రెండు రాష్ట్రాల ప్రేమకథ | Love Story Inspite Of Different States | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాల ప్రేమకథ

Published Fri, Feb 14 2020 10:38 AM | Last Updated on Fri, Feb 14 2020 10:38 AM

Love Story Inspite Of Different States - Sakshi

సాక్షి, నర్సాపూర్‌ : ఆంధ్రా అమ్మాయి, తెలంగాణ అబ్బాయి ప్రేమ పడి పెండ్లి చేసుకొని ఇద్దరు కుమారులతో కలిసి కాపురం చేస్తు ప్రేమికులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం సోమక్కపేట పంచాయతీ పరిధిలోని రహింగూడ తండాకు చెందిన గిరిపుత్రుడు దేవసోత్‌ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పచి్చమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లి గ్రామానికి చెందిన రాధికలు ప్రేమించుకొని 2009లో పెండ్లి చేసుకున్నారు. 20007–2008లో తుప్రాన్‌ మండల కేంద్రంలోని ఓప్రవేట్‌ ఆసుపత్రిలో దేవసోత్‌ శ్రీనివాస్‌ కంపౌడర్‌గా, రాధిక నర్సుగా పనులు చేస్తున్న సమయంలో వీరి పరిచయమై ప్రేమలో పడ్డారు. వీరిద్దరు కూలాలు వేరు వేరు కావడంతోపాటు తెలంగాణ, ఆంధ్రా కావడంతో పెద్దలు వీరి ప్రేమ పెండ్లికి ఓప్పుకోలేదు.

ఇద్దరు కలిసి ఐదు నెలల పాటు రెండు కటుంబాలను ఓప్పించుకోని పెండ్లి చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం నిరంజన్‌ 8, నవదీప్‌ 6 వయస్సుగల ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరికి ఆసుపత్రిలలో పనిచేసిన అనుభవంతోపాటు శ్రీనివాస్‌ ఆర్‌ఎంపీ ట్రైనింగ్‌ చేయడంతో 2011లో నర్సాపూర్‌ మండలం తుజాల్‌పూర్‌ గ్రామంలో ప్ర«థమ చికిత్స క్లినిక్‌ను నడుపుకుంటు పిల్ల పాపలతో సంతోషంగా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా ఉంటున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement