
గజ్వేల్: రాష్ట్రంలో పత్తికి మంచి ధర లభిస్తోంది. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో క్వింటాలుకు గరిష్టంగా రూ.8,421 పలికింది. ఈ–నామ్ (నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) ద్వారా 109 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరగ్గా.. ఇందులో గరిష్టంగా రూ.8,421, మోడల్ ధరగా రూ.8,263, కనిష్టంగా రూ.8,200 పలికిందని మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్‌వెస్లీ, సూపర్‌వైజర్ మహిపాల్ తెలిపారు. అతివృష్టి కారణంగా దిగుబడులు పడిపోయి తీవ్రమైన నష్టాల్లో ఉన్న రైతులకు ఈ పరిణామం కొంత ఊరటనిస్తోందని వారు అన్నారు.