
దుబ్బాకటౌన్: సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాకకు చేసిన సేవలు మరువలేనివని.. సీఎం కేసీఆర్ మెచ్చిన గొప్ప ఎమ్మెల్యే రామలింగన్న అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సంతాపసభకు ఆయన హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామలింగారెడ్డి కుటుంబీకులకు మంత్రి హరీశ్‌రావు ఆత్మీయ భరోసానిచ్చారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచిన లింగన్న.. శాసనసభ్యుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారన్నారు. విప్లవకారుడిగా, జర్నలిస్టుగా, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, అంచనాల కమిటీ చైర్మన్‌గా రాష్ట్రానికి రామలింగారెడ్డి ఎనలేని సేవలు అందించారని అన్నారు. ఆయన ఆశయాలు నేరవేర్చేందుకు అందరం కృషి చేసినప్పుడే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment