయితే ఎందుకు రద్దు చేశారంటూ ఇంచార్జి ప్రిన్సిపాల్‌తో తల్లిదండ్రుల వాగ్వాదానికి దిగారు. తమ పిల్లలకు టీసీలు ఇచ్చేయమని పట్టుబట్టారు. ఉదయం నుంచి పిల్లల టీసీల కోసం గొడవ చేశారు.
చైర్మన్ పదవికి దళిత మహిళ పనికి రానప్పుడు స్కూల్లో పిల్లలకు ఎలా న్యాయం జరుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక దళిత మహిళకు అన్యాయం చేసి చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి.. ఓడిపోయిపి ఎలా చైర్మన్ పదవి కట్టబెడతారంటూల్లి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment